Surabhi Prabhavathi
Quick Facts
Biography
సురభి ప్రభావతి నాటకరంగ, టివి, సినిమా నటి. దాదాపు 2000 నాటక ప్రదర్శనల్లో పాల్గొని, ఉత్తమ నటిగా అనేక బహుమతులు గెలుచుకుంది.
జననం
ప్రభావతి 1980, జూన్ 27న కమలమ్మ, రేకందార్ కుమార్ బాబు దంపతులకు తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లాలోని తరిగుప్పల గ్రామంలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
ప్రభావతికి వనారస నాగేష్ తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (సాయిరాం), ఒక కుమార్తె (వైష్ణవి) ఉన్నారు.
రంగస్థల ప్రస్థానం
బాలనటిగా గుణసుందరి నాటకంలో నటించి 2003లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన ప్రభావతి, ఇప్పటివరకు సుమారు 2000 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించింది. విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం, మృత సంజీవని, గణపతి మహత్యం, శశిరేఖా పరిణయం, నరకాసుర నాటకాల్లో ఈవిడ ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకుంది.
నాటకాలు
- పద్య నాటకాలు
- శశిరేఖా పరిణయం, విప్రనారాయణ, నరకాసుర, పల్నాటియుద్ధం, చింతామణి, కవయిత్రి మొల్ల, అయ్యప్పమహత్యం, శమంతకమణి, శ్రీకృష్ణసత్య, తరిగొండ వెంగమాంబ, కర్ణార్జునీయం, కృష్ణార్జునీయం, సైరానరసింహారెడ్డి, ప్రమీలార్జున పరిణయం, శ్రీకృష్ణకమలపాలిక, యయాతి, పాదుకాపట్టాభిషేకం, రుద్రమదేవి, గణపతిమహాత్యం, సారంగధర, చిత్రాంగధ
- నాటకాలు
- మదనకామరాజు, మృతసంజీవని, నిజం, బాపుబాటలో, గాలివాన, పయనించే ఓ చిలుకా, నారినారినడుమ, నిశి, రాజిగాడు రాజయ్యాడు, ఆదిలక్ష్మీకళ్యాణం, యజ్ఞం, అంబేద్కర్ రాజగృహప్రవేశం, పడమటిగాలి, రేపటి స్వర్గం, మరో మెహంజదారో, పులిమళ్ళీవచ్చింది, కల్లందిబ్బ, కంఠాభరణం, కన్యాశుల్కం, లాస్ట్ వార్నింగ్, పునాది, స్పీడు బ్రేకర్, హార్దికసంబంధాలు,మూడోదరి, యోగనిద్ర, అమ్మను కాపాడుకుందాం, రైతేరాజు, త్యాగం, సైథిల్యం, మిస్టరీ, రేలపూలు, అమృతంతాగినరాక్షసులు, ఆయుష్మాన్భవ, క్షమాసుృతి
నాటికలు
హరిశ్చంద్రుడు అబద్దం ఆడితే, శిశిరాలలో, నిమజ్జనం, సముద్రమంత సంతోషం, మనకోసం మనదేశం, నవ్వుల నదిలో, శతమానం భవతి, అమ్మపాలరాచులు, రైతంటే, ధరిత్రిరక్షితరక్షితః, కొత్తచిగురు, అమ్ననుకావాలి, ఓభార్యతీర్పు, మట్టివేళ్ళు, లైఫ్ లైన్, కల్లందిబ్బ, మాతృక, హననం, నిర్మాణం, అబ్బేఏంలేదు, ఒక్కక్షణం, అందమే ఆనందం, దిక్సూచి, వనుత్రీ, రామచిలుక, చెంగల్వపూదండ, రచ్చబండ, చిత్తగించవలెను, ఏగుల్సతాహమారా, అన్నట్టుమనం మనుషులంకదూ, సైకతశిల్పం, రివర్స్ గేమ్, బొమ్మసముద్రం, ఖాళీలు పూరించండి, మళ్ళీ మొదలుపెట్టకండి, కక్కుర్తి, మాకంటు ఓరోజు, సద్గతి, పంపకాలు, తూర్పుసంధ్య, భరోసా, చేయూత, ఫోమో, ఐలవ్ యు, కొత్తబానిసలు, ఎక్కడో ఒకచోట, స్వాతిచినుకులు, శ్రీకారం, కుక్కపిల్ల, మధురం, తలుపులు తెరిచేవున్నాయి, అట్టకెక్కింది, మనసుతో ఆలోచిస్తే, గమ్యస్థానాలవైపు, భూమిదుఃఖం, చేజారితే, రాతిలోతేమ, బంధాలబరువెంత, ఏదినిజం.
