Vadlamudi Gopalakrishnayya
Quick Facts
Biography
సాహితీ పుంభావ సరస్వతిగా, వాఙ్మయ మహాధ్యక్ష అనే బిరుదుతో అనేక శాస్త్రాలలో నిష్ణాతుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పరిశోధకుడిగా సుపరిచితుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య.
జీవిత విశేషాలు
కృషాజిల్లా కౌతవరం గ్రామంలో రంగారావు, సరస్వతమ్మ దంపతులకు 1928 అక్టోబరు 24న జన్మించిన వడ్లమూడి సంస్కతంలో భాషా ప్రవీణ వరకు చదువుకున్నారు. తెలుగు, సంస్కత భాషలలో లోతైన పరిశోధనలు చేసి జనరంజక రచనలు అందించారు. సంస్కతం, ఆంద్రం, ఖగోళం, జ్యోతిష్యం, వాస్తు, శిల్ప, నాట్య వేదం, జర్నలిజం, చంధస్సు, అలంకారం, ఆయుర్వేదం, మంత్ర శాస్తాలలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వడ్ల మూడి 24 శాస్తాలలో చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారాన్ని ప్రదానం చేసింది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. గాంధీ శతకం, మానవులు, జయదేవకృతి, ప్రజా నీతి గేయాలు, అమ్మ, వ్యవహార భాష లిపి ధ్వని, వ్యవహారిక భాషా వ్యాకరణం, మనిషి, మహర్షి, ఆయుర్వేదం, బాలన్యాయదర్శనం, జానుతె నుగు, మార్గాదేశి, ఆరవీటి వంశ చరిత్ర, మహాయోగం, కృష్ణ శతకం వంటి కావ్యాలతోపాటు తీరని రుణం, రాజహంస నాటికలను రచించారు. వేదాస్ క్రియేషన్ ఆంగ్ల గ్రంథంలో వేదాల సారాంశాన్ని సోదాహరణంగా వివరించారు. మహాయోగం, కృష్ణశతశతి కావ్యాలను 10వేలకు పైగా పద్యాలతో రచించారు. గిడుగు, గాడిచర్ల వంటి సాహితీమూర్తులు వడ్లమూడిని వాజ్మయ మహాధ్యక్ష బిరుదుతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సమూల శ్రీమదాంధ్ర రుగ్వేద సంహిత రచనకు వడ్లమూడి సంపాదకత్వం వహించారు. పొన్నూరు సంస్కత కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేశారు. రాష్ర దేవాదాయ శాఖ ప్రచురించిన ఆరాధన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పత్రికకు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్చలిఖిత భాండాగారానికి వ్యవస్థాపక డైరెక్టరుగా వ్యవహరించారు...