Vangari Narsaiah

People from Telangana State
The basics

Quick Facts

IntroPeople from Telangana State
PlacesIndia
was
Gender
Male
Birth1920, Telangana, India
Death6 January 2022Telangana, India (aged 102 years)
The details

Biography

వంగరి నర్సయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు. శతాధిక వృద్ధుడిగా గుర్తింపు పొందిన నర్సయ్య, సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా 20 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు.

జననం

నర్సయ్య 1920లో తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జన్మించాడు. తండ్రిపేరు లక్ష్మయ్య.

వ్యక్తిగత జీవితం

నర్సయ్యకు నర్సవ్వతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కొడుకులు (దేవదాస్, శ్రీనివాస్, అంబదాస్), నలుగురు కుమార్తెలు ఉన్నారు.

సామాజిక సేవ

నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ముంబై, సోలాపూర్ ప్రాంతాలలో పద్మశాలి సంఘాలు స్థాపించి, కార్మికుల సమస్యలపై పోరాటం చేశాడు. కేసీఆర్‌ 2008లో సిరిసిల్ల నేతకార్మికుల సంక్షేమం కోసం రూ.50లక్షల నిధిని సమకూర్చి, ఆ నిధిని పేదలకు అందించే బాధ్యతను పద్మశాలి సంక్షేమ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా వంగరి నర్సయ్యకు అప్పగించాడు. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించిన నర్సయ్య, పేదలకు వడ్డీ లేని రుణాలు అందించి ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపించాడు. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి కళ్యాణ భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు.

రాజకీయ జీవితం

2009, ఏప్రిల్ 16న జరిగిన ఉమ్మడి అంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసిన నర్సయ్య 1,490 ఓట్లతో పదవ స్థానంలో నిలిచాడు.

మరణం

102 సంవత్సరాలు జీవించిన నర్సయ్య 2022, జనవరి 6న సిరిసిల్ల పట్టణంలో మరణించాడు.

మూలాలు

  1. "స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్లను సన్మానించాలి". andhrajyothy. 2021-08-15. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
  2. "పోరాట యోధుడు వంగరి నర్సయ్య కన్నుమూత". Sakshi. 2022-01-07. Archived from the original on 2022-01-07. Retrieved 2022-01-09.
  3. "Vangari Narsaiah" (PDF). www.ceotelangana.nic.in. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
  4. "Vangari Narsaiah(Independent(IND)):Constituency- SIRCILLA(KARIMNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2013-10-07. Retrieved 2022-01-09.
  5. "IndiaVotes AC: Sircilla 2009". IndiaVotes. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
The contents of this page are sourced from Wikipedia article on 12 Dec 2023. The contents are available under the CC BY-SA 4.0 license.