peoplepill id: s-d-v-aziz
S
2 views today
1 views this week
S.D.V.Aziz
Telugu writer

S.D.V.Aziz

The basics

Quick Facts

Intro
Telugu writer
A.K.A.
S.D.V.Azeez S.D.V.Ajij sdv ajij
Work field
Birth
Age
61 years
The details (from wikipedia)

Biography

ఎస్‌.డి.వి. అజీజ్‌ చరిత్రకారుడు, రచయిత.

జీవిత విశేషాలు

ఎస్.డి.వి అజీజ్ 1964 ఆగస్టు 11న మోహమున్సీసా, బాబూసాహెబ్‌ దంపతులకు జన్మించాడు. తండ్రి రంగస్థల కళాకారుడు. తన తండ్రికి బొబ్బిలి యుద్ధం నాటకంలోని రంగారాయుడు పాత్ర ఆయనకు ప్రీతీపాత్రమైనది. అదే పాత్రలో నటిస్తూ కన్నుమూశాడు. అజీజ్‌కు కళాకారుల కుటుంబ నేపధ్యం ఉన్నందున తన రచనలకు చిన్నప్పుడే బీజం పడింది. అతను కర్నూలు లోని కోల్సు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. అక్కడ తెలుగు అధ్యాపకుడైన "ప్రసాద్ బాబు" అజీజ్ లోని రచయితను గుర్తించి ప్రోత్సహించాడు. తరువాత ఉస్మానియా కళాశాలలో బి.ఎ. చదివాడు. అక్కడి గ్రంథాలయంలో ఉన్న మంచి సాహిత్య, చరిత్ర పుస్తకాలన్నింటినీ కొద్దికాలంలోనే చదివేశాడు. చిదంబరరావు వీధిలోని కేంద్ర గ్రంథాలయంలో గల పుస్తకాలను కూడా అధ్యయనం చేసాడు. మంచి మంచి పుస్తకాలెన్నీంటినో చదవటం ఇతరులతో చర్చించటం, విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం అతనికి అలవాటయ్యింది. చరిత్ర విద్యార్థి కాబట్టి వెలుగులోకి రాని నిజాల్ని, పోరాటాల్ని బయటకు తేవాలన్న తపన ఉన్నట్టు అతని రచనల వల్ల తెలుస్తుంది. మయూరి వారపత్రికలో ఇరవై వారాలకు పైగా తెరమరుగైన చారిత్రక సత్యాలు శీర్షికన వ్యాసాలు రాసాడు. చలం, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు, గోపిచంద్‌, పులికంటి కృష్ణారెడ్డి లు అతనికి ఇష్టమైన కవులు. ఎవరి కవిత్వమైనా పదికాలాలపాటు నిలవాలంటే సొంత శైలి ఉండటం అవసరమని అజీజ్‌ చెబుతాడు. మనుషుల భావాల్ని కవితలో చెప్పినట్లు ఇతర ప్రక్రియల్లో చెప్పలేమని చెబుతాడు. చరిత్రలో వాస్తవంగా జరిగిన ఇతివృత్తాలు వేరు వేరు కారణాల వల్ల మరుగున పడిపోతున్న నేపధ్యంలో దుమ్ముపట్టిన చిరిత్రను వెలికి తీసి, వాటికి తన నాటకీయత జోడించి, మన కళ్ల ముందే జరిగినట్టు రాయడం అతని రచనలలోని విశేషం. తెరణెకంటి ముట్టడి, గులాం రసూల్‌ఖాన్‌, పాలెగాడు, తదితర చారిత్రక నవలలు చదివితే మనకా విషయం తెలుస్తుంది. 1857 అంటే ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికంటే ముందే జరిగిన ఈ దేశభక్తి పోరాటాలు చరిత్రలో నమోదు కావాలని ఆయన ఆకాంక్ష.

రచనలు

అజీజ్‌ రచనా వ్యాసంగాన్ని తీసుకుంటే 40 దాకా కవితలు, నాలుగు చారిత్రక నవలలు, 50 దాగా రేడియో నాటికలు, నాటకాలు, రూపకాలు ఉన్నాయి. సామ అన్న నాటకానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. స్టేజీ నాటకాలు ఐదు రాశారు. అందులో ప్రకాశం పంతులుపై రాసింది కూడా ఉంది. వందకు పైగా కథలు, భారతదేశంలో స్త్రీ పరిశోధనా గ్రంధం, ఐదు సాంఘిక నవలలు, బాలల కథలు 30, డిటెక్టివ్‌ కథలు 20 రాశారు.

  • పాలెగాడు : చారిత్రక నవల - నరసింహారెడ్డి సాహసగాథ
  • సామా : బానిస వ్యవస్థ పై రాయబడిన రచన, జాతీయ స్థాయి లో బహుమతి పొందిన రచన
  • అల్లాఉద్దీన్ అధ్బుత దీపం.
  • బతుకు చిత్రం
  • గులాం రసూల్ ఖాన్ : 1839లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చివరి నవాబు గులాం రసూల్ ఖాన్ పోరాట చరిత్ర.
  • తుర్రెబాజ్ ఖాన్
  • తడి (కథల సంఫుటి)
  • గౌతమ బుద్ధుడు
  • రాబిన్‌సన్ క్రూసో
  • మనిషి (కథల సంఫుటి)
  • బుడ్డా వెంగళరెడ్డి- చారిత్రిక నవల
  • గెలివర్ సాహసయాత్రలు
  • భారతదేశంలో స్త్రీ

కథలు

అతను రాసిన కథలు వివిధ దిన, వార, త్రైమాసిక , పక్ష పత్రికలలో ప్రచురితమయ్యాయి.

కథపత్రికపత్రిక అవధిప్రచురణ తేది
అనుభూతిఆంధ్రజ్యోతివార పత్రిక1999-05-07
అనైతికంస్వాతిమాస పత్రిక2004-03-01
అరణ్యరోదనఆంధ్రప్రభవార పత్రిక1989-02-15
ఆత్మతృప్తిప్రియదత్తవార పత్రిక2005-08-31
ఆదర్శంఆంధ్రభూమిఆదివారం అనుబంధం2004-10-31
ఆనందంఆంధ్రభూమిఆదివారం అనుబంధం2009-03-01
ఎన్నోరాత్రిస్వాతివార పత్రిక2004-11-26
ఖాన్ కో సలామ్మయూరివార పత్రిక1994-04-08
జీవితంనవ్యవార పత్రిక2006-03-08
తీరిన కోరికఈనాడుఆదివారం అనుబంధం2004-08-22
తెర తెరచి చూస్తేమయూరివార పత్రిక1994-05-13
దత్తతప్రస్థానంత్రైమాసిక పత్రిక2006-04-01
పరితప్తంఆంధ్రప్రభవార పత్రిక1988-05-11
ప్రేమవైఫల్యంజ్యోతిమాస పత్రిక1990-05-01
బతుకు చిత్రంఆంధ్రభూమిఆదివారం అనుబంధం2007-08-26
బాధ్యతస్వాతిమాస పత్రిక2008-08-01
మరుభూమిలోస్వాతివార పత్రిక2004-04-30
మరో శ్రీనాధుడుమయూరివార పత్రిక1994-04-29
మహాపరిత్యాగిమయూరివార పత్రిక1994-04-01
మారాలిమనంకథాకేళిమాస పత్రిక2008-03-01
రుణంనవ్యవార పత్రిక2005-10-12
రేపటి తరంస్వాతిమాస పత్రిక2002-12-01
విజయనగరంనవ్యవార పత్రిక2007-09-26
విషపు నవ్వుఅన్వేషణవార పత్రిక1995-12-26
స్మృతి పధంపత్రికమాస పత్రిక2005-12-01
స్వేచ్ఛఆంధ్రభూమిమాస పత్రిక2006-04-01

మూలాలు

బయటి లంకెలు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
S.D.V.Aziz is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
S.D.V.Aziz
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes