T. Chandrakanthamma
Quick Facts
Biography
టి. చంద్రకాంతమ్మ భరతనాట్య కళాకారిణి.
విశేషాలు
ఈమె మైసూరు రాజ్యంలోని తిరుమకూడలు గ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఈమె తన బాల్యం నుండి భరతనాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసింది. ఈమె నాట్యాన్ని అరణి అప్పయ్య వద్ద, అభినయాన్ని మైసూరు ఆస్థాన విద్వాంసుడు కాశీ గురువునుండి, సంగీతాన్ని బి.రాచప్ప నుండి అభ్యసించింది. తిరువాయూర్ సుబ్రహ్మణ్య అయ్యర్ నుండి ఉన్నత శిక్షణను తీసుకుంది.
ఈమె మైసూర్ మహారాజు కృష్ణరాజ ఒడయార్ IV మెప్పును పొంది మైసూర్ సంస్థానంలో ఆస్థాన నర్తకిగా పనిచేసింది.
గీతాగోవిందం, రాజశేఖర విలాసం కావ్య భాగాలలో ఈమె అభినయాన్ని చూసి కళాప్రియులు ఈమె ప్రతిభకు తలలూపినారు. సంస్కృత శ్లోకాలకు, జావళీలకు ఈమె ధ్వనిముద్రలు జనప్రియమైనవి.
1964-65 సంవత్సరానికి కర్ణాటక సంగీత నాటక అకాడమీ అవార్డును ఈమెకు ప్రకటించింది. 1971లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో ఈమెను గౌరవించింది.