Yoga guru Swami Sivananda

Indian yoga teacher
The basics

Quick Facts

IntroIndian yoga teacher
PlacesIndia
isYogi
Work fieldReligion
Gender
Male
Birth8 August 1896, British Raj, British Empire
Star signLeo
Awards
Padma Shri in other fields2022
The details

Biography

బాబా శివానంద్​జీ భారతదేశానికి చెందిన యోగ గురువు. ఆయన 2022లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. శివానంద దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కాడు .

జీవిత చరిత్ర

శివానంద 1896 ఆగస్టు 8న నేటి బంగ్లాదేశ్‌లోని సిల్హేట్‌ జిల్లాలో జన్మించాడు. ఆయన ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడిని గురు ఓంకారానంద గోస్వామి పెంచాడు. శివానంద్ దాదాపు మూడు దశాబ్దాలపాటు గంగానది ఒడ్డున యోగా శిక్షణను ఇచ్చాడు. ఆయన వారణాసి, పూరి, హరిద్వార్‌, నవద్వీప్‌ కేంద్రాలుగా దాదాపు 50 సంవత్సరాలకు పైగా 400 - 600 మంది వరకు కుష్టి రోగులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాడు.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న శివానంద్ (21.03.2022)

దినచర్య

స్వామి శివానంద రోజూ మూడు గంటలకే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని అరగంటపాటు యోగా చేసి తరువాత స్నానం పూర్తి చేసుకొని పూజ చేస్తాడు. ఆ తర్వాత అతడి వద్దకు వచ్చేవారితో మాట్లాడి వారికీ యోగా చేయడం ద్వారా వచ్చే ప్రయోజాలను వివరించి యోగా సాధన చేసేలా వారిని ప్రోత్సహిస్తాడు. ఆయన ఉదయం గోరువెచ్చని నీరు, రెండు రొట్టెలు, ఒక కాయగూర అల్పాహారంగా తీసుకుంటాడు. సాయంత్రం ఉడకబెట్టిన పదార్థాలను ఆహారంగా తీసుకొని రాత్రి 8 గంటలకల్లా నిద్ర పోతాడు.

పురస్కారాలు

  • 2019లో ‘యోగా రత్న’ పురస్కారం
  • 2019లో బసుంధర రతన్ అవార్డు
  • స్వామి శివానంద 125 ఏళ్ల వయసులో యోగా శిక్షణకు మరియు ఆయన కుష్ఠు రోగులకు చేసిన సేవలకు గాను 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించగా ఆయన 2022 మార్చి 21న పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 22 Dec 2023. The contents are available under the CC BY-SA 4.0 license.