ఈషా చోప్రా (ఆంగ్లం: Eisha Chopra) ఒక భారతీయ స్క్రీన్ రైటర్, సినిమా నటి. యూట్యూబ్ వెబ్ సిరీస్ లు అయిన వాట్ ది ఫోక్స్, ది గ్రేట్ ఇండియన్ డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీలో ఆమె పాత్రలకు ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ నీర్జాలో డెబినా పాత్రలో, అఫీషియల్ CEO గిరి వంటి హిట్ షోల కోసం భారతీయ వెబ్ పరిశ్రమలో ప్రధాన పాత్రల కోసం ఆమె తన సహాయ పాత్రకు ప్రసిద్ధి చెందింది. వీసా డెబిట్, డిష్ టీవీ, బ్రిటానియా, బ్యాంక్ బజార్ మొదలైన వ్యాపార ప్రకటనలలో కూడా ఈషా చోప్రా ప్రముఖంగా కనిపిస్తుంది.
ప్రారంభ జీవితం
న్యూఢిల్లీలో ఈషా చోప్రా పుట్టి పెరిగింది. ఆమె తండ్రి డా. అలోక్ చోప్రా కార్డియాలజిస్ట్, తల్లి గీతు చోప్రా హోమ్ డిజైనర్. ఆమె పాఠశాల విద్యను వసంత్ విహార్‌లోని మోడరన్ స్కూల్‌లో, న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో పూర్తి చేసింది. ఆమె లీ స్ట్రాస్‌బర్గ్ మెథడ్ యాక్టింగ్ టెక్నిక్‌లో శిక్షణ పొందింది. దీనితో పాటు ఆమె టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, న్యూయార్క్ యూనివర్శిటీ నుండి ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్‌లో డిప్లొమాలు కూడా పూర్తి చేసింది. ఈషా చోప్రా లండన్ ఫిల్మ్ అకాడమీ నుండి స్క్రీన్ రైటింగ్ పూర్తి చేసింది కూడా. ఈషా చోప్రాకు సైకాలజిస్ట్ అయిన దివ్య చోప్రా అనే సోదరి ఉంది.
ఫిల్మోగ్రఫీ
సినిమాలు
Year | Title | Role | Director | Language | Notes |
---|
2016 | నీర్జా | డెబినా | రామ్ మాధ్వాని | హిందీ | బాలీవుడ్ లో అరంగేట్రం |
టెలివిజన్, వెబ్ సిరీస్
Year | Title | Role | Studio |
---|
2017 - ప్రస్తుతం | వాట్ ది ఫోక్స్ | అనిత | ఫిల్టర్ కాపీ |
2017 | P.O.W. - బండి యుద్ధ్ కే | పాయల్ | స్టార్ ప్లస్ |
2018 | ది గ్రేట్ ఇండియన్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ | సోనాలి | ఆల్ట్ బాలాజీ |
2018 | అఫీషియల్ CEOగిరి | మల్లిక | అరే |
2018 | లవ్ ఆన్ ది రాక్స్ | ఐషా | మెన్XP |
స్క్రీన్ రైటింగ్ క్రెడిట్స్
Year | Role | Project |
---|
2016 | సహ రచయిత | మ్యాడ్లీ, క్లీన్ షేవన్ |
2017 | కథా రచయిత | P.O.W. - బండి యుద్ధ్ కే |
2018 | కథా రచయిత | ది గ్రేట్ ఇండియన్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ |
2017 | స్క్రీన్ ప్లే రైటర్ | లవ్ ఆన్ ది రాక్స్ |