Ravula Pullachari

Poet, Writer
The basics

Quick Facts

IntroPoet, Writer
PlacesIndia
isWriter Poet
Work fieldLiterature
Birth1950, Huzurabad, Karimnagar district, Andhra Pradesh, India
Age75 years
The details

Biography

రావుల పుల్లాచారి (జ. మే 10, 1950) కవి, కథా, నాటక రచయిత. నంది నాటక పరిషత్తు - 2016 లో రచ్చబండ నాటికకు ఉత్తమ ద్వితీయ రచయితగా నంది అవార్డు అందుకున్నాడు.

జననం

పుల్లాచారి 1950, మే 10న ధశరధం, ఈశ్వరమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ లో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం

హుజూరాబాద్, హన్మకొండ లలో పాఠశాల విద్యను చదివిన పుల్లాచారి, జమ్మికుంట ఆదర్శ కళాశాలలో బి.కాం. పూర్తిచేశాడు. హన్మకొండలోని ఇరిగేషన్ డిపార్టుమెంటులో సూపరిండెంట్ గా పనిచేసి 2008, మే 31న పదవి విరమణ చేశాడు.


రచనా ప్రస్థానం

పుల్లాచారి రాసిన కథలు, కవితలు, వ్యాసాలు వివిధ దిన వార పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

కథలు

  1. అమ్మెరు
  2. చెల్లని పైసలు
  3. గచ్చుపూత
  4. సర్కస్
  5. రచ్చబండ
  6. భల్లూక బంధం
  7. ద బిస్సి
  8. భాగస్వామ్యం
  9. ఆట
  10. బెత్తెడు జాగ
  11. బరువు
  12. అంబుధి
  13. బంధం
  14. రిక్షాతాత
  15. కొ..క్క..రో..కో..
  16. కొలిమి చల్లారింది
  17. ఖరామృతము
  18. అదిగో పాము
  19. మనసు గదిలో
  20. బతుకమ్మ కానుక


నాటికలు

  1. బాకీపడ్డ బతుకులు
  2. పతనం దిక్కు పరుగు
  3. ఈ వేస్తున్న అడుగు ఎటు?
  4. శ్రామిక శకటం
  5. పోతే పోనియ్
  6. రచ్చబండ
  7. మనసు చెక్కిన శిల్పం
  8. గంగిగోవుపాలు
  9. పేతాత్మదిగిరా
  10. దేశం పోకడ చూడరబాబు

ప్రచురించిన పుస్తకాలు

  1. నాలోకి (ఆధ్యత్మిక వ్యాస సంపుటి)
  2. బెత్తెడు జాగ (కథా సంపుటి)

బహుమతులు - పురస్కారాలు

  1. ఉత్తమ ద్వితీయ రచయిత - రచ్చబండ (నంది నాటక పరిషత్తు - 2016)
  2. తుమ్మల రంగస్థల సాహితీ పురస్కారం, కరీంనగర్
  3. తెలుగు వెలుగు విశిష్ట సాహితీ పురస్కారం (2008-2009) తెలుగు భాషా సంరక్షణ సంఘం, జగిత్యాల.
  4. ఉత్తమ రచయిత (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా)
  5. ఉత్తమ నాటక రచయిత (తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారం-2018)
  6. పివి రమణ స్మారక పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, 2022 ఆగస్టు 17)

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 03 Jul 2024. The contents are available under the CC BY-SA 4.0 license.