peoplepill id: marepalli-ramachandra-sastry
MRS
1 views today
1 views this week
Marepalli Ramachandra Sastry
Telugu writer

Marepalli Ramachandra Sastry

The basics

Quick Facts

Intro
Telugu writer
Work field
Birth
Death
Age
77 years
The details (from wikipedia)

Biography

మారేపల్లి రామచంద్ర శాస్త్రి (నవంబరు 3, 1874 -సెప్టెంబరు 9, 1951) తెలుగు జాతికి పేరు తెచ్చిన వారిలొ ముఖ్యులు. సేవకు మారుపేరు శాస్త్రిగారు. మారేపల్లి వారిని విశాఖపట్నం ప్రజలు "కవి" గారు అని పిలిచేవారు. కవిగారు ఆంధ్ర, సంస్కృత, ఆంగ్ల భాషలలో పండితులు. ఆంధ్రంలో అష్టావధానం చేయగలిగిన సామర్ధ్యం వారికుండేదట. గ్రాంథికవాదే అయినప్పటికీ, అచ్చతెలుగు మీద ఆయనకు మమకారం చాల హెచ్చు

బాల్యం

వీరు కృష్ణా జిల్లా, కనకపల్లి అగ్రహారం లో నవంబరు 3, 1874 లో జన్మించారు. కనక దుర్గమ్మ, శ్రీరాములు వీరి తల్లిదండ్రులు. శాస్త్రి గారు పుట్టింది కృష్ణా జిల్లా అయినా విశాఖపట్టణాన్నే తన స్వంత ఊరు చెసుకున్నారు. ప్రాథమిక విద్య కనకపల్ల గ్రామంలోనూ, కళాశాల విద్య కాకినాడ , విశాఖలోనూ సాగింది. 1893 లో విశాఖ హిందూ కళాశాలలో ఎఫ్,ఎ క్లాసులో చేరడనికి శాస్త్రిగారు తొలుత విశాఖలో అడుగు పెట్టారు. విద్యార్థిగా, విశాఖ వచ్చిన రామచంద్ర శాస్త్రిగారు బహుముఖ సేవల ద్వారా ప్రజల హృదయాలకు సన్నిహితుడై తన మనుగడను విశాఖకు అంకితమిచ్చాడు.

19 వ శాతాబ్ది ఆఖరు దశకంలో "జాతీయ ఉద్యమం" విద్యావంతులలో నెమ్మది నెమ్మది గా దేశభక్తిని ప్రబోధించ సాగింది. 1893 లో కాంగ్రెస్ నివేదిక చదవడంతో శాస్త్రిగారిలో "నా దేశం - నా భాష" అనే అభిమానం వచ్చింది. వీరు చదువు చాలించిఅ తరువాత కొద్దిమాసాలు మునసబు కోర్టులో పనిచేశారు. విశాఖ మిషన్ పాఠశాలలో కొన్నేళ్ళు తెలుగు పండితులుగా పనిచేశారు. "దేశ సేవకు భాషా సేవకు తగినవారిని తయారుచేస్తేనే ఉద్యమాలు ఫలవంతం కాగలవని" కవిగారు తొలి నుంచి భావించారు.

సంఘసేవ,దేశసేవ కార్యక్రమాలు

విశాఖపట్నం కేంద్రంగా రామచంద్ర శాస్త్రి గారు వివిధ రంగాలలో సమాజానికి ఉపయుక్తమైన పెక్కు కార్యక్రమాలు చేపట్టారు. సాహిత్య రంగం, సంఘ సంస్కరణ రంగం, విద్యారంగం, నాటక రంగం, దేశ సేవారంగం ఇట్లా శాస్త్రి గారు లేని జనహిత కార్యక్రమాలే లేవంటె ఆశ్చర్యం ఉండదు.

ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. యువ కవులను ప్రోత్సహించి వారిచే గ్రంథములనూ రాయించారు.

సంగీత మానినీ సమాజము, జగన్మిత్ర సమాజము , కళాభిలాషక నాటక సమాజము మున్నగునవి స్థాపించడంలోనూ లేదా ప్రారంభానికి వీరు మూలకారణమవడమో అయ్యారు. నటులుగా, నాటక దర్శకులుగా, నాటక రచయితగా శాస్త్రిగారు తమ నైపుణ్యం చూపారు.

1913 "హైందవ హితసభ" భారతీయ ధర్మ మును బోధించే సంయమనం స్థాపించారు.

1918 లో ధర్మాశ్రమంలో "ఆంధ్ర కళాశాల" పెద్ద చదువు వారికి చెప్పేది ప్రారంభిచారు. 1912 లో వేద పాఠశాలను, ఆయుర్వేద కళాశాలను నెలకొల్పారు. క్రీడల ప్రోత్సాహానికి 1917 లో విశాఖపట్టణం,వ్యాయామ క్రీడా సంఘం అనుపేరున కొందరి పెద్దల సహాయముతో వ్యాయామ క్రీడల సంఘాన్ని యేర్పాటు చేయించారు.

గ్రంధలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం గ్రంధాలయమును యేర్పాటు చేశారు. దంత కళాశాల, నేత్ర కళాశాల కూడాస్థాపించారు. నిజానికి సాహిత్యరంగంలో కంటె సాంఘికరంగంలోనే రామచంద్రశాస్త్రిగారి కృషి ఎక్కువగా కనబడుతుంది. అనర్గళంగా ఉపన్యసించే శక్తి ఆయనకు ఉండేదని, మైకులులేని ఆరోజులలో (అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాకముందు, 1910-20 ప్రాంతాల్లో) వేలాదిమంది జనాన్ని తమ ఉపన్యాసంతో ఆకట్టుకోగలిగేవారనీ, జాతీయోద్యమంలో గాంధీగారి అనుచరులై ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారనీ వారిని గురించి పెద్దలు వ్రాసిన వ్రాతల వలన తెలుస్తుంది.సాంఘికంగా వీరేశలింగంగారితో మొదలైన సంస్కరణధోరణిని అందిపుచ్చుకుని విశాఖపట్టణంలో తమ వంతు సేవగా పాఠశాలలను స్థాపించడం, బాల బాలికలకు విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా కొనసాగించారు.

తెలుగు భాషా సేవ

గ్రాంథికవాదే అయినప్పటికీ, అచ్చతెలుగు మీద ఆయనకు మమకారం చాల హెచ్చు. ఈ మమకారం అచ్చతెలుగులో ఒక నిఘంటువును రూపొందించే దాకావెళ్ళింది.కాని, ఆ నిఘంటు నిర్మాణం పూర్తయినట్లుగా కనపడదు. విశాఖపట్టణంలో శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామి, ఇత్యాదులు కలిసి ఏర్పరచిన ‘కవితా సమితి’అనే సాహితీ సంస్థకు కవిగారు అద్యక్షులుగా ఉండేవారు.

సంస్కృత భాషా సంపర్కంవలన తెలుగులో చాలా పదాలు అంతరించి పోయినాయనీ, వాటిని తిరిగి సంపాదించుకోవడం కర్తవ్యమనీ నమ్మి ఆదిశగా కృషి చేశారు. సామాన్యంగా ఉత్తరప్రత్యుత్తరాలలో వాడే ‘శుభం’ అనే మాటకు అచ్చతెలుగు సమానార్ధకంగా ‘మేల్ ‘అనే మాటను వారు వాడే వారు. ‘దేవుడు’ అనే పదానికి ‘ఎల్లడు’ అనేది అచ్చతెలుగులో వారు సూచించిన పదం.

దేశ సేవ

  • 1914 నుండి 1933 వరకు దేశ స్వాతంత్ర్యోద్యమంలో శాస్త్రి గారు పలురకాలుగా సేవలందించారు. 1916 లో కాకినాడ లో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. 1918 లో విశాఖపట్టణం జిల్లా ప్రజా సంఘాన్ని స్థాపించారు. వసంతరావు బుచ్చి సుందరవారు గారు వీరికి చేదోడు వాదోడుగా నిలిచారు. 1920 లో కవిగారు, బుచ్చి సుందరవారు పంతులు గారు కలసి నాగపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు ప్రతినిధులుగా వెళ్ళారు. వీరిలో మల్లిమడుగుల బంగారయ్య గారు వెళ్ళారు.
  • 1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు. 1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు. 1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన కారాగార శిక్ష విధించబడింది.
  • విశాఖపట్నం కేంద్రంగా రామచంద్ర శాస్త్రి గారు వివిధ రంగాలలో సమాజానికి ఉపయుక్తమైన పెక్కు కార్యక్రమాలు చేపట్టారు. సాహిత్య రంగం, సంఘ సంస్కరణ రంగం, విద్యారంగం, నాటక రంగం, దేశ సేవారంగం ఇట్లా శాస్త్రి గారు లేని జనహిత కార్యక్రమాలే లేవంటె ఆశ్చర్యం ఉండదు.
  • ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. యువ కవులను ప్రోత్సహించి వారిచే గ్రంథములనూ రాయించారు.
  • సంగీత మానినీ సమాజము, జగన్మిత్ర సమాజము , కళాభిలాషక నాటక సమాజము మున్నగునవి స్థాపించడంలోనూ లేదా ప్రారంభానికి వీరు మూలకారణమవడమో అయ్యారు. నటులుగా, నాటక దర్శకులుగా, నాటక రచయితగా శాస్త్రిగారు తమ నైపుణ్యం చూపారు.
  • 1913 "హైందవ హితసభ" భారతీయ ధర్మ మును బోధించే సంయమనం స్థాపించారు.
  • 1918 లో ధర్మాశ్రమంలో "ఆంధ్ర కళాశాల" పెద్ద చదువు వారికి చెప్పేది ప్రారంభిచారు.
  • 1912 లో వేద పాఠశాలను, ఆయుర్వేద కళాశాలను నెలకొల్పారు.
  • క్రీడల ప్రోత్సాహానికి 1917 లో విశాఖపట్టణం,వ్యాయామ క్రీడా సంఘం అనుపేరున కొందరి పెద్దల సహాయముతో వ్యాయామ క్రీడల సంఘాన్ని యేర్పాటు చేయించారు.
  • గ్రంధాలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం గ్రంధాలయమును యేర్పాటు చేశారు.
  • దంత కళాశాల, నేత్ర కళాశాల కూడాస్థాపించారు.
  • 1914 నుండి 1933 వరకు దేశ స్వాతంత్ర్యోద్యమంలో శాస్త్రి గారు పలురకాలుగా సేవలందించారు.
  • 1916 లో కాకినాడ లో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు.
  • 1918 లో విశాఖపట్టణం జిల్లా ప్రజా సంఘాన్ని స్థాపించారు. వసంతరావు, బుచ్చి సుందరవారు గారు వీరికి చేదోడు వాదోడుగా నిలిచారు.
  • 1920 లో కవిగారు, బుచ్చి సుందరవారు, మల్లిమడుగుల బంగారయ్య గారు, పంతులు గారు కలసి నాగపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు ప్రతినిధులుగా వెళ్ళారు.
  • 1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు.
  • 1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు.
  • 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు.
  • 1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన కారాగార శిక్ష విధించబడింది.
  • 1904 లో "కళాభిలాషక కావ్యమాలిక" పేరున పలు గ్రంధాలు ప్రచురించారు.
  • 1926 లో వీరి అధ్యక్షతన "కవితా సమితి" ఆవిర్భవించింది.

సాహిత్య రంగం

1904 లో "కళాభిలాషక కావ్యమాలిక" పేరున పలు గ్రంథాలు ప్రచురించారు. 1926 లో వీరి అధ్యక్షతన "కవితా సమితి" ఆవిర్భవించింది. మహోద్యమం వంటి రామచంద్ర కవి గారు 1951, సెప్టెంబరు 9న లో పరమ పదించారు.

మూలాలు

  • సి.హెచ్ ఆచార్య వ్రాసిన ఉత్తరాంధ్ర సాహిత్యోద్యమ చరిత్ర.

యితర లింకులు

1) తెలుగు తోబుట్టువులు పుస్తకం లంకె : https://archive.org/details/in.ernet.dli.2015.372345/mode/2up

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Marepalli Ramachandra Sastry is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Marepalli Ramachandra Sastry
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes