Pindiprolu Laksmanakavi
Quick Facts
Biography
పిండిప్రోలు లక్ష్మణకవి తెలుగు కవి. అతను నియోగిబ్రాహ్మణుఁడు. గోదావరి జిల్లాలోని రామచంద్రపురము తాలూకాలోని 'కుయ్యేరు' అనుగ్రామంలో నివాసముండేవాడు. అతడు ఆ గ్రామానికి మిరాసీదారుడు. ఈ గ్రామము పిఠాపురం జమీందారీ లోనిది.
జీవిత కాల నిర్ణయం
ఇతడు ఆంధ్ర గీర్వాణములలో విశేష ప్రజ్ఞ గలవాడు. అతను ఆంధ్రమున మిక్కిలి ప్రజ్ఞ గలవాడు. అతను తెనాలి రామకృష్ణుని వలె హాస్య స్వభావం గలవాడు. అందువలన గోదావరి ప్రాంతంలో ఇతని పేరు విశేషంగా ఖ్యాతి పొందెను. అతను "రావణదమ్మీయముం" అను గ్రంథమును రచించెను. గ్రంథంలో అతను గ్రంథ రచనాకాలమును తెలియజేసాడు. ఆ వాక్యముల ఆధారంగా అతని కాలాన్ని యించుమించుగా ఊహించవచ్చు. అతని రచనలో నీలక్ష్మణకవి యీగ్రంథమును రచియించిన కాలము శాలివాహన సంవత్సరముయొక్క పదునెనిమిదవ శతాబ్ద ప్రారంభమం దని తేలుచున్నది. అప్పటికి అతని వయస్సు 50 సంవత్సరములు ఉన్న యెడల అతని జనన కాలం శా. స. 1660 సమీపకాలమై యుండును. లక్ష్మణకవి క్రీ. శ. 1770 సం. మొదలు క్రీ. శ. 1840 సం సంవత్సరమువఱకు జీవించియున్నట్లు నిశ్చయించవచ్చు.
జీవిత విశేషాలు
లక్ష్మణ కవి గోపాలమంత్రి, రాజమ్మలకు జన్మించాడు. లక్ష్మణకవి తండ్రి గోపాలమంత్రి రావు మహీపతి రాయుని ఆజ్ఞ చేత గుయ్యేరను గ్రామంలో అధికారంలో ఉండెను. అతనికి నలుగురు కుమారులు. వారు తిరుపతయ్య, రామకృష్ణయ్య, లక్ష్మణకవి, రామయ్యలు. వారిలో మూడవవాడైన లక్ష్మణకవి జమ్మకు వివాహమాడాడు. గోపాలమంత్రి దానగుణం గలవాడు. గోపాలమంత్రి భార్య రాజమ్మ మరణానంతరాం రచ్చమ్మతో రెండవ వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి అతని పెద్ద కుమారుడు తిరుపతయ్య గతించెను. కొంత కాలానికి గోపాలమంత్రి కూడా స్వర్గస్థుడయ్యెను. అతని మరణం తరువాత అతని రెండవ కుమారుడు రామకృష్ణయ్య కుయ్యేరు గ్రామమునకు అధికారి అయ్యను. రామకృష్ణయ్య అతని తమ్ములను వెంటబెట్టుకొని ఆత్రేయీనామక గోదావరీశాఖలో స్నానమునకు వెళ్ళి తిరిగి వచ్చుచు అచట గోపాలస్వామి ఆలయంలో దర్శనం చేసుకొనెను. ఇంటికి పోవుచుండగా సరస్వతీదేవి రామకృష్ణునికి ప్రత్యక్షమై నిన్ను వరియింప వచ్చితిని గైకొనుము అని చెప్పనట. అపుడు రామకృష్ణుడు తన తమ్ముడు లక్ష్మణకవిని చూపినాడట. వేదముల నుపనిషత్తులలోని అర్థములను తెలుసుకొని బ్రహ్మతత్త్వమును గ్రహించెను. ఈవిషయం గ్రంథం మొదటలో చెప్పబడినది.