peoplepill id: kasarla-shyam
KS
7 views today
7 views this week
The basics

Quick Facts

The details (from wikipedia)

Biography

కాసర్ల శ్యామ్ వర్థమాన సినీ పాటల రచయిత. మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటతో గుర్తింపు పొందాడు.

జీవిత విశేషాలు

కాసర్ల శ్యాం వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడలో మధుసూదన్‌ రావు, మాధవి దంపతులకు రెండోవ సంతానంగా జన్మించారు తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు. దీంతో శ్యామ్‌కు బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆయన లాగే నటుడు కావాలని తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళలశాఖ విభాగంలో ఎంఫిల్ చదివాడు.

చిన్నతనం నుండే శ్యాం సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవాడు. అలా పాటలు పాడడం, రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు. అనేక వేదికలపై జానపదనృత్యాలు చేయడంతో పాటు, పాటలూ పాడాడు. వరంగల్ శంకర్, సారంగపాణిల బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా ఎదిగి వచ్చాడు.

సినిమాలకు రాకముందు కాసర్లశ్యాం వేలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకువచ్చాడు. సుమారు 50పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయన పాటలు రాశారు. “కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో..” అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే.

2003లో దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భానుసారంగా తాను రాసిన పాటలతో పరిశ్రమలో గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్‌ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన పటాస్‌ లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది.2017లో వచ్చిన లై చిత్రంలో "బొమ్మోలే ఉన్నదిరా పోరి" అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.

మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత గీతాలు రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్‌ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్‌, రాంగోపాల్‌ వర్మతో రౌడీ, అనుక్షణం అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, వెంకటేశ్‌ హీరోగా వచ్చిన బాబు బంగారం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కిక్‌.2, ప్రేమకథా చిత్రమ్, గల్ఫ్‌ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాసాడు. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు.

పాటలు

  • చంటిగాడు (2003): ‘కోకోకో.. కొక్కొరొకో.. & ‘సిగ్గులొలికే సీతాలు.. నా చెంతకు చేరవమ్మా’
  • ప్రేమికులు (2005) - ‘లవ్వేరా జోరు.. లవ్వే హుషారు.. ఈ లవ్వేరా ఫ్యూచరు’
  • మహాత్మ (2009): ‘నీలపురిగాజుల ఓ నీలవేణి నిలుసుంటే కిష్ణవేణి’
  • బస్‌స్టాప్‌ (2012) - ‘కలలకే కనులొచ్చిన క్షణమిది..
  • మా అబ్బాయి ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ (2012) - ‘నిన్నే నీకు చూపేది.. నీలో ఆశే రేపేది..
  • ప్రేమకథా చిత్రమ్ (2013) - ‘కొత్తగున్నా.. హాయే నువ్వా!
  • రియల్‌ స్టార్‌ (2014) - ‘కండల్లో కరుకుదనం..
  • లవ్ యు బంగారమ్ (2014): జై శంభో శంభో, అణువణువున చెలియా
  • నక్షత్రం:
  • రౌడీ:
  • అనుక్షణం:
  • వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్:
  • కిక్‌ 2
  • మెంటల్‌ (2016) - ‘చీకటి చీల్చగ.. సూటిగ
  • సుప్రీమ్‌ - (2016)
  • బాబు బంగారం (2016): టిక్కు టిక్కంటూ
  • బంతిపూల జానకి (2016)
  • జక్కన్న (2016) - ‘యు ఆర్‌ మై డార్లింగో.. లింగో లింగో లింగ్‌’
  • గల్ఫ్ (2017) - 'ఆశల రెక్కలు కట్టుకొని పొట్టను చేతిలో పట్టుకొని'
  • లై (2017): ‘బొమ్మోలే ఉన్నదిర పోరీ.. బాంభాట్‌ గుందిరా నారీ..’
  • రాజా ది గ్రేట్ (2017) - ‘రాజా రాజా రాజా.. ది గ్రేట్‌ రా..
  • నీదీ నాదీ ఒకే కథ (2018) - ‘ఏందిరా ఈ జనాల గోల?
  • వెంకీ మామ (2019)
  • అల వైకుంఠపురములో (2020): ‘రాములో రాములా.. నన్నాగం జేసిందిరో’
  • భీష్మ (2020): వ్వాట్టే బ్యూటీ
  • ఒరేయ్ బుజ్జిగా (2020): కురిసేనా, కలలు చూసిన కన్నులే
  • సవారి
  • రాబర్ట్‌ (2021): కన్నె అదిరింది
  • రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం (2022): అన్ని పాటలు
  • డీజే టిల్లు (2022):డీజే టిల్లు టైటిల్ సాంగ్
  • ఎఫ్ 3 (2022): లైఫ్ అంటే మినిమం ఇట్లా వుండాలా
  • పంచతంత్ర కథలు (2022): నేనేమో మోతెవరి, నువ్వేమో తోతాపరి..
  • దసరా (2023) : చమ్కీల అంగిలేసి ఓ వదినే...
  • దాస్‌ కా ధమ్కీ (2023) : మావ బ్రో
  • కథ వెనుక కథ (2023)
  • బలగం (2023)
  • రామన్న యూత్ : ఓఓ సుందరి (2023)
  • అన్‌స్టాపబుల్ (2023)
  • రామబాణం (2023)
  • ఇంటింటి రామాయణం (2023)
  • ఊరు పేరు భైరవకోన (2023)
  • రావణాసుర (2023)
  • రంగమర్తాండ : పొదల పొదల గట్ల నడుమ (2023)
  • స్లమ్ డామ్ హస్బెండ్ (2023)
  • అథర్వ (2023)
  • రజాకార్ (2024) భారతి భారతి ఉయ్యాలో
  • లంబసింగి (2024)

సంగీత దర్శకుడిగా

  • జాబిల్లి కోసం ఆకాశమల్లె

మూలాలు

ఇతర లింకులు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Kasarla Shyam is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Kasarla Shyam
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes