Mysore M. Nagaraja
Quick Facts
Biography
మైసూర్ ఎం.నాగరాజ ఒక కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.తన సోదరుడు మైసూర్ మంజునాథ్‌తో కలిసి మైసూర్ బ్రదర్స్ పేరుతో జంటగా వయోలిన్ కచేరీలు నిర్వహిస్తున్నాడు.
విశేషాలు
ఇతడు 1960, మే 9వ తేదీన మైసూరులో జన్మించాడు. ఇతడు తన తండ్రి ఎస్.మహదేవప్ప వద్ద వయోలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు తన 10వ యేటనే తన సోదరునితో కలిసి మొట్టమొదటి కచేరీ చేశాడు. 1980నాటికి అగ్రశ్రేణి వయోలిన్ విద్వాంసులలో ఒకడిగా ఎదిగాడు. ఇతడు ఆకాశవాణి మైసూరు కేంద్రం నిలయ విద్వాంసుడిగా పనిచేశాడు. దేశ విదేశాలలో విస్తృతంగా పర్యటించి అనేక మంది సంగీత విద్వాంసుల కచేరీలలో వాయులీన సహకారం అందించాడు. అనేక సోలో కార్యక్రమాలు చేశాడు. దూరదర్శన్, ఆకాశవాణిలలో అనేక కార్యక్రమాలు చేశాడు. తన సోదరుడు మైసూర్ మంజునాథ్‌తో కలిసి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వై.జి.జోగ్, విశ్వమోహన్ భట్, ఎన్.రాజం, తేజేంద్ర నారాయణ, రోను మజుందార్ వంటి అగ్రశ్రేణి కర్ణాటక, హిందుస్తానీ విద్వాంసుల కచేరీలకు వాయులీన సహకారం అందించాడు.
ఇతడు సంగీత గురువుగా అనేక మందికి వయోలిన్‌లో శిక్షణ ఇచ్చాడు. ఇతడు కర్ణాటక సంగీతంపై అనేక సెమినార్లు, వర్క్‌షాపుల్లో పాల్గొని పత్రసమర్పణ గావించాడు. ఇతడు అనేక సి.డి.లు, ఆడియో రికార్డులను విడుదల చేశాడు.
పురస్కారాలు
సంగీత రంగంలో ఇతడు చేసిన కృషికి ఫలితంగా అనేక పురస్కారాలు ఇతడిని వరించాయి. వాటిలో కొన్ని:
- 1990లో కర్ణాటక ప్రభుత్వం వారి రాజ్యోత్సవ ప్రశస్థి
- 2001లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల ఒక్లహామా వారి "ది ఎక్సలెన్స్ అవార్డ్"
- 2006లో అమెరికన్ ఆర్ట్స్ కౌన్సిల్ వారి మెరిటోరియస్ అవార్డ్
- 2012లో మద్రాసు సంగీత అకాడమీ వారి చౌడయ్య మెమోరియల్ అవార్డు.
- 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డు