peoplepill id: j-bapu-reddy
JBR
2 views today
12 views this week
J. Bapu Reddy
Poet and Writer from Telangana

J. Bapu Reddy

The basics

Quick Facts

Intro
Poet and Writer from Telangana
Work field
Birth
Age
89 years
The details (from wikipedia)

Biography

జె.బాపురెడ్డి, (1936, జూలై 21 - 2023, ఫిబ్రవరి 8) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, కవి, రచయిత. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరి మెదక్, వరంగల్లు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక సహాయకుడుగా ఉన్నాడు. భారత పొగాకు బోర్డుకు ఎక్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ధర్మాదాయశాఖకు కమీషనర్‌గా, పరిశ్రమల శాఖ కమీషనర్‌గా, చిన్నమొత్తాల పొదుపు సంస్థ కమీషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఇతడు 37 దేశాలలో పర్యటించి పలు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో 38కి పైగా గ్రంథాలను వెలువరించాడు.

జననం, విద్య

బాపురెడ్డి 1936, జూలై 21న కృష్ణారెడ్డి - రామలక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, సిరికొండ గ్రామంలో జన్మించాడు. సిరిసిల్ల, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టాపొందాడు.

వ్యక్తిగత జీవితం

బాపురెడ్డికి రాజేశ్వరితో వివాహం జరిగింది.

సాహిత్య ప్రస్థానం

మహాకవి సి. నారాయణ రెడ్డి స్పూర్తితో 8వ తరగతిలలోనే కవిత్వం రాసి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన బాపురెడ్డి పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం మొదలు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేశాడు.

సామాజిక, సాహిత్య, సాంస్కృతిక సంఘాలతో అనుబంధం

  • ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ - ప్రత్యేక అధికారి
  • అఖిల భారత సాంస్కృతికోత్సవాలు - కార్యదర్శి
  • మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - కార్యదర్శి
  • నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు - హైపవర్ కమిటీ సభ్యుడు
  • అంతర్జాతీయ తెలుగు సంస్థ - బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడు
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ - సభ్యుడు
  • హైదరాబాద్ పొయెట్రీ సొసైటీ - అధ్యక్షుడు
  • జవహర్ పుస్తకాలయ సలహా సంఘం - సభ్యుడు
  • నేషనల్ బుక్ ట్రస్ట్ - సభ్యుడు
  • చైతన్య కవితావేదిక, బెంగుళూరు - ఉపాధ్యక్షుడు
  • సమైక్యభారతి సాహిత్య, సాంస్కృతిక సంస్థ - గౌరవ అధ్యక్షుడు
  • అమెరికన్ బయోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూట్ - గౌరవ సభ్యుడు
  • మైకేల్ మధుసూదన్ అకాడెమీ, కలకత్తా - గౌరవ అధ్యక్షుడు

రచనలు

తెలుగు

  1. చైతన్యరేఖలు
  2. రాకెట్టు రాయబారం
  3. హృదయపద్యం
  4. బాపురెడ్డి గేయాలు
  5. బాపురెడ్డి గేయనాటికలు
  6. బాపురెడ్డి పద్యకావ్యాలు
  7. శ్రీకార శిఖరం (గేయ సంపుటి)
  8. నా దేశం నవ్వుతూంది (గేయ సంపుటి)
  9. ప్రేమారామం (గేయ సంపుటి)
  10. మనసులోని మాట (వ్యాస సంపుటి)
  11. ప్రణవ ప్రణయం (వచన కవిత)
  12. మన చేతుల్లోనే ఉంది (వచన కవితలు)
  13. రంగు రంగుల చీకట్లు (వచన కవిత)
  14. వాడిపోని వసంతాలు
  15. కాలం మాయాజాలం (వచన కవిత)
  16. బాపురెడ్డి భావగీతాలు (గేయ సంపుటి)
  17. సౌదామినీ కవితలు
  18. ఆత్మీయరాగాలు
  19. జీవనశ్రుతులు (పద్య కవిత)
  20. ఆటపాటలు (గేయ సంపుటి)
  21. అనంతసత్యాలు
  22. నాదవేదాలు
  23. పంచబాణ సంచా
  24. పద్యాల పల్లకి
  25. నవగీత నాట్యం
  26. వ్యవధి లేదు (అనువాదం)
  27. పైకెత్తాలి (అనువాదం)
  28. అక్షరానుభూతులు (వచన కవిత)
  29. ప్రకృతిలో ఓ పవిత్రత (అనువాదం)

ఆంగ్లం

  1. In Quest of Harmony
  2. Longing for Life
  3. Urn of Love
  4. Loving is Living
  5. Anatomy of Life
  6. Verities and Visions

పురస్కారాలు

  • 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
  • 1987లో మైఖేల్ మధుసూదన్ అవార్డ్.
  • 1988లో ఆనరరీ డాక్టర్ ఇన్ హ్యుమానిటిస్ ప్రదానం.
  • 1989లో ప్రపంచ కవుల మహాసభల్లో ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్.
  • 1989లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "మన చేతుల్లోనే ఉంది" గ్రంథానికి ఉత్తమ వచన కవిత పురస్కారం.
  • 2016లో దాశరథి సాహితీ పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం

మరణం

బాపురెడ్డి 2023, ఫిబ్రవరి 8న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
J. Bapu Reddy is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
J. Bapu Reddy
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes