Dittakavi Narayanakavi
Quick Facts
Biography
దిట్టకవి నారాయణకవి తెలుగు కవి.
జీవిత విశేషాలు
అతను ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రానికి చెందిన పాపరాజకవి కుమారుడు. ఇతడు రంగరాయచరిత్రము అనే ప్రబంధమును రాసి దానిని కృష్ణామండలములోని నర్సారావుపేట జమీందారు మల్రాజు రామారాయని కి అంకితం చేసాడు. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ పుస్తకము 1757 వ సంవత్సరమున బొబ్బిలికోటవద్ద శ్రీరావు రంగారాయఁడు గారికిని ఫ్రెంచిసేనానాయకుఁ డగు బుస్సీ గారితో నచ్చటి కేగిన పూసపాటి విజయరామరాజు గారికిని జరిగినయుద్దము భారతయుద్దమువలె వర్ణింపబడినది. బొబ్బిలికోటవద్ద జరిగిన యుద్దక్రమమును బొబ్బిలి సంస్థాన చరిత్రమును కథా సందర్భమున నిందు కొంత వివరించబడి ఉన్నది.
ఈ రంగారాయచరిత్రమును తొలిసారి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1885 లో ముద్రించారు. దీని మూడవ కూర్పు 1914 ముద్రించబడి ప్రస్తుతం అందుబాటులోనున్నది.