Budati Venkateswarlu
Quick Facts
Biography
బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) అధ్యాపకులు, సాహిత్య విమర్శకులు, భాషావ్యాకరణశాస్త్ర పండితులు, కవి. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.
జీవిత విశేషాలు
బూదాటి వెంకటేశ్వర్లు రాజాపేట (చిలకలూరిపేట మండలం) గుంటూరు జిల్లాలో బూదాటి సుబ్రహ్మణ్యం బూదాటి అప్పమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య రాజాపేటలో, హైస్కూల్ విద్య పురుషోత్తమ పట్టణంలో, కళాశాల విద్య గణపవరంలో చదువుకున్నారు. ఎం.ఏ నాగార్జన విశ్వవిద్యాలయంలో చదివారు. ఎం.ఏ లో రెండు బంగారు పతకాల్ని పొందారు. నాగార్జున విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో మొట్ట మొదటగా యు.జి.సి వారు నిర్వహించే నెట్ పరిక్ష ఉత్తీర్ణులై ఫెలోషిప్ (జెఆర్.ఎఫ్)ను పొందారు. పరిశోధన కోసం ఆంధ్ర విశ్వ కళాపరిషత్తుకు వెళ్లి హరివంశము-ఎఱ్ఱన, సోమనల తులనాత్మక పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పొందారు. ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 2023లో డిలీట్ దొకటర్స్ ఆఫ్ లెటర్స్ పొందారు
ఉద్యోగ జీవితం
బూదాటి వెంకటేశ్వర్లు మొదటగా ఒంగోలులోని SSN రెసిడెన్షియల్ కళాశాలలో తెలుగు సంస్కృత అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత నరసరావుపేటలోని శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో పనిచేసారు. ఈటివి కొత్తగా ప్రారంభమైన కాలంలో స్టోరీ డిపార్టుమెంటులో రెండు సంవత్సరాలు పనిచేశారు. 1998లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ వారు నిర్వహించిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా ఎంపికయ్యారు. సత్తుపల్లి జలగం వెంగళ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, ఖమ్మం SR & GNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను 2006 వరకు పనిచేశారు. కుప్పంలోని ద్రావిడ విశ్వ విద్యాలయంలో 2006 నుంచి సహఆచార్యులుగా, ఆచార్యులుగా, తెలుగు శాఖ అధ్యక్షులుగా 2016 పనిచేసారు. 2016 నుంచి దేశంలోనే ప్రసిద్ధి చెందిన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేస్తునారు. 2018లో ఆంధ్ర ప్రదేశ కేంద్రీయ విశ్వవిద్యాలయంవారి ఆహ్వానం మేరకు డిప్యుటేషన్ పై వెళ్ళి ఒక విద్యా సంవత్సరం పనిచేశారు.2022 జనవరి నుండి నుండి శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రచనలు
- కరదీపిక 1988
- మువ్వల సవ్వడి 1992
- సౌదామినీలు 1999
- ఆనందశాఖి 2006
- తెలుగు బోధన సమస్యలు - పరిష్కారాలు 2006
- ఆధునిక భాషాబోధన సందర్భం - చిన్నయసూరి 2009
- విజయ విలాసము 2010
- సర్పయాగము 2010
- కరదీపిక (అలంకారాలు) 2011
- నీతి సీసశతకవ్యాఖ్య (తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు) 2011
- తెలుగు ప్రశ్నోత్తర కౌముది 2011
- భారతీయ గ్రంథ ప్రరిష్కరణ పద్ధతులు 2012 (S.M.కత్రే పుస్తకానికి అనువాదం )
- తెలుగు సాహిత్య సౌందర్య మీమాంస 2012
- తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు 2012
- ఎర్రన్న కవితాతత్త్వము 2012
- లోనారసి (వ్యాస సంకలనం) 2013
- చిన్నప్ప రెడ్డి కథ (వీరగాధ పరిశోధన) 2013
- అలంకార చంద్రిక 2013
- సంప్రదాయ తెలుగు వ్యాకరణాలు 2014
- ఆనంద కందళి (సాహిత్య వ్యాస సంకలనం) 2016
- భాగవతం (చతుర్థ స్కంధవ్యాఖ్య) 2016
- సువర్ణ సౌరభం (వ్యాస సంకలనం) – 2017
- చామీకరం (వ్యాస సంకలనం) – 2019
- గాంధీ శతక౦ (మంగిపూడి) - వ్యాఖ్యానం – 2019
- క్రీస్తు చరిత్ర (గుర్రం జాషువ) - వ్యాఖ్యానం (గుర్రం జాషువా) – 2022
- నిరుద్ధ భారతం (మంగిపూడి) - వ్యాఖ్యానం - 2022
- అంతరాలోకనం (సాహిత్య వ్యాసాలు) - 2023
- మనుచరిత్రము (అల్లసాని పెద్దన) – వ్యాఖ్యానం -2024
- సాహిత్యంలో పాత్ర సృజన పద్దతులు 2024
పురస్కారాలు
- 2024లో సాహిత్య విమర్శ విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)
- 2023లో ఆంధ్రప్రదేశ ప్రభుత్వంవారి గిడుగు భాషా పురస్కారం
- 2023లో 'సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్' ద్వారా 'సహృదయ సాహిత్య పురస్కారం'
- 2022లో మాడభూషి సాహిత్య కళాపరిషత్ వారి సాహిత్య పురస్కారం
- 2020లో 'నాగభైరవ కళాపీఠం, ఒంగోలు' వారిచే 'నాగభైరవ అవార్డు'
- 2014లో 'తెలుగు శాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం' ద్వారా 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'
మూలాలు
బాహ్య లింకులు
- AVKF లో బూదాటి వెంకటేశ్వర్లు పుస్తకాలు
- లోగిలో బూదాటి వెంకటేశ్వర్లు పుస్తకాలు
- బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ
- పుస్తకం ఆర్గ్ లో బూదాటి వెంకటేశ్వర్లు పుస్తకాలు
- నేషనల్ లైబ్రరీలో ఆధునిక భాశాభోధన-చిన్నయసూరి పుస్తకం వివరాలు
- అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -39 ఆనందశాఖి పుస్తకం వివరాలు
- ఎస్వీ సాహితీ యశస్వి..
- సాహితీ యశస్వి
- సాహితీ యశస్వి- వ్యాస మాలిక