peoplepill id: palakodeti-satyanarayana-rao
PSR
1 views today
2 views this week
Palakodeti Satyanarayana Rao

Palakodeti Satyanarayana Rao

The basics

Quick Facts

The details (from wikipedia)

Biography

పాలకోడేటి సత్యనారాయణరావు, ప్రముఖ సాహితీవేత్త. ఇతను రచయిత, కవి, బుల్లితెర దర్శకుడు,అనువాదకుడు.ఇతను 27 గ్రంథాలు, 100 మించిన సంఖ్యలో కథలు రచించాడు.పాలకోడేటి సత్యనారాయణ రావు,పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం గ్రామంలో 1948 డిసెంబరు 28న జన్మించాడు.తల్లి అలివేలు మంగతాయారు,తండ్రి అప్పారావు. చిత్తూరు జిల్లా, పెనుమూరులో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది.మాధ్యమిక విద్యాభ్యాసం కొంత కార్వేటినగరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తర్వాత మిగిలిన విద్యాభ్యాసం అంతా హైదరాబాదులో జరిగింది.హైదరాబాదులోని నాన‌క్‌రామ్‌ భగవాన్‌దాస్ సైన్స్ కళాశాలలో బి. యస్. సి. చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ లో ఎం.ఎస్.సి. టెక్, తర్వాత ఎం.ఎ. (తెలుగు)లో పట్టాలను పొందాడు.అంతటితో ఆగకుండా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. (ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ పట్టాలు పొందాడు. "భారతీయ చలనచిత్ర కథన శాస్త్రంపై హాలివుడ్ ప్రభావం" అనే సిద్దాంత వ్యాసానికి హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తులనాత్మక సాహిత్య పీఠం నుంచి 2008 పి. ఎచ్. డి. , పట్టాను పొందాడు. హైదరాబాదులోని అక్కౌంటెంట్ జనరల్ (అక్కౌంట్స్ అండ్ ఎన్‌టైటిల్‌మెంట్) కార్యాలయంలో 1971 జూన్ 29న సీనియర్ అక్కౌంటెంట్‌గా అతని ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అదే కార్యాలయంనుంచి 2007 మార్చి30న అదే హోదాలో స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసాడు.

రచనా రంగంవైపు మలుపు

సత్యనారాయణ రావు చిన్నతనంలో అతని అన్న వెంకటేశ్వరరావు కథలు రాసేవాడు.ఆస్ఫూర్తితో సత్యనారాయణ రావు కూడా తెలుగు కథలు రాయటం ఆరంభించాడు. అలా కథలు, నవలల రచనలలో నిమగ్నం అయ్యారు.తర్వాత కాలంలో 'మీ జి. పి. యఫ్. హేండ్‌బుక్‌' తయారుచేసాడు. అలాగే, 'మీ ఏ.పి. జి.యల్.ఐ. అనే పేరుతో హ్యాండ్‌బుక్‌', పంచాయితీరాజ్ ఉపాధ్యాయులు కోసం 'లీవ్‌రూల్స్ హ్యాండ్‌బుక్‌'లనూ వెలువరించాడు పాలకోడేటి.

ఈనాడు సంస్థతో అనుబంధం

సత్యనారాయణ రావుకు 1976 నుంచి ఈనాడు సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాలకోడేటి ఈనాడు పత్రికలో దాదాపు 18 సంవత్సరాలు 'జ్ఞాననేత్రం', 'భూభ్రమణం', 'సిరిసిరికబుర్లు', 'ప్రతిభ', 'గుడ్ హెల్త్', వంటి అనేక శీర్షికలను నిర్వహించాడు.తెలుగులో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విజ్ఞానంపై ఈనాడు దిన పత్రికలో 'కంప్యూటర్ చిప్‌చాట్' అనే శీర్షికను 13 సంవత్సరాలు ఏకధాటిగా నిర్వహించాడు.ఈనాడు ఆదివారం అనుబంధం కోసం, వందల సంఖ్యలో కవర్ పేజీ వ్యాసాలతో బాటు, 'శ్రీకళ్యాణ్' అనే కలం పేరుతో సైన్స్ వ్యాసాలు,'అనూరాధ' అనే పేరుతో 'మహిళల ఆరోగ్యం'పై అనేక శీర్షికలను నిర్వహించాడు.'ఈనాడు టెలివిజన్'లో మేధ, హృదయం, హార్టుబీట్, ముందుచూపు, ఇంద్రధనుస్సు, స్వీట్ హోం బాటు పరిపూర్ణ మహిళ సిరీస్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కు దర్శకత్వం వహించాడు.ఈనాడు టెలివిజన్‌లో మేధ,హృదయం, హార్ట్‌బీట్, ఇంద్రధనుస్సు, స్వీట్‌హోమ్,గ్లోబల్ సహాయ వంటి అనేక టెలీసీరియల్స్ తో బాటుగా పరిపూర్ణ మహిళ సిరీస్‌లో రచన. దర్శకత్వ భాధ్యతలను నిర్వహించాడు.

ప్రస్తుతం ఈటీవీ సినిమా ఛానల్ కోసం పాలకోడేటి రచన,దర్శకత్వంలో రూపొందుతున్న అపురూప చిత్రాలు అనే తెలుగు ఉత్తమ చిత్రాల పరిచయ కార్యక్రమం, ప్రతి ఆదివారం ఈటీవీ సినిమా ఛానళ్లలోనూ, తర్వాత రిపీట్‌గా ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, ఈటీవీ తెలంగాణ చానళ్లలోనూ ప్రసారం అవుతోంది.అలాగే ఈటీవీ సినిమా చానల్లో ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఏ రోజున ఏమి జరిగింది అనే సినీ విశేషాల మాలికను సినీకథ పేరుతోనూ పాలకోడేటి నిర్వహిస్తున్నాడు. ఇది ప్రతిరోజూ ప్రసారమవుతుంది.

ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలపై పాటలు

టీవీ 5 న్యూస్ చానల్‌లో తొలి క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన రోజుల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాలపై నేలతల్లికి నీరాజనం పేరిట అన్ని జిల్లాలపై పాటలు రచించాడు పాలకోడేటి.

ఇతర సంస్థలతో పాలకోడేటి అనుబంధం

'సితార' సినీపత్రికలో దాదాపు 500 తెలుగు సినిమాలకు సమీక్షలు రాసిన డా. పాలకోడేటి, అదే పత్రికలో వారంవారం ' బాలివుడ్ క్లాసిక్స్' అనే పేరుతో సుమారు 125 ఉత్తమ హిందీ చలన చిత్రాలను పరిచయం గావించాడు. అలాగే ఆంధ్రభూమి పత్రిక ఆదివారం అనుబంధంలో హాలివుడ్ క్లాసిక్స్ పేరిట దాదాపు 225 చలనచిత్రాల పరిచయ శీర్షికలను నిర్వహించాడు. చతుర మాస పత్రిక కోసం అరాజకీయం, దోషి, సాగర మధనం లాంటి అనేక నవలలు రాసాడు. విపుల పత్రిక కోసం ఇతర భాషా కధలను చాలా వాటిని తెలుగులోకి అనువదించాడు.

ముఖ్య గ్రంధ రచనలు

ఆకాశదీపాలు, మనస్సాక్షి,దృష్ట, కలిసి బతుకుదాం,మాయా బజార్,అక్షరమాల,ఓ కొమ్మపూలు వంటి నవలలు, ఏరుదాటినకెరటం,పాలకోడేటి కథలు పేరిట రెండు కథా సంకలనాలు వెలువడ్డాయి. అప్టెక్ కంప్యూటర్ సంస్థకై కంప్యూటర్ విద్యపై 'విద్య' పుస్తకం అనువదించారు.కర్నాటక రాష్ట్రంలోని యానగొందిలో సుప్రసిద్దమైన యోగిని జీవితగాథను 'మహాయోగిని శ్రీ మాతా మాణిక్యేశ్వరి' పేరిట ఒక పుస్తకాన్ని అనువదించారు.అలాగే కృష్ణచైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఏ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆంగ్లంలో రచించిన 'ది షెకండ్ చాన్స్' పుస్తకంను 'ద్వితీయ అవకాశం'గా తెలుగులోకి అనువదించాడు.

ఇవి గాక బాలివుడ్ క్లాసిక్,ఇంకొన్ని బాలివుడ్ క్లాసిక్, (బాలివుడ్ క్లాసిక్ రెండో సంపుటం) ముచ్బటైన బాలివుడ్ క్లాసిక్ (బాలివుడ్ క్లాసిక్ మూడో సంపుటం), హాలివుడ్ క్లాసిక్స్, మరికొన్ని హాలివుడ్ క్లాసిక్స్ (హాలివుడ్ క్లాసిక్స్ రెండో సంపుటం)లతో బాటుగా,బాలివుడ్ నటీమణి మీనాకుమారిపై 'మీనాకుమారి' అనే జీవితగాథనూ,'పాలకోడేటి వంశవైభవం' పేరిట అతని వంశ చరిత్రనూ, సంక్షిప్త బ్రాహ్మణ చరిత్రనూ రాసాడు.తిరుమల,తిరుపతి, తిరుచానూర్‌లపైన, శ్రీవెంకటేశ్వరస్వామిపైనా యాత్రికులకు ఉపయోగపడేలాగున ఏకైక సమగ్ర పుస్తకంగా ఇతను వ్రాసిన 'శ్రీవారి సన్నిధి' పాఠకుల అభిమానంతో అనేక ప్రచురణలు పొందింది.

పురస్కారాలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే తెలుగు భాషా పురస్కారం లభించింది. 2006లో ఫిల్మ్ ఫేర్ పత్రిక కోసం ఉత్తమ తెలుగు చలన చిత్రాల న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. ఎన్నో కథలు, నవలలు రాసిన పాలకోడేటి సత్యనారాయణ రావుకు మనస్సాక్షి,హిమ సుమాలు,అరాజకీయం వంటి నవలలకు, ఏరుదాటిన కెరటం,గోడలుమీద రాతలు,ఇహమూ పరమూ, అనే కథలకూ వివిధ పత్రికలు నుంచీ పురస్కారాలు లభించాయి.

కథానికలు న్యాయ నిర్ణేత

ఏజీ కార్యాలయ రంజని కథానికలు పొటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.

కుటుంబ నేపధ్యం

పాలకోడేటి సత్యనారాయణ రావు అతని సతీమణి అనూరాధతో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనుపమ, సాహితి, కుమారుడు శ్రీ కల్యాణ రామ్,తమ తమ ఉద్యోగాల నిమిత్తం, వారి వారి కుటుంబాలతో అమెరికా దేశంలో ఉంటున్నారు.

పాలకోడేటి రచనలు

నవలలు

  1. ఆకాశదీపాలు
  2. మనస్సాక్షి
  3. ప్రేమసంజీవిని
  4. కలిసి బతుకుదాం
  5. దృష్ట
  6. మాయాబజార్
  7. అక్షరమాల
  8. ఓ కొమ్మపూలు

