Dasu Sriramulu
Quick Facts
Biography
దాసు శ్రీరాములు (1846 - 1908) ప్రసిద్ధ కవి, పండితులు. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కన్నయ్య మరియు కామమ్మ. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకొని తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి ప్రభువు మన్ననలనందుకున్నాడు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. తరువాతి కాలంలో ఆంగ్లం చదివి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరై ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.
తరువాతి కాలంలో వృత్తిని వదిలి జీవిత శేషం సాహిత్య సేవకు వినియోగించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు. వీరు మే 16, 1908 సంవత్సరంలో పరమపదించారు. వీరి సతీమణి జానకమ్మ. వీరికి ఆరుగురు కుమారులు కేశవరావు, నారాయణరావు, గోవిందరావు,మాధవరావు, విష్ణురావు, మధుసూధనరావు లలో ఐదవ కుమారుడైన దాసు విష్ణు రావు స్వీయచరిత్ర లో 20 శతాబ్దమునాటి సాంఘిక రాజకీయములు వివరించిరి. వీరి ఏకైక కుమార్తె శారదాంబ పిన్నవయస్సులోనే సంగీతం తో పాటు సంస్కృతాంధ్ర విద్యాభాసములు కావ్యరచనలుచేసిన 19వ శతాబ్దపు మహిళారత్నము( చూడు వేమూరి శారదాంబ )
రచనలు
- దేవీ భాగవతము
- తెలుగునాడు
- అభినయ దర్పణం
- జావళీలు, పదాలు
- శాకుంతలము
- ఉత్తర రామ చరితము
- ముద్రా రాక్షసము
గ్రంథములు
- ఆచార నిరుక్తి
- దురాశపిశాచ భంజని
- ఆంధ్రవీధీ దర్పణము
- స్వరజితులు
- జానకీపరిణయ నాటకము
- మనో లక్ష్మీ విలాస నాటకము
- అచ్చ తెనుగు అభిజ్నానశాకుంతలము
- అచ్చతెలుగునీతిమాలిక
- రత్నావళి
- మాలతీ మాధవీయము
- మాళవికాగ్ని మిత్రము
- ముద్రా రాక్షసము
- ఉత్తరరామచరిత్రము
- మహావీర చరిత్రము
- కురంగ గౌరీ శంకరము
- మంజరీ మధుకరీయము
- సంగీత రస తరంగిణి (కుమారుదు దాసు నారాయణ రావు అసంపూర్తిగా రచించి మరణించుటచే, ఈయనచే పూర్తి చేయబడింది.)
- తర్క కౌముది అను న్యాయబోధ
- అభినవ గద్య ప్రబంధము
- సాత్రాజితీ విలాసము
- వేదాచల మాహాత్మ్యము
- కృష్ణార్జున సమరము
- లక్షణా విలాసము
- ఆంధ్ర దేవీభాగవతము
- తెలుగునాడు
- భృంగరాజమహిమ
- పతిత సంపర్గప్రాయశ్చిత్తోపన్యాసము
- వైశ్యధర్మ దీపిక
- నౌకాయానము
- పాశ్చాత్య విద్యా ప్రశంస
- పునర్వివాహ విచారణ
- నమ స్కార విధి
- అభినయ దర్పణము
- త్రిమతములు
- విగ్రహారాధన
- శ్రాద్ధ సంశయ విచ్చేది
- ఆంధ్ర వీధి
- కృతులు
- ప ద ములు
శతకములు
1. చిలకల కొలికి శతకము2. సోమలింగేశ్వర శతకము3. ముద్దుగుమ్మ శతకము 4. చక్కట్లదండ శతకము 5. సూర్య శతకము 6. కామాక్షీ శతకము
వీరు ఆశువుగా, 6 నెలల్లో తెనిగించిన ఆంధ్ర దేవీ భాగవతము ప్రత్యేక సాహిత్య కావ్యము. ఆయన్ని ఆశుకవి సింహులు అని పిలిచేవారట. ఇవి గాక జావళీలు, పదములు మరియు బహు కృతులు కూడా ఆయనచే రచింపబడినవి.
మూలాలు
- ఎందరో మహానుభావులు (అద్భుత సంగీత విద్యాంసుల అజ్ఞాత జీవితచిత్రాలు), తనికెళ్ళ భరణి, హాసం ప్రచురణలు, హైదరాబాదు, 2007, పేజీలు: 74-6.
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005. పేజీలు: 865-66.