Rajendra Bharadwaj

Indian screenwriter
The basics

Quick Facts

IntroIndian screenwriter
A.K.A.Kari Rajendra Kari.Rajendra
A.K.A.Kari Rajendra Kari.Rajendra
PlacesIndia
isScreenwriter Writer
Work fieldFilm, TV, Stage & Radio Literature
Gender
Male
Birth1976, Karuchola, Edlapadu mandal, Guntur district, India
Age49 years
The details

Biography

రాజేంద్ర భరద్వాజ్ సినీ మాటల రచయిత, కథారచయిత. ఇతని రచన ఆలోచనను రేకెత్తించే దృక్పథానికి, కుటుంబవిలువలకీ పెట్టింది పేరు. ఇతను 1999 లో శివరంజని తెలుగు సిని వారపత్రికలో పాత్రికేయ వృత్తిని ప్రారంబించి ఆతరువాత బైరవి సినిమా ద్వారా కధ, మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. కొత్తగా మా ప్రయాణం, కథనం వంటి తెలుగు సినిమాలకు, మాటలు, స్క్రీన్‌ప్లే, రచయితగా, కిలాడీ.నం.1, నాయక్ వంటి భోజ్‌పురి సినిమాలకు, కథ, స్క్రీన్‌ప్లే రచయితగా సినిమా రంగంలో పేరుపొందాడు.

మొదటి రోజులు

ఆంధ్రప్రదేశ్ లోని కారుచోల గ్రామంలో రాజేంద్ర భరద్వాజ్ 'కరి రాజేంద్రగా కరి శ్రీకృష్ణ మూర్తి సీతారత్నంలకు జన్మించాడు. మద్దిరాలలోని సాదీనేని చౌదరయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యునికేషన్ లో మాస్టర్ డిగ్రీ పొందాడు. శివరంజని తెలుగు సినిమా వారపత్రికలో ఇతడు పాత్రికేయునిగా తన వృత్తిని ప్రారంభించాడు. తదనంతరం, అమెరికాకు చెందిన తెలుగు ఛానల్ స్నేహ టీవీలోనూ, సివిఆర్ ఓం ఆధ్యాత్మిక ఛానెల్‌లో సీనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అన్నయ్యా రవిచంద్ర శేఖర్ ప్రోత్సాహంతో సిని రంగ ప్రవేశం చేసారు.

రచనా శైలి

సామజిక అంశాలను ప్రస్తావిస్తూ స్థానిక జీవన స్థితిగతులను కథల్లో ప్రతిభావంతంగా చూపుతూ జీవన వాస్తవికత నుంచి కథా వాస్తవికతలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళి ఆలోచింప చేసే శైలి, నేర్పు,అతని ప్రతి సినిమా కథలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సినిమాల జాబితా

Key
ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరంచిత్రంపేరుభాషనటీనటులువిభాగంNotesRef.
2008భైరవితెలుగుఅభినయశ్రీ , నందు, సైరాభానుకథ,మాటలు
2008ఖిలాడి నం.1భోజ్‌పురిదినేష్ లాల్ యాదవ్, పాకి హెగ్డే, రామిరెడ్డి (నటుడు), మనోజ్ టైగర్స్క్రీన్ ప్లే, కథ
2009ఘాయల్ కిలాడీహిందీదినేష్ లాల్ యాదవ్, పాఖీ హెగ్డే, ముక్తార్ ఖాన్, మనోజ్ టైగర్, రామిరెడ్డి (నటుడు), రఘునాథ రెడ్డికథ, స్క్రీన్ ప్లే
2014ఈ వర్షం సాక్షిగా (2014 సినిమా)తెలుగువరుణ్ సందేశ్, హరిప్రియ, చలపతి రావు,ఢిల్లీ రాజేశ్వరి, ధన్‌రాజ్స్క్రీన్ ప్లే
2015టాప్ రాంకర్స్తెలుగుగద్దె రాజేంద్ర ప్రసాద్, సోనీ చరిష్ట, గిరిబాబురచనాసహకారం
2015నువ్వు నేను ఒకటవుదాంతెలుగురంజిత్ సోమి, ఫాతిమా సనా షేక్కథ, మాటలు
2017సీతారాముల కళ్యాణం చూతము రారండి
సీతా రామంక బహఘర కలిజుగారే
తెలుగు

ఒడియా
సబ్యసాచి మిశ్రా, మనీషా చటర్జీ, సుమన్ తల్వార్, బిజయ్ మొహంతి, పాప్పు పోమ్ పోమ్, చలాకి చంటిమాటలుద్విభాషా చిత్రం
2019కసమ్ దుర్గా కిభోజపురిరాణి చటర్జీ, మనోజ్ ఆర్ పాండే, గుర్లిన్ చోప్రాకథ, స్క్రీన్ ప్లే
2019నాయక్భోజపురిప్రదీప్ పాండే, పావని, ప్రభాకర్, సంజయ్ మహానంద్కథ, స్క్రీన్ ప్లే

2019కొత్తగా మా ప్రయాణంతెలుగుప్రియాంత్, యామిని భాస్కర్, గిరిధర్, భానుస్క్రీన్ ప్లే, మాటలు

2019కథనం (2019 సినిమా)తెలుగుఅనసూయ భరధ్వాజ్, వెన్నెల కిషోర్ , అవసరాల శ్రీనివాస్, ధనరాజ్స్క్రీన్ ప్లే, మాటలు
2020ఆనంద భైరవితెలుగుఅంజలి, లక్ష్మీ రాయ్, అరుణ్ ఆదిత్య ,మురళి శర్మ , సాయికుమార్రచనాసహకారంTBA
2021ధర్మస్థలితెలుగుషకలక శంకర్, పావని, సాయాజీ షిండే, ముక్తార్ ఖాన్, మిర్చి హేమంత్కథ , మాటలు, స్క్రీన్ ప్లే
The contents of this page are sourced from Wikipedia article on 17 Nov 2024. The contents are available under the CC BY-SA 4.0 license.