Suguna Varadachari
Quick Facts
Biography
సుగుణా వరదాచారి తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు.
విశేషాలు
ఈమె తమిళనాడు రాష్ట్రంలోని దారాపురం గ్రామంలో 1945, డిసెంబర్ 20వ తేదీన జన్మించింది. ఈమె పి.కె.రాజగోపాల అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, కె.ఎస్.కృష్ణమూర్తిల వద్ద సంగీతం నేర్చుకుంది. ఈమె గాత్ర సంగీతంతో పాటుగా వీణావాద్యంలో కూడా ప్రావిణ్యాన్ని సంపాదించింది. ఈమె 1984 నుండి 2004 వరకు మద్రాసు విశ్వవిద్యాలయంలో పనిచేసింది. చెన్నైలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బోర్డు మెంబర్‌గా, మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల కమిటీ సభ్యురాలిగా సేవలను అందించింది. ఈమె దేశవిదేశాలలో జరిగిన సెమినార్లలో పాల్గొని సంగీత విషయాలపైప్రసంగాలు చేసింది. ఈమె ఆకాశవాణిలో ఏ- గ్రేడు కళాకారిణిగా అనేక కార్యక్రమాలు ఇచ్చింది. దేశవిదేశాలలో అనేక సంగీత ఉత్సవాలలో పాల్గొనింది.
పురస్కారాలు
ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలోకొన్ని:
- 2007లో సుస్వర సంస్థచే "సంగీత కళాజ్యోతి"
- 2011లో అమెరికా క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఉత్సవంలో "ఆచార్య రత్నాకర"
- 2011లో మద్రాసు సంగీత అకాడమీ, చెన్నై వారిచే "సంగీత కళాచార్య"
- 2014లో షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్, ముంబై వారిచే "సంగీత్ ప్రాచార్య"
- 2015లో కేంద్ర సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ వారిచే సంగీత నాటక అకాడమీ అవార్డు