peoplepill id: gutti-chandrasekharareddy
GC
India
2 views today
3 views this week
Gutti Chandrasekharareddy
Indian writer

Gutti Chandrasekharareddy

The basics

Quick Facts

Intro
Indian writer
Places
Work field
Birth
Place of birth
Karnataka, India
Age
80 years
The details (from wikipedia)

Biography

గుత్తి చంద్రశేఖర రెడ్డి(ఆంగ్లం:Gooty Chandrasekhara Reddy) ఆధ్యాత్మిక సాహితీకారుడు. ఈయన జోళదరాశి గుత్తి చంద్రశేఖర రెడ్డి గా ప్రసిధ్దుడు. వచనమూ, పద్యమూ - ఏ ప్రక్రియలోనైనా స్వాదు సుందరంగా కలాన్ని నడిపించగల కవి - రచయిత - చంద్రశేఖరరెడ్డి. అనువాదాలూ, అనుసృజనలూ చేయడంలో చేయి తిరిగిన దిట్టరితనం ఉంది.

జీవిత విశేషాలు

చంద్ర శేఖర రెడ్డి కర్ణాటక రాష్ట్రం, బళ్ళారి జిల్లాలోని జోళదరాశి గ్రామంలో 1945, ఫిబ్రవరి 5న నారాయణరెడ్డి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రులు. ఈయన ప్లానింగ్, వాణిజ్య విభాగాలలోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఈయన 2008 లో హైదరాబాదు లోని రాంకీ గ్రూప్ లో మేనేజింగ్ డైరక్టరుకు సలహాదారుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఈయన హైదరాబాదులో నివసిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

బళ్ళారి ఆంధ్ర రాష్ట్రంలో చేరాలని తండ్రి చేసిన విశ్వప్రయత్నం, పోతన భాగవతం పై అభిమానం రగిలించిన ఆయన తాత నాగిరెడ్డి యొక్క వాత్సల్యం, గణితము, సాహిత్యాలపై ఆసక్తి కలుగజేసిన ఆయన పెద్దమ్మ వెంకమ్మ, నగరడీన సోమిరెడ్డి తాతయ్యలు ఆయనకూ ప్రేరణ కల్పించారు. సాహితీ వేత్తగా అనేక రచనలు చేసారు. ఆయనకు సాహితీ పఠనం తో పాటు నటన ఆయన అభిమాన విషయం. ఆయన 1959 నుండి 1978 వరకు పాల్గొన్న ఏకపాత్రాభినయ పొటీలలొ అన్నింటా ప్రథమ బహుమతి పొందారు. గుల్బార్గా లో ఇంజనీరింగ్ చదువుతూ ఆయన తెలుగు భాషలోనే రావణ, కీచక,దుర్యోధన,అశ్వద్థామ, తాండ్రపాపారాయుడు,సలీం మున్నగు పాత్రలలో కన్నడ,మరాఠీ,హిందీ భాషల వారితో పోటీలో పాల్గొన్న ఆరింటిలో ప్రథమబహుమతులారింటిని కైవసం చేసుకున్నారు.

రచనలు

స్వీయకృతులు

వీరు రాసిన పుస్తకాలలో ముఖ్యమైనవి

  • రైతురాయలు - ప్రముఖ రచయిత గోపిని కరుణాకర్ వ్రాసిన "గోపినోళ్ళ చెరువు" కథకి పద్యరూపం ఈ "రైతురాయలు". ఈ కథ దీపం చెప్పిన కథలు సంకలనంలోనిది.
  • వరమాల - జయమాల
  • బసవడు - శరణుడు
  • శ్రీకృష్ణరాయము
  • సిరిసునీత

కన్నడలో స్వీయకృతులు

  • రైతురాయ (పద్యకావ్యం) - (ముద్రణలో ఉంది)

అనువాదాలు

కన్నడ నుండి తెలుగుకు

  • క్రాంతిపురుష బసవన్న
  • బుద్ధ హరిశ్చంద్ర (నాటకాలు)
  • వచనము (2500 కన్నడవచనాలకు అనువాదం)
  • అక్కమహాదేవి వచనాలు
  • విశ్వజ్యోతి బసవన్న
  • బసవన్న, అంబేద్కర్
  • రామాయణమహాన్వేషణం (మొదటి భాగం మూలం: వీరప్ప మొయిలీ)
  • తిరుపతి తిమ్మప్ప (తిరుమలేశుని వాస్తవ చరిత్ర)
  • కనకదాసు నలచరిత్ర (సగం)
  • స్వప్నసారస్వతం
  • కొంకణీల వలస కథ ( కేంద్ర సాహిత్య అకాడమీ తరపున ముద్రణలో)

తెలుగు నుండి కన్నడకు

  • వలసె హోద మందహాస (కవితా సంకలనం)
  • రెడ్డి రాజ్యగళ చరిత్రె
  • రాయచోటి వీరభద్ర చరిత్రె
  • గురజాడ కథెగళు
  • పోతన భాగవతం లోని దశమ స్కందం లోణి మొదటి భాగం.

పురస్కారములు

  • ఆంధ్ర సారస్వతసమితి,మచిలీపట్నం వారిచే రైతురాయలు.
  • హిరేమద సంస్థానభిల్కి (బీదర్ జిల్లా-కర్ణాటక)
  • బసవ-బెళుగు (బసవని వెలుగు) - ప్రభుదేవ విరక్తిమఠం సొండూరు(బళ్ళారి జిల్లా)
  • కన్నడ సాహిత్య పరిషత్ ఉత్తమ అనువాదకునిగా
  • కర్ణాటకాంద్ర ద్వభాషారత్న బిరుదు. (జోదళరాశి గ్రామస్తులచే)
  • డా. ప్రభాకరరెడ్డి గారినుండి శ్రీకృష్ణ రాయలి భక్తుడు.
  • శ్రీ వాడ్రేపు చినవీరభద్రుడు గారినుండి "సాహిత్యోన్మత్తుడు"
  • 2011 లో శ్రీ దొడ్డన గౌడు గారి శతజయంతి ఉత్సవ సందర్భంగా "బసవన మాహాభినిష్క్రమణం" బహుప్రాత్రాభినయం చేసి కర్ణాటక ప్రభుత్వ సంస్థలు కన్నడ సాహిత్య నాటక అకాడమీ చే అగ్రపీఠ సన్మానం.
  • ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'ఆధ్యాత్మిక సాహిత్యం' విభాగంలో "కీర్తి పురస్కారం (2013)" ప్రకటించారు.

సాహితీ సేవలు

ఆయన జోదళరాశి గ్రామం లో 2007 నుండి ప్రతియేటా ఆయన తండ్రిగారి పేరుమీద నెలకొల్పిన "గుత్తి నారాయణరెడ్డి సాహిత్య పీఠం" తరపున తెలుగులో ఉత్తమ సాహిత్యవేత్తకొకటి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రేతర ప్రాంతాలలో తెలుగు ఉనికిని కాపాడుతున్న రచయితలకొకటి రెండు పురస్కారాలు అందజేస్తున్నారు. 07.08.2009 న శ్రీకృష్ణ రాయల పట్టాభిషేక దినోత్సవంగా అంగీకరించి ప్రతి యేటా ఆగస్టు 7 న పట్టాభికోత్సవం, తెలుగు,కన్నడ,సంస్కృత,ఆంగ్లము,మరాఠీ భాషల్లో రాయల గురించి రచనలు చేసినవారికి మొత్తం ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరుతో చిరు పురస్కారం,సన్మానం లను తన ఇంటివద్దే నెలకొల్పుకున్న శ్రీకృష్ణరాయల విగ్రహం నీడన జరుగుట 2011 నుండి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎందరో పెద్దల తోడ్పాటు ఉంది. ఆయన పిల్లలు సంజీవ, వంశీధర, నాగార్జునలు సంపూర్ణ భారాన్ని మోస్తూ ఆయనకు అండగా నిలుస్తుంటారు. His second lives in virignia ,and works for Fanniemae as aSenior ETL Analyst . His hobbies are dieting and camping.

మూలాలు

ఇతర లింకులు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Gutti Chandrasekharareddy is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Gutti Chandrasekharareddy
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes