Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Telugu writer |
is | Writer |
Work field | Literature |
Biography
వడ్డేపల్లి కృష్ణ కవి, సినీగేయ రచయిత, లలితగీతాల రచయిత. 1969లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరుకాయలు, సంక్రాంతిలక్ష్మి అనే కథలు వ్రాశాడు. లావణ్య విత్ లవ్ బాయ్స్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.
జీవిత విశేషాలు
ఇతడు కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల గ్రామంలో చేనేత వృత్తిగా కలిగిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు లక్ష్మమ్మ, లింగయ్య. ఇతనికి బాల్యం నుండే సాహిత్యం పట్ల ఎక్కువ అభిరుచి కలిగింది.
పాటల ప్రస్థానం
సాహిత్యం, పద్యాలపై మంచి పట్టు ఉండడంతో ఇతడు సినిమాలపై దృష్టి సారించాడు. ఇతడి పాటలున్న సినిమాలు కొన్ని:
- పిల్లజమీందార్ - నీచూపులోన.. విరజాజివాన
- అమృతకలశం - సిగ్గాయే సిగ్గాయేరా స్వామీ బుగ్గంతా ఎరుపాయేరా మానసచోరా నిను చేర
- యుగకర్తలు - తాగినోడి మాట..తందనాల వేదమట. న్యాయమున్నా.. ధర్మమున్నా..నరకమున్నా.. బతుకు బాట
- పెద్దరికం - ముద్దుల జానకీ..పెళ్లికీ.. మబ్బుల పల్లకీ తెవలనే, ఆశల రెక్కల హంసలు పల్లకీ మోసుకుపోవలనే
- భైరవద్వీపం - అంబా శాంభవి భధ్రరాజ గమన కాళీ
- పిలిస్తే పలుకుతా - సమత మమతల సాకారాం.. పిలిచిన పలికే ఓంకారం
ఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. ఇతడు వెయ్యికి పైగా రచించిన లలితగీతాలలో కొన్ని:
గీతం | సంగీతం | గానం | ఇతర వివరాలు |
---|---|---|---|
జాతిపితా! ఓ జగతి హితా | |||
జాతిని జాగృతము చేయు | |||
వచ్చెనూ వాసంత లక్ష్మీ! | |||
అంతులేని ఆశలున్న అంతరంగమా | మహాభాష్యం చిత్తరంజన్ | ||
జగతిరథం జైకొడుతూ | మహాభాష్యం చిత్తరంజన్ | ||
వెన్నెలంత చల్లనిదీ స్నేహము | మహాభాష్యం చిత్తరంజన్ | ||
మళ్ళీ జన్మించు ప్రభూ | మహాభాష్యం చిత్తరంజన్ | మానాప్రగడ నరసింహమూర్తి | |
మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలి | మహాభాష్యం చిత్తరంజన్ | ||
అమృతరూపమే తల్లిరా | సి.ఇందిరామణి | ||
మనిషి జీవమొక గీతి | సి.ఇందిరామణి | ||
సాయి సాయి ఒం సాయి | సి.ఇందిరామణి | ||
వెన్నెలంత చల్లనిదీ స్నేహం | నల్లూరి సుధీర్ కుమార్ |
దర్శకత్వం
ఇతడు సినిమాలపై మోజుతో ఎక్కడికెళ్తుందో మనస్సు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించాడు. అంతరించి పోతున్న గోవులపై గోభాగ్యం అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతులు గెలుచుకుంది. బతుకమ్మ, ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు. టెలివిజన్‌లో భక్త కవి పోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు వంటి సీరియల్స్‌ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
బహుముఖ ప్రతిభ
ఇతడు కరీంనగర్ క్షేత్రాలు అనే ఆడియో సీడీ తీసుకువచ్చాడు. తానా సభలకు సంగీత నృత్యరూపకాలు అందించాడు. లలితగీతం, లక్షణం, నిర్వచనం నిర్దేశిస్తూ లలిత గీతాలపై మొట్టమొదటిసారిగా ప్రామాణిక పరిశోధన చేశాడు. తెలంగాణపై అభిమానంతో తెలంగాణ భాష, యాసతో వెలుగచ్చింది నాటకాన్ని వ్రాశాడు. జయజయహే తెలంగాణ సంగీత నృత్యరూపకం రచించాడు. రచయితగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా, పాడుతాతీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందాడు.
గ్రంథాలు
- పాటవెలదులు (నవీనపద్యాలు)
- చిరుగజ్జెలు
- తెలుగులో లలిత గీతాలు (పి.హెచ్.డి పరిశోధనా గ్రంథం)
- కనరా నీ దేశం
- రాగరథం
- వడ్డెపల్లి గేయవల్లి
- మబ్బుల పల్లకి
- అంతర్మథనం
- వెలుగుమేడ
- వసంతోదయం
బిరుదులు
- గేయకిరీటి
- లలితశ్రీ
- కవనప్రజ్ఞ