Laxmipathi Adepu
Quick Facts
Biography
ఆడెపు లక్ష్మీపతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కథా రచయిత. ఈయన 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.
జననం
లక్ష్మీపతి 1955, మార్చి 5న కరీంనగర్ జిల్లాలోని చేనేత కుటుంబంలో జన్మించాడు.
ఉద్యోగం
రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో 30 సంవత్సరాలపాటు ఉద్యోగంచేసి 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.
రచనా ప్రస్థానం
ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసిన మొదటి కథ 'ఆదర్శం' అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు పైగా కథలు రచించాడు. వీటిల్లో కొన్ని కథలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి.
విమర్శవ్యాసాలు, నూతన ధోరణులపై విశ్లేషణలు కూడా రాశాడు. రాజీవ్ విద్యా మిషన్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం, డైమండ్స్ పాకెట్ బుక్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొదలైన సంస్థలకు ఇంగ్లీష్, హిందీ భాషలనుండి తెలుగులోకి అనేక అనువాదాలు చేశాడు.
తెలుగు అకాడమి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ రాజకీయ ప్రసంగాల ప్రధానభాగం, తెలంగాణలో ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమీషన్ అధ్యయన నివేదికలను తెలుగులోకి అనువదించాడు.
బహుమతులు
- జీవనృతుడు - ప్రథమ బహుమతి (విపుల మాసపత్రిక కథలపోటి, 1995)
- నాలుగు దృశ్యాలు (కథల సంపుటి) - రావిశాస్త్రి స్మారక సాహితీ పురస్కారం, 1997
పురస్కారాలు
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2018లో భాగంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది.
గుర్తింపులు
- కథాసాహితీ వారి 'కథ - 2015' కు గెస్ట్ ఎడిటర్
- తానా నవలల పోటి - 2017కు న్యాయనిర్ణేత