Yennengee

���ెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా రచయిత,దర్శకుడు, నటుడు.
The basics

Quick Facts

Intro���ెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా రచయిత,దర్శకుడు, నటుడు.
PlacesIndia
isActor
Work fieldFilm, TV, Stage & Radio
Gender
Male
Birth3 April 1982, Hasanpalle, Nizamsagar mandal, Kamareddy district, India
Age42 years
Star signAries
The details

Biography

యెన్నెన్జీ (నరేందర్ గౌడ్ నాగులూరి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో దర్శకత్వం వహించిన ‘యాది’ , ‘రాజిగ ఓరి రాజిగా’ అనే లఘు చిత్రాలు అతడికి మంచి గుర్తింపును తెచ్చాయి. 2021లో వచ్చిన మెయిల్‌ సినిమాలో కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ పాత్రలో నటించాడు.

జననం, విద్యాభాస్యం

నరేందర్ 4 మార్చి 1982న తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలం, హసన్‌పల్లిలో సాయాగౌడ్, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. అతను పదవ తరగతి వరకు పోచంపాడ్ గురుకులం లో, బోధన్ లో ఇంటర్‌మీడియెట్‌ చదివాడు. హైదరాబాద్‌ లోని అపోలో హాస్పిటల్‌లో డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడు.

సినీ జీవితం

బాబూమోహన్ తో నరేందర్

నరేందర్ గౌడ్ 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ వచ్చి కొంతకాలం పెయింటర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే బాబు మోహన్ ద్వారా ఇ.వి.వి.సత్యనారాయణతో అతడికి పరిచయం ఏర్పడింది. నరేందర్ గౌడ్ 2008లో తూర్పు పడమర సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన తరువాత అతడు పలు డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిలిమ్స్‌కు అసిస్టెంట్‌గా పనిచేశాడు. నరేందర్ తెలంగాణ ఉద్యమం సమయంలో 2013లో ‘యాది’ , ‘రాజిగ ఓరి రాజిగా’ లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు లఘు చిత్రాలకు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కోయలపై 'ఆర్ట్ ఎట్ హార్ట్' డాక్యుమెంటరీ తీసే అవకాశం కల్పించాడు. నరేందర్ ఆ తరువాత భాషా సాంస్కృతిక శాఖ తరపున పేరిణీ నృత్యంపై డాక్యుమెంటరీ చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రవీంద్రభారతి తెలంగాణ కళాకారులకు అడ్డాగా మారడంతో తెలంగాణ అవతరణ ఫిల్మోత్సవం, బతుకమ్మ ఫిల్మోత్సవం, సినివారం, సండే సినిమా, ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్, మాస్టర్ యువర్ క్రాఫ్ట్, యువ చిత్రోత్సవం వంటి కార్యక్రమాల రూపకల్పనలో భాగ్యస్వామి అయ్యాడు.

ఆయన 2017లో దర్శకుడిగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా హృదయాంజలి సినిమా ప్రారంభించాడు, కానీ కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది. యెన్నెన్జీ 2021లో ఆహాలో విడుదలైన మెయిల్‌ సినిమాలో కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్ పాత్రలో నటించి ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలకు రచనా సహకారం అందిస్తున్నాడు.

దర్శకత్వం వహించిన లఘు చిత్రాలు

సంవత్సరంషార్ట్ ఫిలిమ్స్లఘు చిత్రం/డాక్యుమెంటరీభాష
2013యాదిలఘు చిత్రంతెలుగు
2015రేసులఘు చిత్రంతెలుగు
2016ఆర్ట్ ఎట్ హార్ట్డాక్యుమెంటరీఇంగ్లీష్
2017రాజిగ ఓరి రాజిగాలఘు చిత్రంతెలుగు
2017ఉత్తచేతుల బిక్షపతిలఘు చిత్రంతెలుగు

నటించిన చిత్రాలు

సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుభాషఇతర విషయాలు
2021మెయిల్‌కంప్యూటర్ వైరస్ మెకానిక్ షకీల్తెలుగు*"మెయిల్‌ సినిమాలో యెన్నెన్జీ నటించిన సన్నివేశం".
2021అఖండగ్రామస్తుడుతెలుగు
2022కిరోసిన్చంటితెలుగు
2022పంచతంత్ర కథలుగ్రామస్తుడుతెలుగు
2023రాక్షస కావ్యండిస్ట్రిబ్యూటర్తెలుగు
2023భరతనాట్యంపాతబస్తీ వాసితెలుగు
2023టిల్లు స్క్వేర్తౌఫీక్తెలుగు
2023హాంగ్ మాన్ఉరి తీయబడిన ఖైదీతెలుగు
2023టీచర్సైకాలజిస్ట్తెలుగు
2024సిట్రూర్ డేస్పులితెలుగు/తమిళ్వెబ్ సిరీస్

మూలాలు

బయటి లింకులు

The contents of this page are sourced from Wikipedia article on 02 Nov 2023. The contents are available under the CC BY-SA 4.0 license.