Sidda Raghava Rao
Quick Facts
Biography
శిద్దా రాఘవరావు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. అనేక వ్యాపారాలు చేసి పేరుతెచ్చుకొన్న తర్వాత రాజకీయాలలో చేరాడు. ఇతడు జిల్లాలో అందరినీ కలుపుకొనిపోతూ అజాతశత్రువు గా పేరు తెచ్చుకొన్నాడు. ఇతని కార్యదక్షతపై నమ్మకముంచిన చంద్రబాబు నాయుడు 2014లో ఇతడు మొదటిసారి శాసన సభకు ఎన్నిక అయినప్పటికీ ఇతడికి మంత్రి పదవి కట్టబెట్టాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పని చేశాడు.
రాజకీయాలు
శిద్దా రాఘవరావు 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశాడు. 2007లో అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యాడు. గ్రానైట్ వ్యాపారిగా స్థిరపడిన ఈయన ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నాడు. 2006లో శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నియమితులయ్యాడు. వయస్సు 57 సంవత్సరాలు. బీకాం వరకు చదువుకున్నారు. టీటీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతడు నెల్లూరు జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా పనిచేశాడు.ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురయ్యాడు.
మూలాలు
బయటి లంకెలు
- ట్విట్టర్ లో శిద్దా రాఘవరావు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రసంగిస్తున్న శిద్దా రాఘవరావు
- శిద్దా రాఘవరావు ఆస్తులు-అప్పులు
- యూటూబ్ లో శిద్దా రాఘవరావు 2014 ఎన్నికల ప్రచార వీడియో
- శిద్దా రాఘవరావుకు అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు
- 2015 సంవత్సరంలో నెల్లూరు జిల్లాలోని భారీ వర్షాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావుతో ముఖాముఖి
- రాజమండ్రి రోడ్ కం రైలు మార్గమును పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన మంత్రి శిద్దా రాఘవరావు