V. Ramachandra Rao
Quick Facts
Biography
వి. రామచంద్రరావు (1926 - 1974) భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
జననం - విద్యాభ్యాసం
రామచంద్రరావు 1926, మార్చి 13న తూర్పు గోదావరి జిల్లా, లక్ష్మీ పోలవరంలో జన్మించాడు. కాకినాడ, చెన్నైలలో చదవుకున్నాడు.
సినిరంగ ప్రస్థానం
తాపీ చాణక్య సూచనమేరకు సినీరంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఘట్టమనేని కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అప్పటినుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. తను దర్శకత్వం వహించిన 17 చిత్రాలలో 11 చిత్రాలు కృష్ణ హీరోగా తీసినవి. వీరిద్దరి కలయికలో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా భారీ విజయాన్ని సాధించింది. రామచంద్రరావు దర్శకత్వంలో ఎడారిలో తప్పిపోయిన బాలుని కథతో వచ్చిన పాపం పసివాడు చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక విలక్షణ చిత్రంగా నిలిచింది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హెలికాప్టరు ద్వారా కరపత్రాలను పంచారు. రామచంద్రరావు నిర్మించిన భద్రం కొడుకో చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.
చిత్రాల జాబితా
- దర్శకుడిగా:
- పెన్నుం పొన్నుం (1974)
- అల్లురి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)
- గంగ మంగ (1973)
- అబ్బాయిగారు - అమ్మాయిగారు (1972)
- అమ్మమాట (1972)
- పాపం పసివాడు (1972)
- పగబట్టిన పడుచు (1971)
- అసాధ్యుడు (1968)
- నేనంటే నేనే (1968)
- మరపురాని కథ
- రచయితగా:
- దేవుడు చేసిన మనుషులు (స్క్రీన్ ప్లే)
మరణం
అల్లూరి సీతారామరాజు చిత్రీకరణ మధ్యలోనే 1974, ఫిబ్రవరి 14న రాయవేలు ఆసుపత్రిలో రామచంద్రారావు (47) గుండెపోటుతో మరణించాడు. ఆయన చివరి కోరిక మేరకు మిగతా చిత్రాన్ని పూర్తిచేసిన కృష్ణ, చిత్ర టైటిల్స్ లో దర్శకుడిగా రామచంద్రారావు పేరునే వేశాడు.