peoplepill id: balantrapu-venkatarao
Telugu poet
Balantrapu Venkatarao
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
బాలాంత్రపు వేంకటరావు జంటకవులుగా ప్రసిద్ధులైన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరు. ఇతడు తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం, మల్లాములో సూరమ్మ, వేంకట నరసింహం దంపతులకు 1880లో (విక్రమ నామ సంవత్సరంలో) జన్మించాడు. ఇతడు పిఠాపురంలో ప్లీడరు గుమాస్తాగా పనిచేశాడు. 1908లో ఓలేటి పార్వతీశంతో పరిచయం ఏర్పడి జంటగా రచనలు చేయసాగారు. 1911లో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలను తణుకులో ప్రారంభించి, నిడదవోలు, రాజమండ్రి, కాకినాడ, పిఠాపురములలో సంచారము చేసి 1980 వరకు ఈ గ్రంథమాల ద్వారా 170 గ్రంథాలను ప్రకటించారు. ఇతని కుమారులు బాలాంత్రపు నళినీకాంతరావు, బాలాంత్రపు రజనీకాంతరావు ఇరువురూ ప్రసిద్ధులు.
రచనలు
స్వీయ రచనలు
- ధనాభిరామము (నాటకము)
- సురస (నవల)
- కాకము (నవల)
- బాలుని వీరత్వము
- సన్యాసిని
- యాచాశూరేంద్ర విజయము
- భావసంకీర్తన సీస త్రిశతి
- స్త్రీల వ్రతకథలు
ఓలేటి పార్వతీశంతో కలిసి జంటగా రచించినవి
- ఇందిర (నవల)
- అరణ్యక (నవల)
- ఉన్మాదిని (నవల)
- సీతారామము (నవల)
- సీతాదేవి వనవాసము (నవల)
- నిరద (నవల)
- నీలాంబరి (నవల)
- ప్రణయకోపము (నవల)
- ప్రతిజ్ఞా పాలనము (నవల)
- ప్రభావతి (నవల)
- ప్రమదావనము (నవల)
- శ్యామల (నవల)
- శకుంతల (నవల)
- చందమామ (నవల)
- రాజసింహ (నవల)
- వసుమతీ వసంతము (నవల)
- వీరపూజ (నవల)
- రాజభక్తి (నవల)
- వంగవిజేత (నవల)
- లక్షరూపాయలు (నవల)
- మనోరమ (నవల)
- మాతృ మందిరము (నవల)
- మాయావి (నవల)
- హారావళి (నవల)
- రజని (నవల)
- సాధన (నవల)
- కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
- పరిమళ (నవల)
- సంతాపకుడు (నవల)
- చిత్రకథా సుధాలహరి (నవల)
- కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
- బృందావనము (పద్యకావ్యము)
- ఏకాంతసేవ (పద్యకావ్యము)
బిరుదులు
- కవికులాలంకార
- కవిరాజహంస
మూలాలు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Balantrapu Venkatarao is in following lists
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Balantrapu Venkatarao