V. M. Abram
Quick Facts
Biography
వి.ఎం. అబ్రహం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున అలంపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జననం, విద్య
అబ్రహం 1946, ఏప్రిల్ 20న వెంకటయ్య - గోవిందమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని వల్లూరు గ్రామంలో జన్మించారు. అలంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు, గద్వాలలో ఏడో తరగతి వరకు, మహబూబ్‌నగర్‌లో ఇంటర్ వరకు చదివారు. 1974లో హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేశారు.
వృత్తి జీవితం
డాక్టర్ చదివిన తరువాత 12 ఏళ్ళపాటు అరబ్ దేశాల్లో (ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాల్లో) వైద్యుడిగా పనిచేశారు. తరువాత కర్నూలుకి వచ్చి, కృష్ణానగర్‌లో క్లినిక్ ఏర్పాటుచేశారు. 22 ఏళ్ళపాటు రోగుల నుంచి రూ.5 ఫీజు మాత్రమే తీసుకొని వైద్యం చేశారు.
వ్యక్తిగత జీవితం
అబ్రహంకు విజయలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (జ్యోతి, మాన్‌సి), ఒక కుమారుడు (అజయ్) ఉన్నారు.
రాజకీయ విశేషాలు
2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున అలంపూర్ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ పై గెలుపొందారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా[తెలుగుదేశం పార్టీ] అభ్యర్థిగా పోటీచేసి సమీప [భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]అభ్యర్థి సంపత్ కుమార్ పై 6,730 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తదంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ పై 44,679 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆయనకు 2023లో ఎన్నికలలో ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన, ఆ తరువాత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అనుచరుడు విజయుడికి బీ ఫామ్ ఇవ్వడంతో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నవంబర్ 24న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
ఎమ్మెల్యేగా సేవలు
2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు రూ. 580 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుగా ఉన్న అలంపూర్ మండలంలో రూ.66 కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. రూ. 6.25కోట్లతో ఐదు మండల కేంద్రాల్లో కేజీబీవీ భవనాలు, రూ.1.50 కోట్లతో అలంపూర్, అయిజలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల భవనాలు నిర్మించారు. అలంపూర్ చౌరస్తా–అయిజ రహదారిని రూ.78 కోట్లతో ఆధునీకీకరించారు. రూ.14కోట్ల వ్యయంతో ఎస్సీ రెసిడెన్షియల్ భవనం, రూ.10 కోట్లతో అలంపూర్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.