peoplepill id: koti-venkanaryudu
KV
India
4 views today
4 views this week
Koti Venkanaryudu
18th century Telugu poet

Koti Venkanaryudu

The basics

Quick Facts

Intro
18th century Telugu poet
A.K.A.
Kōṭi Vēṅkanārya
Places
Work field
Gender
Male
The details (from wikipedia)

Biography

కోటి వేంకనార్యుడు 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి.

జీవిత విశేషాలు

ఇతడు "ఆంధ్రభాషార్ణవము" అనే అచ్చ తెలుగు నిఘంటువును పద్య రూపంలో రాసాడు. దీనితో సమానమైన అచ్చ తెలుగు నిఘంటువు మరియొకటి లేదు. ఈకవి ఈపుస్తకమును శ్రీవిజయరఘునాథునిపుత్రు డైనరఘునాథరాజు ప్రేరణముచేత జేసి యాతని కంకితము చేసెను. ఈ రఘునాథరాజు రామనాథ సేతుపతి అయిన విజయరఘునాథరాజు కుమారుడని తోచుచున్నది. అట్లయిన పక్షమున రఘునాథరాజు 1734వ సంవత్సరము మొదలు 1747వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినందున గవియు నాకాలమునం దుండియుండవలెను. కవి గద్యమునందు దనబిరుదావళి నీప్రకారముగా వ్రాసికొనియున్నాడు.

ప్రచురణలు

ఇది తొలుత 1916లో మహామహోపాధ్యాయ శ్రీమాన్ పరవస్తు వేంకటరంగాచార్యులయ్యవారలం గారిచే ఆర్ష ముద్రశాలలో అచ్చయినది.వారి క్యాటిలాగ్ లో ఇది కోటి వేంకన కవి ప్రణీతము అని వ్రాసినారు. ఇది తెలుగు నిఘంటవులన్నింటొలోను గొప్పది. తెలుగునకు అమరకోశము వంటిది.అమరకోశము నందువలె కాండములు వర్గములు అన్నియుకలవు.దీనిలో క్రియావర్గము ఒకటి అధికము. అటుపై శ్రీవావిళ్ళ ప్రెస్ వారు 1931లో దీనిని ప్రచురించినారు. కానీ 1966 సంవత్సరమున ఏలూరు పట్టణమునందు వెంకట్రామన్ ఎండ్ కో అధ్యక్షులైన ఈసర వెంకట్రావు పంతులు గారిచే ముద్రించిన శిరోమణి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల (రీడర్, తెలుగుశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయము) వారిచే విరచితమైన ఆంధ్రశబ్దరత్నాకరము అనెడి అకారాది వర్ణక్రమబద్దమైన పెద్ద నిఘంటువులో అవతారిక 31వ పుటలో నుదురుపాటి వేంకటకవి దీనిని రచించినాడని తెలిపినారు. 18వ శతాబ్దంలో పుదుక్కోట సంస్థానమునందుండిన విద్వత్కవి ఈతడు అని తెలిపినారు. కానీ అటుపై వచ్చిన పెక్కు నిఘంటువుల ప్రచురణలలో కోటి వేంకనార్యుడే దీనిని రచించినాడని తెలుపినారు.

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Koti Venkanaryudu is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Koti Venkanaryudu
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes