Appaji Ambarisha Darbha
Quick Facts
Biography
అప్పాజీ అంబరీష దర్భా సృజనాత్మక డిజిటల్ మీడియా నిపుణుడు, సినిమా నటుడు. తెలుగు యూనికోడ్ ఫాంట్స్ రూపకర్త.
జననం - విద్యాభ్యాసం
అప్పాజీ 1965, మార్చి 1న రాంషా, శిరీష దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట లో జన్మించాడు. సామర్లకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (1980-1982), కాకినాడలోని పిఆర్ డిగ్రీ కళాశాలలో బిఏ (1982-1985) చదివాడు.
వృత్తి జీవితం
అప్పాజీ అంబరీష తనకున్న అభిరుచితో ప్రకటనలు, డిజిటల్ మాధ్యమరంగంలోకి ప్రవేశించి, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలపై పనిచేశాడు. 2004 నుండి 2014 వరకు వివిధ అడ్వర్టైజ్మెంట్ కంపనీలలో క్రియేటివ్ డైరెక్టర్ గా, బ్రాండ్ స్ట్రాటజీ మేనేజర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించాడు.
డిజిటల్ తెలుగు అభివృద్ధికి కృషి
కంప్యూటర్ ప్రవేశించిన తొలినాళ్ళలోనే తెలుగు ఫాంట్స్ అభివృద్ధి చేయాలనుకున్న అంబరీష ఈజీఫాంట్స్ పేరుతో కొన్ని ఫాంట్స్ అభివృద్ధి చేశాడు. సాఫ్ట్‌వేర్‌తో అనుకూలమైన వివిధ డిజైన్లను,గూగుల్ కోసం ప్రత్యేకంగా తెలుగు, కన్నడ భాషలో యూనికోడ్ ఫాంట్‌లను తయారుచేశాడు. అనేక ప్రచురణకర్తలకు, సంస్థలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు యూనికోడ్ ఫాంట్లను రూపొందించాడు. 2011, ఆగస్టు 15న విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో రమణీయ ఫాంట్స్ పేరుతో ఒక ఫాంట్ విడుదల చేశాడు. రమణీయ, పొన్నాల, రవిప్రకాశ్, లకిరెడ్డి, చతుర, పెద్దన, తిమ్మన, రామరాజ, తెనాలిరామకృష్ణ, తానా మొదలైన ఫాంట్లు రూపొందించాడు.
నటనారంగం
2011లో ప్రియా ఫుడ్స్-స్నాక్ మ్యాజిక్ వాణిజ్య ప్రకటనలో తొలిసారిగా కథానాయకుడి తండ్రిగా నటించాడు. ఆ తరువాత అప్పారావు గారి అబ్బాయి అనే షార్ట్ ఫిల్మ్ లో అప్పారావు పాత్రతో షార్ట్ ఫిలింరంగంలోకి, తథాగత గౌతమ బుద్ధ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.
సినిమాలు
అప్పాజీ అంబరీష నటించిన సినిమాలు
- శ్రీమంతుడు (2015)
- కిక్ 2 (2015)
- అప్పట్లో ఒకడుండేవాడు (2016)
- మెంటల్ మదిలో (2017)
- జవాన్ (2017)
- ఇదం జగత్ (2018)
- శుభలేఖ+లు (2018)
- మను (2018)
- పడి పడి లేచే మనసు (2018)
- హుషారు (2018)
- విశ్వాసం (2019)
- నిన్ను తలచి (2019)
- గద్దలకొండ గణేష్ (2019)
- ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019)
- ఇద్దరి లోకం ఒకటే (2019)
- 47 డేస్ (2020)
- మధా (2020)
- భీష్మ (2020)
- డర్టీ హరి (2020)
- సుందరి (2021)
- వర్మ.. వీడు తేడా (2021)
- ఓ సాథియా (2023)