Nelluri Kesavaswamy
Quick Facts
Biography
నెల్లూరి కేశవస్వామి (1920 - 1984) తొలితరం తెలంగాణ రచయిత, అనువాదకుడు.
జననం
నెల్లూరి కేశవస్వామి 1929 హైదరాబాద్ లో జన్మించాడు.
ఉద్యోగ జీవితం
ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన కేశవస్వామి చాలాకాలం నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు.
రచన రంగం
కేశవస్వామి కథలు, నవలలు, అనువాద నవలలు రచించారు. వీరి తొలి కథాసంపుటి పసిడి బొమ్మ. కేశవస్వామి కథాసంకలనం "చార్మినార్" ఆయనకు పురస్కారాలు, ప్రఖ్యాతి సంపాదించిపెట్టింది. "వెలుతురులో చీకటి" శీర్షికన వెలువడ్డ వీరి నవల ప్రసిద్ధి పొందింది. ఎన్నో రేడియో నాటికలు, నాటకాలు కూడా రచించారు. ప్రముఖ హిందీరచయిత ప్రేంచంద్ కథలను అనువదించాడు.
రచించిన కథల జాబితా
- అక్కయ్య పెళ్లి
- అతిథి
- అదృష్టం
- అభిమానం
- అలవాటు
- అసలేం జరిగిందంటే
- ఆఖరి ఆశ
- ఆఖరి కానుక
- ఊబి
- కన్నెరికం
- కపోతమూ-కావేషము
- కవి సమ్మేళనంలో
- కేవలం మనుషులం
- చతురస్రం
- చోటా లీడర్
- నిట్టూర్పు
- పరీక్ష
- పరూక్ష
- పసిడి బొమ్మ
- పాలపొంగు
- పిరికివాడు
- పునర్జన్మ (మూలం: శ్రీనివాస్ రాయప్రోల్)
- ప్రజ, ఉద్యోగి, మంత్రి
- ప్రజాకవి
- ప్రతిష్ఠాపకుడు
- ప్రతీకారం
- భరోసా
- యుగాంతం
- రాజర్షి
- రాజుని గురించిన కథ
- రూహీ ఆపా
- వంశాంకురం
- విధివంచితులు
- విముక్తి
- వెలుతురులో
- షరీఫా
- సంస్కారము
- సవతి
వంటి కథలు రచించాడు.
పురస్కారాలు
కేశవస్వామి తమ కథాసంకలనం "చార్మినార్" ప్రసిద్ధ సాహితీపురస్కారమైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం పొందాడు.
మరణం
హైదరాబాద్ నగర జీవితాన్ని, సంస్కృతిని తన కథల్లో చిత్రించిన కేశవస్వామి 1984లో మరణించాడు.