peoplepill id: kotla-venkateswarareddy
Telugu writer
Kotla Venkateswarareddy
The basics
Quick Facts
The details (from wikipedia)
Biography
కోట్ల వెంకటేశ్వరరెడ్డి తెలుగు కవి, రచయిత. 2019లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.
జీవిత విశేషాలు
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వేంకటేశ్వరరెడ్డి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. జలజం సత్యనారాయణతో కలిసి తెలంగాణ రచయితల వేదికకు జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నానీల రచనలో వీరిది అందెవేసిన చెయ్యి. "నూరు తెలంగాణ నానీలు", "నాన్నా! నాలా ఎదుగు", "మనిషెల్లిపోతుండు", "గుండె కింద తడి", రహస్యాలు లేని వాళ్ళు, రంగు వెలసిన జెండా వంటి కవితా సంకలనాలు వెలువరించాడు, నాలుగు సార్లు రంజని-కుందుర్తి అవార్డ్ అందుకున్నాడు. సమతా రచయితల సంఘం వారి ఉత్తమ కవితా సంపుటి అవార్డును 1998లో అందుకున్నాడు.
రచనలు
- నూరు తెలంగాణ నానీలు (నానీలు)
- నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత)
- మనిషెల్లిపోతుండు (వచన కవితలు)
- గుండె కింద తడి (వచన కవితలు)
- రహస్యాలు లేని వాళ్ళు (వచన కవితలు)
- రంగు వెలసిన జెండా (వచన కవితలు)
- హరితస్వప్నం
- అంతర్వాహిని
- మనుమసిద్ది
పురస్కారాలు
- తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, "వివిధ ప్రక్రియలు" విభాగం, 2016 మే 12.
- 2019 కాళోజీ స్మారక పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం, 2019 సెప్టెంబరు 9.
మూలాలు
ఇతర లింకులు
The contents of this page are sourced from Wikipedia article.
The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Kotla Venkateswarareddy is in following lists
By work and/or country
comments so far.
Comments
Credits
References and sources
Kotla Venkateswarareddy