peoplepill id: nomula-satyanarayana
NS
India
1 views today
1 views this week
Nomula Satyanarayana

Nomula Satyanarayana

The basics

Quick Facts

Places
Work field
Place of birth
Nalgonda, Nalgonda mandal, Nalgonda district, India
The details (from wikipedia)

Biography

నోముల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన సాహితీవేత్త, రచయిత, బహుబాషావేత్త.తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌మరియు హిందీ భాషల్లో అనేక రచనలు రచించాడు.

జీవిత ప్రస్థానం

ఈయన నల్లగొండలోని రవీంద్ర నగర్‌లో నివస్తుండేవాడు. ఉపాధ్యాయ జీవితం నుంచే ఆయన రచనా ప్రస్థానం మొదలైంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలకు సంబంధించిన నవలలు, కావ్యాలు, సాహిత్యాలను అనువాదం, రచనలు రచించి ఒక చెరగని ముద్రని వేసుకున్నాడు. 1962లో ఈయన రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సృజన పేరుతో అప్పట్లో పేరుగాంచిన మాసపత్రికలో 1970 నుంచి 1974 వరకు ప్రేమ్‌చంద్, రావిశాస్త్రి, కృష్ణశాస్త్రిలపై ఆయన రాసిన కథలు, నవలలు, సాహిత్యాలు ప్రచురితమయ్యాయి. శ్రీశ్రీపై కూడా ఆయన వ్యాసాలు రాసాడు. ఉర్దూ సాహిత్యంలో రజర్, రుబాయ్‌తో పాటు మహ్మద్ ఎక్బాల్‌పైనా ఆయన వ్యాసాలు రాశాడు. 1971లో చైనీస్ నాగలిలో ‘నా కుటుంబం’ పేరుతో మొదలైన నవల ఐదు పర్యాలుగా విడుదల చేసాడు.

ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రచనలు

ఈయన ఔరేక్ నయా పూల్ అనే పుస్తకాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేశాడు. కాళోజీ నారాయణరావు, వరవరరావు, వేణు సంకోజులు రాసిన పలు కవితా సంకలనాలను ఈయన ఉర్దూ భాషలోకి అనువదించాడు.

పురస్కారాలు

  • 2015 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం-2015 లో భాగంగా ఎటుకూరి వెంకట నర్సయ్య స్మారక కీర్తి పురస్కారం.

మరణం

ఈయన డిసెంబర్ 26, 2018 న శ్వాసకోశ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.

మూలాలు

  1. "బహుభాషా కోవిదుడు..'నోముల". 2018-12-27. Archived from the original on 2018-12-27. Retrieved 2018-12-27.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "బహు భాషావేత్త నోముల సత్యనారాయణ కన్నుమూత". 2018-12-27.
  3. "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
  4. "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.
The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Nomula Satyanarayana is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Nomula Satyanarayana
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes