L. Subrahmanya Sastri
Quick Facts
Biography
చరణ్‌మహాదేవి ఎల్.సుబ్రహ్మణ్య శాస్త్రి కర్ణాటక సంగీత వీణ విద్వాంసుడు.
విశేషాలు
ఇతడు 1893 నవంబరు 7వ తేదీన ఒక సంగీతకారుల కుటుంబంలో తమిళనాడు రాష్ట్రం, రామనాథపురం జిల్లా, ముదుకులతూర్ గ్రామంలో జన్మించాడు. ఇతడు సుబ్బరామ దీక్షితార్, అంబి దీక్షితార్ వంటి మహామహుల వద్ద సంగీతం అభ్యసించాడు. మైసూరు సంస్థాన వైణిక విద్వాంసుడు వీణ శేషణ్ణ వద్ద ఇతడు వీణావాదనం అభ్యసించాడు.ఇతడు మైసూరు మహారాజా సంస్కృత కళాశాలలో వ్యాకరణశాస్త్రం అభ్యసించాడు. ఇతని తొలి ప్రదర్శన 1920 నవంబరు 21న బెంగళూరులో జరిగింది. తరువాత ఐదు దశాబ్దాలకు పైగా వీణావాద్య కచేరీలు నిర్వహించాడు.
1960లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతంలో ఇతని కృషికి గుర్తింపుగా అవార్డును ప్రకటించింది. 1961లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై ఇతడిని "సంగీత కళా శిఖామణి" బిరుదుతో సత్కరించింది. ఎట్టాయపురం, తిరువాంకూరు సంస్థానాలు ఇతడిని సన్మానించాయి. రుషీకేశ్‌కు చెందిన స్వామి శివానంద సరస్వతి ఇతడికి "వైణిక విద్యా పారంగత" అనే బిరుదును ఇచ్చాడు.
ఇతడు తన 77వ యేట 1970లో మరణించాడు.