Samavedam Srinivasa Sriramachari
Quick Facts
Biography
సామవేదం శ్రీనివాస శ్రీరామాచారి (1925-2009) వైద్య శాస్త్రవేత్త. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మొదటి అడిషనల్ డైరక్టరు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీలో వ్యవస్థాపక డైరక్టరుగా వ్యవహరించారు.
జీవిత విశేషాలు
ఆయన డా.చారి గా ప్రసిద్ధులు. ఆయన జూన్ 25, 1925లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జన్మించారు. ఆయన వైద్యశాస్త్రవేత్త, పరిశోధకుడుగా తన జీవితాన్ని అంకితం చేసారు. ఆయన విశాఖపట్నంలోని మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యనభ్యసించారు. తరువాత డి.ఎస్.సి ని పాథాలజీలో కూనూర్ లోని న్యూట్రిషనల్ రీసెర్చ్ లాబొరేటరీస్ లో అసిస్టెంట్ రిసెర్చ్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు చేసారు. ఆయన 1950లో ఎం.ది అనంతాచారి ప్రొఫెసర్ అధ్వర్యంలొ టాటా లేడీ మెమోరియల్ ట్రస్టు రీసెర్చ్ ఫెలోషిప్ చేసారు. ఆయన 1959లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్ డి.సిలో ఆర్మెట్డ్ ఫోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ వద్ద న్యూరోపాథాలజీలో శిక్షణ కొరకు వెళ్లారు.
ఉద్యోగ జీవితం
కెరీర్ ప్రారంభంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీకి డైరక్తరు 91965-82) ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థకు డైరక్టరు జనరల్ (1985) వ్యవహరించారు. 1976లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మొదలగు ప్రతిష్టాత్మక సంస్థల ఫెలోషిప్ లను అందుకొని, వైద్యశాస్త్ర పరిశోధనలు చేసారు.
ఆయన డిసెంబరు 23, 2009లో న్యూఢిల్లీలో మరణించారు.
పురస్కారాలు
- శకుంతలాదేవి అమీర్ చంద్ పురస్కారం.
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి పురస్కారం
- డాక్టర్ అరుణ్ కుమార్ బెనర్జీ మెమోరియల్ ఓరేషన్
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ వారి పురస్కారం
- డాక్టర్ బి.సి.రాయ్ నేషనల్ అవార్డు
- బి.ఎన్.రాయ్ నేషనల్ ఆవార్డు
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి అవార్డు
- బి.ఎన్.ఛోప్రా మెమోరియల్ లెక్చర్
- ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారి పురస్కారం
- ఆర్.వి.రాజం ఓరేషన్ ఆఫ్ NAMS.