R.Santa Sundari

Telugu writer, translator
The basics

Quick Facts

IntroTelugu writer, translator
wasTranslator
Gender
Female
Birth8 April 1947
Death11 November 2020 (aged 73 years)
Star signAries
Family
Father:Kodavatiganti Kutumbarao
The details

Biography

ఆర్.శాంత సుందరి నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రచనలో కృషి చేసిన రచయిత్రి. ఈమె తెలుగు- హిందీ భాషలలో పరస్పరం అనువదించింది. సుమారు 76 పుస్తకాలను ప్రచురించింది.

జీవిత విశేషాలు

ఆర్.శాంత సుందరి తండ్రి కొడవటిగంటి కుటుంబరావు పేరెన్నికగన్న రచయిత. ఈమె భర్త ఆర్.గణేశ్వరరావు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్యకుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఈమె అనేక దేశాలు పర్యటించింది. భర్త ఉద్యోగవిరమణ తర్వాత ఈమె హైదరాబాదులో స్థిరపడింది. ఈమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 2020, నవంబరు 11న తన 73వ యేట మరణించింది.

రచనలు

ఈమె కథ, కవిత్వం, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథ, వ్యక్తిత్వవికాసం వంటి అన్ని ప్రక్రియలలో అనువాదాలు చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈమె పరస్పరం అనువాదాలు చేసింది. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టును హిందీభాషలోని అనువదించింది.

రచనల జాబితా

ఈమె అనువదించిన పుస్తకాల పాక్షిక జాబితా:

తెలుగు

  1. మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు
  2. అసురుడు (మూలం: ఆనంద నీలకంఠన్)
  3. కథాభారతి
  4. కథ కాని కథ
  5. అజేయుడు (మూలం: ఆనంద నీలకంఠన్)
  6. ఇంట్లో ప్రేమ్‌చంద్: ప్రేమ్‌చంద్ జీవితచరిత్ర (మూలం:శివరాణీదేవి)
  7. రెక్కల ఏనుగులు
  8. ప్రేమ్‌చంద్ బాలసాహిత్యం - 13 కథలు
  9. సేపియన్స్ (మూలం: యువల్ నోఆ హరారీ)
  10. లక్ష్యాలు:ఆశించినదానికన్నా ముందే కోరుకున్నవన్నీ పొందండి (మూలం:బ్రియాన్ ట్రేసీ)
  11. అందరినీ ఆకట్టుకునే కళ:స్నేహం చేయడం ఎలా? ప్రజలను ప్రభావితం చేయడం ఎలా? (మూలం:డేల్ కార్నెగీ)
  12. ఆందోళన చెందకు ఆనందంగా జీవించు (మూలం:డేల్ కార్నెగీ)
  13. విప్లవం 2020: ప్రేమ, అవినీతి, ఆకాంక్ష (మూలం:చేతన్ భగత్)
  14. కలలరైలు (మూలం:కోల్‌సన్ వైట్‌హెడ్)
  15. రహస్యం (మూలం:రొండా బైర్నె)
  16. రెండు రాష్ట్రాలు: నా పెళ్ళికథ (మూలం:చేతన్ భగత్)
  17. పోషక ఔషధాలు (మూలం:రే డి స్ట్రాండ్)
  18. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు (మూలం: డేవిడ్ జోసఫ్ ష్వార్ట్జ్)
  19. చీకటి వెలుగులు (ఆత్మకథ, మూలం:బేబీ హాల్‌దార్)
  20. పోస్టు చెయ్యని ఉత్తరం (మూలం:టి.టి.రంగరాజన్)
  21. కలియుగారంభం: దుర్యోధనుడి మహాభారతం (మూలం: ఆనంద నీలకంఠన్)
  22. మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి (మూలం:జోసెఫ్ మర్ఫీ)

హిందీ

  1. పడాయి (మూలం:చదువు రచన- కొడవటిగంటి కుటుంబరావు, సాహిత్య అకాడమీ ప్రచురణ)
  2. సునహరీ ధూప (మూలం:సలీం)
  3. నయీ ఇమారతాకే ఖాందహర (మూలం:సలీం)
  4. అప్నారాస్తా (మూలం:అబ్బూరి ఛాయాదేవి)
  5. పంచామృత (మూలం:విజయభాస్కర్)
  6. విముక్త (మూలం:ఓల్గా)
  7. ఝరోఖా : సమకాలీన తెలుగు కహానియాఁ
  8. పెహచాన్ : ముసల్మాన్ స్త్రీయోఁ కి అస్తిత్వకే సంఘర్షణ్ కీ కహానియాఁ
  9. మోహనా! ఓ మోహనా! (మూలం:కె.శివారెడ్డి)

పురస్కారాలు

  • 2005 - భారతీయ అనువాద పరిషత్‌ వారి గార్గీ గుప్తాద్వివాగీశ్‌ అవార్డు.
  • 2014 - కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారం - ఇంట్లో ప్రేమ్‌చంద్ అనే పుస్తకానికి లభించింది.

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 01 Aug 2023. The contents are available under the CC BY-SA 4.0 license.