సినిమాలు
ఆపరేషన్ ఐ.పి.యస్, బతుకమ్మ, మహాత్మ, ఆదిగరువు అమ్మ, మిడిల్ క్లాస్ మెలోడీస్, సురాపానం (2022), భైరవ గీత, దొరసాని, అఖండ, అశోకవనంలో అర్జున కల్యాణం, శ్రీదేవి సోడా సెంటర్, జెట్టి, ఇంటింటి రామాయణం, వినరోభాగ్యము విష్ణుకథ, అంబాజీపేట బ్యాండ్ పార్టీ, మసూద, పంచతంత్రం, మెయిల్, మసూద (2022), జెట్టి
సీరియళ్లు
పూతరేకులు, మాయాబజార్, సరస్వతీ వైభవం, కలవారికోడలు, ముద్దమందారం, తమ్మవాకిట్లో, మనసుమమత
షార్ట్ ఫిల్మ్స్
కుర్తా, లక్ష్మీగారిఅబ్బాయి, మాబుజ్జక్క
అవార్డులు
ఈవిడ 5 నంది, 6 గరుడ, 3 అశ్వం అవార్డులతోపాటు అనేక పరిషత్తుల నుండి 1000కి పైగా బహుమతులు అందుకుంది.
- నంది పురస్కారాలు
- ఉత్తమ నటి - బాపు బాటలో - 2009 నంది నాటక పరిషత్తు (నెల్లూరు)
- ఉత్తమ నటి - విప్రనారాయణ పద్యనాటకంలో దేవదేవి పాత్ర - 2010 నంది నాటక పరిషత్తు (ఖమ్మం)
- జ్యూరీ నంది - పల్నాటియుద్ధం పద్యనాటకంలో నాగమ్మ పాత్రకు - 2011 నంది నాటక పరిషత్తు (గుంటూరు)
- ఉత్తమ సహాయ నటి - మాతృక నాటికలో నిర్మల పాత్రకు - 2014 నంది నాటక పరిషత్తు (రాజమండ్రి)
- ఉత్తమ నటి - కర్ణార్జునీయం పద్యనాటకంలో కుంతి పాత్రకు - 2015 నంది నాటక పరిషత్తు (తిరుపతి)
- ఇతర అవార్డులు
- ఉత్తమ నటి - మూడోదరి - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012 (2012)
- ఉత్తమ నటి - రాణి రుద్రమ - శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్, శ్రీకాళహస్తి (2018)
- ఉత్తమ నటి - రైతేరాజు -అపర్ణ నాటక కళాపరిషత్, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5
- ఉత్తమ నటి - ప్రమీలార్జున పరిణయం పద్యనాటకంలో ప్రమీలాదేవి పాత్రకు - వీణా అవార్డు (2021)
పురస్కారాలు
- ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)
- మహిళారత్న పురస్కారం
- ఉత్తమ నటి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)
- వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్)
- నవరస కాకినాడ వారి పురస్కారం
- కళారంజని భీమవరం వారిచే మహానటి సావిత్రి పురస్కారం
- ఆరాధన హైదరాబాద్ వారిచే గౌరవ పురస్కారం
- యువకళావాహిని హైదరాబాద్ వారిచే కళారత్న పురస్కారం
మూలాలు
ఇతర మూలాలు
- సురభి ప్రభావతి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 56.