peoplepill id: amruthavarshini
A
India
1 views today
6 views this week
Amruthavarshini
Telugu Theatre, TV, Film Actress

Amruthavarshini

The basics

Quick Facts

Intro
Telugu Theatre, TV, Film Actress
Places
Gender
Female
Birth
Place of birth
Vijayawada, Vijayawada (urban) mandal, Krishna district, India
Age
37 years
The details (from wikipedia)

Biography

అమృతవర్షిణి, ప్రముఖ రంగస్థల, టివీ, సినిమా నటీమణి. 2016 నంది నాటకోత్సవం లో యాది నాటికలోని నటనకుగానూ ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకుంది. 2022లో వచ్చిన అలిపిరికి అల్లంత దూరంలో అనే సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం - విద్యాభ్యాసం

అమృతవర్షిణి 1984, అక్టోబరు 8న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించింది. ఈమె ప్రముఖ రంగస్థల నటి బుర్రా విజయదుర్గ కూతురు.ఈమె అర్థశాస్త్రంలో ఎం.ఎ. చదివి,మానవ వనరుల శాస్త్రంలో ఎం.బి.ఏ. పూర్తి చేసింది.

రంగస్థల ప్రస్థానం

2014 ఆగస్టులో 'కలహాల కాపురం' నాటికతో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 700 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొంది.అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో బి గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది.

నటించినవి

  • నాటకాలు: బ్రతకనివ్వడండి, మదర్ థెరీసా, బృందావనం, ఇంటింటి కథ, లావాలో ఎర్రగులాబి, నేటిగాంధి, మనోనయనం, కలిసుంటాం అంతే,యధాప్రజా తథారాజా మొదలైన సాంఘిక నాటకాలు... భక్త కన్నప్ప, పాండవుద్యోగం, సత్యహరిశ్చంద్ర, ఝాన్సీ లక్ష్మీబాయి, బాలనాగమ్మ, చింతామణి మొదలైన పౌరాణిక నాటకాలు
  • నాటికలు: యాది, గోవు మాలచ్చిమి, అక్షయ, మరో దేవాలయం, సౌందర్య భారతం, నిశబ్ద సంకేతం. శిక్ష, బంగారం, భలే వాళ్లే వీళ్లు, అమృతవర్షిణి, యయాతి, కలహాల కాపురం, పెళ్ళి చేసి చూడు, ఆఖరి ఉత్తరం, ఆశ్రయం, నేటి న్యాయం, పల్లె పడుచు, పంజరంలో పక్షులు, ఒక్కమాటేచాలు, సముద్రమంత సంతోషం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, వామ్మో గుత్తొంకాయ్‌, నాలుగోవ సమస్య, త్రిజుడు, ఊ అంటావా ఉహూ అంటావా, అగ్నిసాక్షి

దర్శకత్వం

  • నాన్నా నేనొచ్చేస్తా

బహుమతులు

* నంది బహుమతులు:
ఉత్తమ నటి - యాది, నంది నాటక పరిషత్తు - 2016

* గరుడ బహుమతులు:

  • ఉత్తమ నటి - సౌందర్య భారతం, 2015
  • ఉత్తమ నటి - యాది, 2016
  • ఉత్తమ ద్వితీయ నటి - యయాతి (పౌరాణికం), 2016

* ఇతర బహుమతులు:

  1. ఉత్తమనటి - అక్షయ (నాటిక), 2015 (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015)
  2. ఉత్తమనటి - మరోదేవాలయం (2015), యాది (2016), గోవు మాలచ్చి (2017) (అప్పాజోశ్యుల విష్ణుంభోట్ల కుందాళం కళాపరిషత్తు, చిలకలూరిపేట)
  3. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2016, హైదరాబాద్)
  4. ఉత్తమనటి - యాది (నాటిక), 9-11 ఏప్రిల్ 2016 (అభినయ నాటక పరిషత్, పొనుగుపాడు)
  5. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (ప్రగతి కళామండలి, సత్తెనపల్లి)
  6. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (శార్వాణి, చైతన్య యువజన సంఘం, బి.గొనపపుట్టుగ, శ్రీకాకుళం జిల్లా)
  7. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (రంగస్థలి, నరసరావుపేట, గుంటూరు జిల్లా)
  8. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (తాడేపల్లిగూడెం ఉగాది నాటక పోటీలు)
  9. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (పొన్నూరు కళాపరిషత్, పొన్నూరు. 18వ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు)
  10. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్, కాకినాడ. 19వ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు, జూలై 4-6, 2017)
  11. ప్రత్యేక బహుమతి - నాలుగోవ సమస్య (నాటిక) (అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)
  12. ఉత్తమనటి - అనుబంధం (నాటిక), 2019 (అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2019, గుంటూరు)
  13. ఉత్తమ నటి - నాన్నా నేనొచ్చేస్తా (నాటిక) (2024 జనవరి 16-18, భోగాపురం కళాపరిషత్‌, భోగాపురం, కాకినాడ జిల్లా)

పురస్కారాలు

  1. మహానటి సావిత్రి పురస్కారం - 2018 2018 ఏప్రిల్ 18 కళారంజని నాటక అకాడమీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

సినిమారంగం

  1. అలిపిరికి అల్లంత దూరంలో (2022)

సామాజిక సేవ

కోవిడ్ -19 సమయంలో నాటకరంగ కళాకారులు పడిన కష్టాలను చూసి చలించిన అమృతవర్షిణి, సంవత్సరానికి కనీసం ఒకరు లేదా ఇద్దరు కళాకారులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ సంకల్పంతో తన సోదరి లహరి గుడివాడతో కలిసి అమృతలహరి ఆర్ట్స్ అనే ఒక కళా సంస్థను స్థాపించింది. ఆ సంస్థ ద్వారా నాటకాలను ప్రదర్శించడంతోపాటు కొంతమంది మహిళలతో కలిసి ఊరగాయల తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. అలా తయారుచేసిన వాటిని నాటక పోటీలు నిర్వహించే ప్రదేశాల్లో స్టాల్ పెట్టి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలతో నిరుపేద కళాకారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది.

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

The contents of this page are sourced from Wikipedia article. The contents are available under the CC BY-SA 4.0 license.
Lists
Amruthavarshini is in following lists
comments so far.
Comments
From our partners
Sponsored
Credits
References and sources
Amruthavarshini
arrow-left arrow-right instagram whatsapp myspace quora soundcloud spotify tumblr vk website youtube pandora tunein iheart itunes