peoplepill id: solipeta-ramachandra-reddy
SRR
India
6 views today
6 views this week
Solipeta Ramachandra Reddy
Politician from Siddipet, Telangana

Solipeta Ramachandra Reddy

The basics

Quick Facts

Intro
Politician from Siddipet, Telangana
Places
Work field
Gender
Male
Place of death
Hyderabad, Hyderabad State, British Raj, India
The details (from wikipedia)

Biography

సోలిపేట రామచంద్రారెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు, తొలితరం కమ్యూనిస్టు నేత. 70 ఏళ్ళ తన రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసిన రామచంద్రారెడ్డి సర్పంచ్ స్థాయినుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నత స్థాయికి ఎదిగాడు.

జననం

రామచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, చిట్టాపూర్ గ్రామంలో జన్మించాడు. సిటీ కళాశాల నుండి పట్టా పొందాడు.

కుటుంబం

రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు.

ఉద్యమ జీవితం

తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో రామచంద్రారెడ్డి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం

తొలినాళ్ళలో స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశాడు.

1972లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరుపున దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 32,297 (67.28%) ఓట్లు సాధించి స్వతంత్ర్య అభ్యర్థి రామారావుపై 16,592 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,576 (28.34%) ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.

కొంతకాలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు.

ఇతర వివరాలు

రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం, భారత చైనా మిత్రమండలికి అధ్యక్షుడిగా, సి.ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా పనిచేశాడు.

మరణం

రామచంద్రారెడ్డి అనారోగ్యంతో 2023, జూన్ 27న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో మరణించాడు. ఇతని మృతికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించాడు.

మూలాలు

  1. Velugu, V6 (2023-06-27). "మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత". V6 Velugu. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.{{cite web}}:CS1 maint: numeric names: authors list (link)
  2. "TS: సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత". Sakshi. 2023-06-27. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  3. "రాజ్యసభ మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత". Prajasakti (in ఇంగ్లీష్). 2023-06-27. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  4. "మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత". Prabha News. 2023-06-27. Archived from the original on 2023-06-27.
  5. ABN (2023-06-27). "Passed Away: మాజీ రాజ్యసభ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  6. telugu, NT News (2023-06-27). "CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం". www.ntnews.com. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  7. "తొలితరం ప్రజానేతను తెలంగాణ కోల్పోయింది: మాజీ ఎంపీ సోలిపేట మృతిపై కేసీఆర్ సంతాపం". EENADU. 2023-06-27. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Solipeta Ramachandra Reddy is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Solipeta Ramachandra Reddy
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes