Vanibala
Telugu Theatre Actress
వాణిబాల (మ. మే 27, 2015) ప్రముఖ రంగస్థల నటీమణి. నంది అవార్డు గ్రహీత.
వాణిబాల పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం గ్రామంలో జన్మించింది.
తల్లిదండ్రులు కళాకారులు కానప్పటికీ నటనపై ఆసక్తితో తన ఏడోఏటే నటిగా రంగస్థల ప్రవేశం చేసిన వాణిబాల దాదాపు వెయ్యికిపైగా ప్రదర్శనలో పాల్గొన్నది.
2015లో రాజమండ్రి జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో పాల్గొని తిరిగి సొంతూరు కొయ్యలగూడెం వస్తూ వడదెబ్బకు గురైన వాణిబాల, స్థానిక ఆసుప్రతిలో చికిత్స పొందుతూ 2015, మే 27 బుధవారం రాత్రి ఆమె మరణించారు.