కథల సంపుటాలు

  1. ఏరు దాటిన కెరటం
  2. పాలకోడేటి కథలు

ఇతర రచనలు

  1. భారతీయ చలనచిత్ర కథనశాస్త్రంపై హాలీవుడ్ ప్రభావం
  2. శ్రీవారి సన్నిధి (తిరుపతి,తిరుమల, తిరుచానూర్లపై సమగ్ర పుస్తకం)
  3. బాలీవుడ్ క్లాసిక్స్ (ఉత్తమ హిందీ వ్యాసాలపై సమీక్షా వ్యాసాల సంపుటి-1)
  4. ఇంకొన్ని బాలీవుడ్ క్లాసిక్స్ (ఉత్తమ హిందీ వ్యాసాలపై సమీక్షా వ్యాసాల సంపుటి-2)
  5. ముచ్చటైన బాలీవుడ్ క్లాసిక్స్ (ఉత్తమ హిందీ వ్యాసాలపై సమీక్షా వ్యాసాల సంపుటి-3)
  6. హాలీవుడ్ క్లాసిక్స్ (ఉత్తమ ఇంగ్లీసు వ్యాసాలపై సమీక్షా వ్యాసాల సంపుటి-1)
  7. మరికొన్ని హాలీవుడ్ క్లాసిక్స్ (ఉత్తమ ఇంగ్లీసు వ్యాసాలపై సమీక్షా వ్యాసాల సంపుటి-2)
  8. మీనాకుమారి (బాలివుడ్ నటీమణి విషాద చరిత్రపై నవల)
  9. మీ జిపియఫ్ హేండ్‌బుక్‌ (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జిపియఫ్ మీద సమగ్ర పుస్తకం)
  10. మీ ఏపిజియల్ఐ హేండ్‌బుక్‌ (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపిజియల్ఐ మీద సమగ్ర పుస్తకం)
  11. లీవ్‌రూల్స్ హ్యాండ్‌బుక్‌ (రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించే సెలవు నిబంధనలుపై పుస్తకం)
  12. పాలకోడేటి వంశవైభవం (పాలకోడేటి కుటుంబ వంశవృక్షం)
  13. సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర
  14. శుభోదయం (పాజిటివ్ యాటిట్యూడ్ పై 108 చిన్న కథల పుస్తకం)
  15. కొత్తతాళి
  16. హిమసుమాలు

అనువాదాలు

  1. విద్య (అప్టెక్ కంప్యూటర్ విద్యా సంస్థకై కంప్యూటర్ విద్యపై గైడ్)
  2. ద్వితీయ అవకాశం (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం -ఇస్కాన్-వారికై (ఏ.సి.భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆంగ్ల పుస్తకానికి అనువాధం)
  3. మహాయోగిని మాతా శ్రీ మాణిక్యేశ్వరి (యానగొంది మాతా శ్రీ మాణిక్యేశ్వరి పై పుస్తకం తెలుగు అనువాదం)

కథలు

ఇతని కథలు నివేదిత, జ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తక ప్రపంచం, చతుర, విపుల, ఆంధ్రజ్యోతి, యువ, రంజని, భారతి, స్వాతి, విజేత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రదేశ్, తరుణ, సౌమ్య, విజయ, ప్రజాతంత్ర, ఈనాడు, ప్రతిభ, చెలిమి, కృష్ణాపత్రిక, మయూరి, వనితాజ్యోతి, పల్లకి, జయమ్‌, నవ్య, స్మిత, స్రవంతి, జ్యోత్స్న, జయశ్రీ, స్నేహ తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. కథానిలయంలో లభ్యమౌతున్న ఇతని కథల వివరాలు:

