Rayadappa Ranga Rao

Rajah of Bobbili
The basics

Quick Facts

IntroRajah of Bobbili
PlacesIndia
wasKing Poet
Work fieldLiterature Military Royals
Gender
Male
Birth4 January 1790
Death17 January 1830 (aged 40 years)
Star signCapricorn
The details

Biography

రాజా రాయడప్ప రంగారావు (జ: 4 జనవరి 1790 - మ: 17 జనవరి 1830) బొబ్బిలి సంస్థానాధీశులు, కవులు, సాహిత్య పోషకులు. వీరు 1802 నుండి 1830 వరకు రాజ్యాన్ని పాలించారు.

బొబ్బిలి చిన రంగారావుకు సంతానం లేకపోవడం వలన పాల్తేరు వాస్తవ్యుడు సుబ్బమాంబ మరియు అన్నారావుల పుత్రుడైన రాయడప్ప రంగారావును దత్తత తీసుకున్నారు. వీరు కందాళ వేంకటార్యుని శిష్యుడు.

వీరి ఆస్థానంలో ఇనుగంటి సీతారామస్వామిని దివానుగా వున్నట్లు అతని సహాయంతోనే సంస్థానంలో జరిగే ధర్మశాస్త్రానువాద రచనలు పూనుకున్నట్లు తెలిపారు.

వీరు "సంకల్ప సూర్యోదయం" అనే వేదాంత నాటకాన్ని రచించారు. దీనికి మూలం సంస్కృతం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బోధించే రచన. దీనిని వేదాంతదేశికులు రచించారు. పంచవిధ శారీరక శాస్త్రార్థం ఇందులో వర్ణించారు. తెలుగు ప్రబంధరూపంలోకి రాజావారు గద్యపద్య మిళితంగా 10 అధ్యాయాలతో తెలుగుచేశారు. ఈగ్రంథ రచనలో రాజావారికి గరిమెళ్ల సుబ్బాయ్య అనే కవి సహాయం చేశారు.

కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి వీరి ఆస్థాన విద్వాంసుడు. వీరు మేఘసందేశము, దిలీపచరిత్ర మనే కావ్యాలను రచించినట్లుగా, శ్వేతాచల మాహాత్మ్యం కావ్యాన్ని రచించి రాయడప్ప రంగారావు గారికే అంకితమిచ్చాడు.

వీరు చాలా చెరువులను తవ్వించినట్లుగా పేర్కొన్నారు; వానిలో రంగరాయ సాగరం అతిపెద్దది. బొబ్బిలి పట్టణంలో ప్రస్తుతం ప్రసిద్ధిచెందిన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం వీరి ద్వారా ప్రారంభించబడినది. దురదృష్టవశాత్తు దేవాలయ నిర్మాణం ఫూర్తికాకమునుపే వీరు పరమపదించారు.

కుటుంబం

రాయడప్ప రంగారావుకు ముగ్గురు భార్యలు, ఇద్దరిని ఒక విచిత్రమైన పరిస్థితులలో ఒకేసారి వివాహం చేసుకున్నారు. మొదటి భార్య సీతానగరానికి చెందిన చెలికాని వారి ఆడపడుచుకాగా రెండవకన్య తెర్లాం ఇనుగంటి కుటుంబానికి చెందినది. వీరిలో మొదటి భార్య చెల్లాయమ్మ గారు నలుగురు కుమారులు మరియు ఐదుగురు కుమార్తెలను అందించగా; రెండవభార్య బుచ్చియమ్మ ద్వారా ఒక్క అమ్మాయిని పొందారు. చాలా సంవత్సరాల సుఖసంసారం అనంతరం రెండవభార్య మరణించిన పిదప రాజావారు వావిలవలస ఇనుగంటి కుటుంబానికి చెందిన లక్ష్మీనరసాయమ్మను వివాహం చేసుకున్నారు. రంగారావుగారు జనవరి 17, 1830 తేదీన పరమపదించారు; వీరి కుమారులు రాజా శ్వేతాచలపతి రంగారావు, రాజా జనార్దన రంగారావు, రాజా సీతారామచంద్ర రంగారావు మరియు రాజా వేంకట రంగారావు.

మూలాలు

  1. Venkata Svetachalapati Rangarao (1907). " Chapter_8".  https://en.wikisource.org/wiki/A_Revised_and_Enlarged_Account_of_the_Bobbili_Zemindari. Addison & co.. వికీసోర్స్. 
  • బొబ్బిలి సంస్థాన చరిత్ర - సాహిత్య పోషణ (2002), బోనాల సరళ, పేజీ. 120-127.
The contents of this page are sourced from Wikipedia article on 07 Oct 2023. The contents are available under the CC BY-SA 4.0 license.