peoplepill id: talisetti-ramaravu
TR
India
1 views today
1 views this week
Talisetti Ramaravu
Indian painter, cartoonist and lawyer

Talisetti Ramaravu

The basics

Quick Facts

Intro
Indian painter, cartoonist and lawyer
A.K.A.
Talisetti Ramarao
From
Work field
Gender
Male
Birth
Death
1960 (aged 54 years)
Age
54 years
The details (from wikipedia)

Biography

Talisetti Ramaravu
తెలుగులో మొదటి కార్టూనిస్టు తలిశెట్టి రామారావు యొక్క కార్టూన్

తలిశెట్టి రామారావు (1906 - 1960) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.

వ్యక్తిగత వివరాలు

1906లో జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.యే చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక మరియు భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కూర్టూన్ శకానికి నాంది పలికాడు.

రచనలు

  1. భారతీ, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
  2. చిత్రలేఖనము (1918)
  3. 1930వ సంవత్సరంలో భారతీయ చిత్రకళ అనే పుస్తకం. ఆంధ్రగ్రంథమాల ప్రచురణ.

మూలాలు

  • తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు - పుస్తకం. సేకరణ ముల్లంగి వెంకట రమణారెడ్డి.

బయటి లింకులు

The contents of this page are sourced from Wikipedia article on 13 Jul 2019. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Talisetti Ramaravu is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Reference sources
References
Talisetti Ramaravu
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes