Devakottai A Narayana Iyengar
Quick Facts
Biography
దేవకోట్టై ఎ.నారాయణ అయ్యంగార్కర్ణాటక సంగీత వైణిక విద్వాంసుడు.
విశేషాలు
ఇతడు తమిళనాడులో దేవకోట్టై గ్రామంలో అళగర్‌స్వామి అయ్యంగార్, సౌందరవల్లి అమ్మాళ్ దంపతులకు 1905, మార్చి 29వ తేదీన జన్మించాడు. ఇతడు మొదట సంగీతాన్ని దాసమంగళం వెంకటరామ అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత తిరువిదైమరుదూర్ శాఖరామారావు వద్ద, కారైక్కుడి బ్రదర్స్ (సుబ్బరామ అయ్యర్, సాంబశివ అయ్యర్) వద్ద నేర్చుకుని సంగీతంలో పరిపూర్ణత సాధించాడు.
ఇతడు తన మొట్టమొదటి కచేరీ 30 యేళ్ళ వయసులో కొలియూర్‌లో కారైక్కుడి సాంబశివ అయ్యర్‌తో కలిసి నిర్వహించాడు.ఇతడు కొంతకాలం ఎం.ఎ.కళ్యాణకృష్ణ భాగవతార్‌తో కలిసి జంటగా వీణాగాన కచేరీలు నిర్వహించాడు. వాయులీన విద్వాంసుడు అరియకుడి రామానుజ అయ్యంగార్తో కూడా ఒక కచేరీలో జంటగా పాల్గొన్నాడు.
ఇతడు మద్రాసులోని కేంద్ర కర్ణాటక సంగీత కళాశాలలో 14 సంవత్సరాలు సంగీత గురువుగా అనేక మంది శిష్యులకు వీణావాదనం నేర్పించాడు. తరువాత ముంబైలోని భారతీయ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ సొసైటీ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
సంగీత రంగంలో ఇతడు చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర సంగీత నాటక అకాడమీ 1969లో ఇతనికి కర్ణాటక సంగీతం వాద్యం (వీణ) విభాగంలో అవార్డును ప్రకటించింది.