Ashok Chakravarthy Tholana
Quick Facts
Biography
అశోకచక్రవర్తి తోలానా, తెలంగాణకు చెందిన అంతర్జాతీయ కవి, రివ్యూ రైటర్, యూనివర్సల్ పీస్ అంబాసిడర్, గ్లోబల్ హార్మోనీ అసోసియేషన్ వైస్‌చైర్మన్. అశోకచక్రవర్తి రాసిన కవితలు ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలలో వందలాది సాహిత్య పత్రికలు, సంకలనాలు, ఇ-జైన్ లు, పత్రికలు మొదలైనవాటిలో ప్రచురితమయ్యాయి. మలేషియా ప్రభుత్వం నుండి అరుదైన పురస్కారాలు అందుకున్న 8 మంది ప్రపంచ కవులలో ఒకడిగా,వెనిజులా చరిత్రలో అత్యంత ప్రశంసలు పొందిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.
జననం
అశోకచక్రవర్తి 1960లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.
రచనారంగం
విశ్వశాంతి, ప్రపంచ బ్రదర్‌హుడ్, పర్యావరణ స్పృహను పెంపొందించడానికి కవిత్వాన్ని రాశాడు. 'యూనివర్సల్ పీస్ అంబాసిడర్' అనే బిరుదును అందుకున్నాడు. అశోకచక్రవర్తి రాసిన ది వరల్డ్ నీడ్స్ పీస్ అనే కవిత 2016లో అత్యుత్తమ 12 కవితలలో ఒకటిగా ఎంపిక చేయబడింది, తైవాన్‌లోని ఫార్మోసా పొయెట్రీ ఫెస్టివల్‌లో “లిటరేచర్ ఆఫ్ ది సెలైన్ ల్యాండ్” పేరుతో ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది. 2017లో రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా (దక్షిణ అమెరికా) "మెరిటో అల్ ట్రాబాజో" అవార్డుకు ప్రతిపాదించబడ్డాడు. ఇతడు రాసిన కవితలు 15 అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. దేశ విదేశ ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు. అశోక్ రాసిన 18 సంపుటాలలో ఆరు ఆంగ్ల కవితా సంపుటాలు ప్రచురించబడ్డాయి. 13 ఆధ్యాత్మిక సంబంధిత పుస్తకాలను తెలుగు నుండి ఆంగ్ల భాషలోకి అనువదించాడు.
రచనలు
- కాలిడోస్కోప్
- ఆల్టిట్యుడ్స్: అఫ్ పొయెటిక్ థాట్స్
- హోరిజోన్ అఫ్ పొయెటిక్ ట్వింకిల్స్
- ఔట్లెట్: ఎ పొయెటిక్ ఫ్లో అఫ్ థాట్స్
పురస్కారాలు
- రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ హానర్-2022 అవార్డు (మోటివేషన్ స్ట్రిప్స్ రైటర్స్ ఫోరమ్ (సల్తనత్ ఆఫ్ ఒమన్), సీషెల్స్ ప్రభుత్వ సాంస్కృతికశాఖ)
- 'మెడాలియన్ పులారా' సత్కారం ('కవిత్వం ద్వారా ప్రపంచ శాంతి' కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా)