Satyavarapu Naga Parameswara Gupta
Quick Facts
Biography
సత్యవరపు నాగపరమేశ్వర గుప్తా ఖగోళ పరిశోధకుడు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన దుర్గాపూర్ ప్లాంట్ లో ఉన్నతోద్యోగం చేస్తున్నారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలైన స్టీఫెన్ హాకింగ్స్, రోజర్ పెన్ రోజ్ సిద్ధాంతాలను ఛాలెంజ్ చేసిన తెలుగు వానిగా ఖ్యాతిపొందాడు.
జీవిత విశేషాలు
ఆయన 1954లో జన్మించారు. 1976లో అనంతపురం లోని జె.ఎన్.టి.యు. కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ లో బి.టెక్. (ఎలక్ట్రికల్ ) పూర్తిచేసారు.1977 మార్చి 10 నలో భిలాయి స్టీల్ ప్లాంట్ లో తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. రిటైరు అవడానికి ముందు ఆ సంస్థలో ఎ.జి.ఎంగా పనిచేసారు. ఈయన వృత్తి రీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీరు అయినా ఖగోళ రహస్యాలను తెలుసుకోవాలనే అభిలాష ఎక్కువ. ఆయన ఆగస్టు 31 2014 న పదవీవిరమణ చేసారు ( రిటైరు అయినారు).
ఈయన అసలు పేరు 'సత్యవరపు బాల శేష పరమేశ్వర వీర వెంకట సత్యనారాయణ గుప్త '. స్కూలులో చేర్చినప్పుడు ఈ పేరు చాలా పొడుగుగా ఉంది అని, ఫారంలో ఇవ్వబడిన ఖాళీలో చాలదు అని చెప్పి స్కూలు మాస్టారు చెప్పితే, వారి నాన్న గారు 'సత్యవరపు నాగపరమేశ్వర గుప్త' అని మార్చేరు. ఇది వీరి 8 వ తరగతిలో జరిగింది. వీరి ఊరు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా. వీరి తాత గారి పేరు ' సత్యవరపు పరమేశ్వర రావు ', భార్య శ్యామలాంబ. ఇంపీరియల్ బ్యాంకులో పనిచేసారు.
ఈయన తండ్రి పేరు 'సత్యవరపు సుబ్బారావు. తల్లి పేరు ' సీతా మహా లక్ష్మి'. వారి తండ్రికి బాల్యం లోనే తల్లి తండ్రులు ఇద్దరూ చని పోయారు. ఆవిధంగా వారి తండ్రికి చాలా చిన్నతనం లోనే 4 రు చెళ్ళెళ్ళు, వారి వివాహాలు, బాల్య వివాహం వల్ల భార్యను చూడా ల్సిన గురుతరమైన సంసార బాధ్యత ఏర్పడింది. వారు డబ్బు లేక పోయినా 4 చెళ్ళెళ్ళ వివాహలు, వారి నలుగురి కొదుకుల చదువులు, వివాహాలు చక్కగా నిర్వర్తించేరు. పిల్లలకు సరి అయిన ఉద్యోగాలు వచ్చే లాగ చూసేరు. వీరు కూదా ఇంపీరియల్ బ్యాంకులో పనిచేసారు. తరువాత ఇంపీరియల్ బ్యాంకు పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇందియా అని మార్చారు .
ఈయన భార్య పేరు 'సత్యవరపు సావిత్రి ' వీరిది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాని పేరు 'సత్యవరపు సుబ్బ వంశి కృష్ణ ' కోడలు పేరు 'సత్యవరపు విభ ', మనవరాలు పేరు 'సత్యవరపు మేధ ' వీరు అమెరికా లోని కాలి ఫొర్నియాలో సాఫ్ట్ వేర్ ఉద్యొగంలో ఉన్నారు. చిన్న కొదుకు పేరు 'సత్యవరపు కోటి శెష మాణిక్య కిరణ్ ' చిన్న కోదలు పేరు 'సత్యవరపు శీతల్ ' వీరు కూద అమెరికా లోని ఫిలడెల్పియాలో సాఫ్ట్ వేర్ ఉద్యొగంలో ఉన్నారు. చిన్న కుమారునిది కూడా ప్రేమ వివాహం.
బాల్యం
ఈయన తండ్రి సుబ్బా రావు గారిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం అవ్వడము వలన చాలా ఎక్కువ గానే 'ట్రాన్స్ ఫర్ ' లు అవ్వుతుండేవి. బాల్యంలో 2 నుండి 5 తరగతి దాకా భట్టి ప్రోలు లోను, 6 నుండి 8 తరగతి దాకా తిరువూరు లోనూ, 9,10, తరగతులలోనూ, ఇంటర్ మీడియేట్ లోనూ రాజోలు లోనూ గడచింది.
తిరువూరులో సైన్సు పుస్తకాలు చదవడంలో ఇష్టం మొదలయ్యింది. రచయతలు 'మహీదర నళిణీ మొహన్ ' గారు, ' నండూరి రామమొహన రావు ' వ్రాసిన పుస్తకాలూ, (ఇంకా అనేక మంది వ్రాసినవి కూడా) లైబ్రరీ నుండి తెచ్చుకుని చదివేవారు. ఆప్పడిలో రష్యా వారి పుస్తకాలు వాన్ లో తెచ్చి చాలా చవకగా అమ్మేవారు. వాటిల్లో " యాకోవ్ పెరిల్మాన్ " వ్రాసిన నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం రెండు భాగాలు నిత్యజీవితంలో గణిత శాస్త్రం, ట్రిక్కి మేతమాటిక్స్ లాంటివి కొనుక్కుని తెచ్చుకుని చదివే వారు. యాకోవ్ పెరిల్మాన్ వ్రాసిన నిత్యజీవితంలో భౌతిక శాస్త్రంలో ఉండే చిన్న చిన్న ప్రయోగాలు చేసి చూసుకొవడం వల్ల ఫిజిక్స్ ( భౌతిక శాస్త్రం ) అంటే బాగా అభిమానం, ఉత్సుకత లని కలిగించేయి. కొన్ని కొన్ని ప్రయో గాలు అట్ట గొట్టాలతొ టెలిస్కొపు తయారు చెయ్యదము లాంటివి అవ్వలేదు. 39 సంవత్సరాలు సుదీర్ఘంగా భిలాయి ఉందిపొవదం వల్ల చాలా రచయతల పేర్లు ఆయనకి గుర్తు రావడం లేదు....
రాజోలలో లైబ్రరీ పుస్తకాలల్లో సైన్సు పుస్తకాలు తెచ్చుకుని చదివేవారు. ఐన్-స్టఇన్ జీవిత చరిత్ర, విశ్వరహశ్యాలు, లాంటి పుస్తకాలు తదుపరి కాస్మాలజి మీద ఇష్టం కలిగించేయి. తెలుగులో ఆంధ్ర విఙఞాన సర్వస్వం అని 25 వాల్యూములు రిఫరెన్సు బుక్స్ యుండేవి. వారి నాన్న గారి సాయంతొ వాటిని ఇంటికి తెచ్చుకుని చదివే వారు. స్కూలు మానేసి కాలువ దాటి గోదావరి గట్టుమీద గోదావరిని పడవలనీ చూస్తూ కూర్చొని సుదీర్ఘంగా ఆలోచించడం, లైబ్రరీ పుస్తకాలు చదవడం చెయడం వలన కాస్మాలజికి అప్పుడే పునాది రాళ్ళు పడ్డాయి. కానీ స్కూలు అట్టెండంసు బాగా తగ్గిపొయింది. డాక్టరు సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చిన్న తనం నుండి లెక్కల లోనూ భౌతిక శాస్త్రం అంటేను బాగా అభిమానం.
పరిశోధనలు
తరువాత ఇంజినీరింగ్ చదువులో ఎలెక్ట్రానిక్స్ లేక పొవడం వల్ల నేమో దానిమీద అభిమానం కలిగి అది ఒక పేటెంట్ తీసుకొవడం దాకా వెళ్ళింది. వీరి పేటెంట్ వల్ల ప్రస్తుతం వున్న సర్వర్లు లక్ష రెట్లు వేగంగా పనిచేయ గలుగుతాయి.
ఈయన తన పరిశోధనా పటిమతో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలైన స్టీఫెన్ హాకింగ్స్, రోజర్ పెన్ రోజ్ సిద్ధాంతాలకు సవాలు చేసారు. బ్లాక్ హొల్స్ లెవని 2004లో స్టీఫె హాకింగ్స్ చేసిన సిద్ధాంతంలోని అస్పష్టతలను తొలగించాడు. 2004 లో లండన్ డుబ్లిన్ లలో జరిగిన అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని స్టీఫెన్ హాకింగ్స్, రోజర్ పెన్ రోజ్ సిద్ధాంతాలను ఛాలెంజ్ చేసారు. డుబ్లిన్ లో 2004 జూలై 18-23 తేదీలలో జరిగిన "జిఆర్ - 17 అంతర్జాతీయ సైన్స్ సదస్సు"లో ఇందుకు సంబంధించిన తన నిశ్చితాభిప్రాయాలను వెల్లడించాడు. ఆ సదస్సులోనే స్టీఫెన్ హాకింగ్స్, రోజర్ పెన్ రోజ్ లు ఉండటం విశేషం.
స్టీఫెన్ హాకింగ్స్ ప్రతిపాదించిన బింగ్ బ్యాంగ్ సిద్ధాంతంలోని ఊహాత్మక-కాల అక్షం, ప్రస్తుత కాల అక్షానికి లంబంగా ఉందని అందుకే దీనినాధారం చేసుకొని హాకింగ్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని సమర్థించలేమని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన గుప్తా పరిశోధనా ఫలితాలను విడుదలచేసిన ఆక్స్‌ఫర్డు స్టెర్ లోని "రూథర్‌ఫర్డ్" ఆప్లెటన్ లాబొరేటరీస్ కూడా గురుత్వాకర్షణ గల రెండు వేర్వేరు ఖగోళ పదార్థాలు వాటి పరస్పర ఆకర్షణ వలన నాశనం కావని పేర్కొన్నది. గుప్తా చేసిన సవరణలను హాకింగ్ అంగీకరించడమే కాకుండా 2004 చివరిలో వాటిని సవరించాడు.
ఆయన విశ్వంలోని గాలక్సీలు, బ్లాక్ హోల్స్ పై పరిశోధనా వ్యాసాలను వ్రాసారు. వీరు ప్రతిపాదించిన డైనమిక్ యూనివర్స్ మాడల్ అనేది N-Body ప్రాబ్లంకి సొల్యూషణ్. దీనితో బిగ్-బ్యాంగ్ సమాధానం చెప్ప లేని అనేక సమస్యలకు సమాధానం లభిస్తుందిఈయన సిద్ధాంతాల ఆధారంగా అంతరిక్ష కాలంలో క్వాంటం సిద్ధాంతం, గురుత్వాకర్షణ సిద్ధాంతాలపై పరిశోధనలు జరిగాయి. ఆయన అనేక పరిశోధనా వ్యసాలను ప్రచురించారు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన పుస్తకాలు, భౌతిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను వ్రాసారు.
కెనెడియన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ 63 వారు ఆయన వ్రాసిన పరిశోధనా పత్రాన్ని "Dynamic Universe Model Predicts the Live Trajectory of New Horizons Satellite Going To Pluto"ను ప్రచురించారు.