  1. అంతులేని కథ
  2. అచ్చు తప్పులు
  3. అప్పు ఇవ్వను
  4. ఆ తప్పు చేయకు?
  5. ఆ గూటి గోరొంక
  6. ఆరని జ్వాల
  7. ఇంటి దీపం
  8. ఇంతే సంగతులు
  9. ఇది నరకం ఇది స్వర్గం
  10. ఇదీ పాతకథే
  11. ఇల జరిగిన కల్యాణం
  12. ఇహమూ పరమూ
  13. ఈ కథకు సిగ్గేలేదు
  14. ఈ కథకేదీ పారితోషికం
  15. ఈ కథలు మారేదెప్పుడు
  16. ఈ దేశమంతా సు-భద్రమే
  17. ఈ పిల్లకు పెళ్ళి కాదు!
  18. ఉదయగానం
  19. ఉద్యోగ విజయాలు
  20. ఏడడుగులు-మరో తప్పటడుగు
  21. ఏమున్నది గర్వకారణం?
  22. ఏరు దాటిన కెరటం
  23. ఒక్కండున్నీమొరాలకించడు
  24. కాటేసిన అందం
  25. కాటేసిన కల
  26. కోరిక
  27. కౌముది
  28. గీతోపదేశం
  29. చీకటి ఒప్పు
  30. చీకట్లో ముందుకు
  31. చెట్లు ఎండాయి-నోట్లు పండాయి
  32. చెప్పకూడని నిజం
  33. చేదోడు
  34. జీవధార
  35. జీవన వైరుధ్యాలు
  36. జ్యోతిర్గమయ
  37. టాక్సీ
  38. తప్పనిసరి
  39. తలుపు తెరవండి
  40. తల్లీ...గోదారీ...!
  41. తుఫాను
  42. త్యాగం
  43. దొంగలు
  44. దోపిడి
  45. ధన పంజరం
  46. ధర్మ యుద్ధం
  47. నటించను!
  48. నాకో తోడు కావాలి
  49. నాణానికి అటూఇటూ
  50. నాన్నా...నీవిలువెంత?
  51. నిజానికి నాలుగు గోడలు
  52. నువ్వొచ్చి వెలుగు నింపావు
  53. నూట ఒకటో తప్పు
  54. పార్వతి అడగని ప్రశ్న
  55. పునాదులు సమాధులు
  56. పువ్వులు
  57. పెళ్లాం ఉద్యోగం
  58. పేపర్ అండర్ కన్సిడరేషన్
  59. బక్క ఏనుగు
  60. బాండెడ్ లేబర్
  61. బొమ్మనోట్లు-బొరుసు మనుషులు
  62. బాష్పజలం
  63. మంచి గంధం
  64. మంచు చీర
  65. మనసు మరుభూమి
  66. మనసు చిత్రాలు
  67. మనసున ఉన్న ఆడది
  68. మనిషి మరోశిఖరం
  69. మనిషి మిగిలాడు
  70. మనుషులూ రాక్షసులూ
  71. మరో బొమ్మ
  72. మీదీ మాదీ ఒకే ఊరు
  73. మిత్రమా! ఓ మిత్రమా!
  74. ముసుగు మనిషి
  75. యాక్సిడెంట్
  76. యుగళగీతం
  77. యువర్స్ అన్ఫెయిత్ఫుల్లీ
  78. రంగుమార్చిన బొమ్మ
  79. రసజ్ఞులు
  80. రామరాజ్యం
  81. రాళ్ళేసే జనం
  82. రోడ్ రోలర్
  83. లెట్ దేర్ బి మోర్ లైట్
  84. వరద
  85. వర్ణచిత్రం
  86. వశీకరణమంత్రం
  87. వసంత
  88. వింత చీకట్లు
  89. విలువ పెరిగింది
  90. వెనకటి రోజులు
  91. వెలుగు
  92. వెలుగెక్కడ
  93. శాంతి
  94. శ్రేయోభిలాషి
  95. సమాంతర రేఖలు
  96. సాక్షాత్కారం
  97. సాగరమథనం
  98. సుబ్బలక్ష్మి సఖుడి కథ
  99. సూట్ కేస్
  100. సూర్యుడింకా పుట్టలేదే
  101. సృష్టిలోలేనిది
  102. సెపరేషన్ జిందాబాద్ లేక మధ్యవర్తి ముర్దాబాద్ అనే సమైక్య కుటుంబం కథ
  103. సేమ్ కాయిన్
  104. సోయే నదియా జాగే పానీ
  105. స్వార్థం చావదు!
  106. స్వేచ్ఛ

మూలాలు

వెలుపలి లంకెలు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Palakodeti Satyanarayana Rao is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Palakodeti Satyanarayana Rao
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes