peoplepill id: asha-mathur
AM
India
1 views today
1 views this week
Asha Mathur
Indian clinical pathologist

Asha Mathur

The basics

Quick Facts

Intro
Indian clinical pathologist
Places
Gender
Female
Birth
Age
87 years
The details (from wikipedia)

Biography

ఆషా మాథుర్ భారతదేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఈమె మెడికల్ మైక్రోబయాలజీ, వైరాలజీ, ఇమ్యునాలజీ విభాగాలలో శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

ఆషా మాథుర్ ఉత్తర ప్రదేశ్లో 1938 లో జన్మించారు. ఈమె తండ్రి జగదీష్ నారాయణ్. ఆయన ప్రసిద్ధ ఇంజనీర్. ఆషా జగదీష్ నారాయణ్ కు రెండవ కుమార్తె. ఆయన అనేక వినూత్న నిర్మాణాలను హైడ్రాలిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఆవిష్కరించారు. ఆయన "నడిచే విజ్ఞాన సర్వస్వము"గా ప్రసిద్ధుడు. ఆమె తల్లి బిందేశ్వరి ప్రతిభావంతురాలైన చిత్రకారిణి. కౌమార దశలో ఉన్నప్పుడు తన ముఖం పై బొల్లి మచ్చలు వచ్చినపుడు ఆమె సహ విద్యార్థులు ఆమెను దూరంగా ఉంచారు. ఆమె ఉత్సాహవంతమైన విద్యార్థిని అయినప్పటికీ డిప్రెషన్, ఇన్‌ఫీరియారిటీ కాప్లెక్స్ వలన పాఠశాలకు వెళ్ళుట మానివేసెను. ఆమె తల్లిదండ్రుల సహకారంతో ఆమె ప్రతిభ మరల వికసించింది. రెండేళ్ల తర్వాత ఆమె పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆమె తన తాతగారి ప్రేరణతో విద్యను కొనసాగించారు. తామే తాతగారు మొదటి ఇండియన్ సివిల్ సర్జన్లలో ఒకరు. ఆమె అంకుల్ ఒక ప్రసిద్ధ కంటి వైద్యులు. వీరు వైద్యరంగంలో ఉన్నందున వారి ప్రేరణతో ఆమె అగ్రా మెడికల్ కాలేజీలో మెడిసన్ లో ప్రవేశించారు.అచట ఆమె ఎం.బి.బి.యస్ డిగ్రీని పూర్తిచేశారు. తర్వాత ఆమె లక్నో లోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అచట పాథాలజీ, మైక్రో బయాలజీలలో డాక్టర్ ఆఫ్ మెడిసన్ (ఎం.డి) పట్టాను పొందారు, బంగారు పతకాన్నిగెలుచుకున్నారు. ఆమె కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ విభాగంలో అధ్యాపకులుగా పనిచేసి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేశారు. అదే విధంగా వైరాలజీలో తన పరిశోధనలు కొనసాగించారు. ఆమె 30 సంవత్సరాలుగా అనేక సామర్థాలుగల వివిధ పదవులు చేశారు. బోధన పాటు, ఆమె శాస్త్రీయ, మానవతావాదం ఆధారంగా పరిశోధన కార్యక్రమాలు ప్రారంభించారు. తన పదవీ కాలమ్లో ఆమె తన సహచరులతోకలసి కింగ్ జార్జ్ మెడికల్ కాలీజీలో వైరాలజీ విభాగాన్ని ప్రారంభించారు. 1971 లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఫెలో అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె రెస్పిరేటరీ వైరస్ ను సాధారణ శీతల యూనిట్ లో కనుగొనుటకు గాను పొందారు. ఈమె ఇంగ్లాండులో సాలిస్‌బర్రీలో ప్రముఖ వైరాలజిస్టులు డా.డి.ఎ.జె. టైరెల్ల్, సర్ జాన్ ఆండ్రూస్ తోకలసి పరిశోధనలు చేశారు.

కెరీర్

ఆషా అమథుర్ 1965 లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని ఆగ్రా మెడికల్ కాలేజి నుండి పొందరు. 1966 లో డిప్లొమా ఇన్ క్లినికల్ పాథాలజీ, 1969 లో ఎమ్‌.డి డిగ్రీని పాథాలజీ, బాక్టీరియాలజీలో కింగ్ జార్జి మెడికల్ కాలేజీ, లక్నో నుండి పొందారు. అదే సంవత్సరం వైరాలజీ విభాగంలో లెక్చరర్ గా చేరారు. 1970 లో పూణే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వైరాలజీలో సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందారు.ఈమె ఇంగ్లాండులో సాలిస్‌బర్రీలో ప్రముఖ వైరాలజిస్టులు డా.డి.ఎ.జె. టైరెల్ల్, సర్ జాన్ ఆండ్రూస్ తోకలసి పరిశోధనలు చేసి రెస్పిరేటరీ వైరస్ పై చేసిన కృషికి గాను సాలిస్ బర్రీ, యుకెలో 1971 లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఫెలో అవార్డును పొందారు. 1985 లో యు.కె లోని న్యూ కాసిల్ అపాన్, తైనీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. అచట వేగంగా వైరస్ను నిర్థారన చేసే సాంకేతిక విధానాలను కనుగొన్నారు. తర్వాత 1998 లో భారత దేశానికి వచ్చి KGMCలో వైరాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1998-2000 మధ్య వైరాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా కొనసాగారు. 2003 లో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు గౌరవ శాస్త్రవేత్తగా యున్నారు. ప్రస్తుతం ఆమె లక్నో లోని సరస్వతి డెంటల్ కాలేజీలో పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాలకు అధిపతిగా యున్నారు.

పరిశోధనలు

డాక్టర్ మాథుర్ KGMC, లక్నో వద్ద శ్వాస వైరస్ల పరిశోధన కార్యక్రమాలు ప్రారంభించారు.ఆమె శ్వాస వైరస్లు, జపనీస్ మెదడువాపు వ్యాధి, పుట్టుకతో వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్లు, పోలియో వ్యాధి, కండ్ల కలక, AIDS వంటి వైరల్ వ్యాధులు, కు విస్తారమైన పరీక్షా, పరిశోధనాత్మక సహాయాన్ని ఆమె ప్రయోగశాలలో అజేయ చేయగలిగింది. ఆమె హోస్ట్ రోగనిరోధక ప్రతిస్పందనను, వైరస్ నిలకడ, జాప్యం, మానవులలో అలాగే ప్రయోగాత్మక మౌస్ మోడల్ వైరస్ ట్రాన్స్ ప్లాసెంటల్ ప్రసార వంటి జపనీస్ ఎన్సెఫాలిటీస్ వంటి వివిధ అంశాల పై విలక్షణమైన సేవలందించారు. డాక్టర్ మాథుర్ రోగులలో జపనీస్ మెదడువాపు వ్యాధి వైరస్ (JEV) సంక్రమణ వేగంగా నిర్ధారణకు immunofluoroscence టెక్నిక్ ను మొట్టమొదట అభివృద్ధి చేశాయి. ఆమె JEV యొక్క సైటోకైన్ ఆధారిత పాథోజెనెసిస్ పై ప్రధాన సహకారం అందించారు.ఆమె JE (JEV-Chex).ను నిర్ధారణ చేయుటకు IgM కనుగొనే ఎలిసా కిట్ అభివృద్ధికి సహాయపడ్డారు.ఆమె 170 పరిశోధన కథనాలు ప్రచురించింది, 15 PhD, కంటే ఎక్కువ 35 MD విద్యార్థులు గురించి సలహాదారుగా ఉంది.

ప్రొఫెసర్ మాథుర్ UPలో AIDS నిఘా కేంద్రం ప్రారంభించింది. ఆమె సరస్వతి డెంటల్ కాలేజ్, లక్నోలో జనరల్ పాథాలజీ, సూక్ష్మజీవశాస్త్రం యొక్క విభాగం ఏర్పాటు, అనేక దంత రుగ్మతలకు పరిశోధనా అభివృద్ధి చేసింది. ఆమె సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, న్యూ ఢిల్లీ (1999-2002) లో సభ్యులుగా ఉన్నారు, అంతర్జాతీయ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రొఫెషనల్ అండ్ బిజినెస్ మహిళల అడ్వయిజరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు.

అవార్డులు

  • 1999 : మొదటి సీనియర్ నేషనల్ వుమెన్ బయో-సైంటిష్ట్ అవార్డును DBT ద్వారా అందుకున్నారు.
  • 1994 : డా. ఓం ప్రకాష్ భాసిన్ అవార్డు.
  • 1989 : అలహాబాదు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఫెలోషిప్
  • 1992 : నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క ఫెలోషిప్
  • 1993 : ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు యొక్క ఫెలోషిప్.
  • 2001 : అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫర్ ద డెవెలపింగ్ వరల్డ్, ఇటలీ యొక్క ఫెలోషిప్.

సూచికలు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.

యితర లింకులు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Asha Mathur is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Asha Mathur
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes