Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Bharatanatyam exponant, Choreographer | |
is | Dancer Choreographer | |
Work field | Dancing | |
Gender |
|
Biography
ప్రియదర్శిని గోవింద్ భరతనాట్య కళాకారిణి.
విశేషాలు
ఈమె 1965, ఫిబ్రవరి 1వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తొలుత తన 6వ యేటి నుండి ఉష వద్ద భరతనాట్యం అభ్యసించింది. తరువాత ఎస్.కె.రాజరత్నంపిళ్ళై వద్ద, కళానిధి నారాయణన్ వద్ద తన విద్యను మెరుగులు దిద్దుకుంది. ఈమె మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.కాం పట్టాపుచ్చుకుంది. మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా చదివింది.
వృత్తి
ఈమె 1974లో తన భరతనాట్య తొలి ప్రదర్శన గావించింది. అది మొదలు ఈమె అనేక సభలలో, నృత్యోత్సవాలలో తన నృత్యప్రదర్శనను ఇచ్చింది. మద్రాసు సంగీత అకాడమీ ఉత్సవాలు, ఖజురహో ఫెస్టివల్, సంగీత నాటక అకాడమీ స్వర్ణసమారోహం, నృత్య సంగం, రవీంద్ర ప్రణతి మొదలైన ఉత్సవాలలో నృత్యం చేసింది. ఇవి కాక టునీషియా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, అమెరికా మొదలైన దేశాలలో జరిగిన భారతీయ ఉత్సవాలలో తన భరతనాట్య ప్రదర్శనను గావించింది. ఈమె సోలో ప్రదర్శనలే కాక బాంబే జయశ్రీ, గౌరీ రామనారాయణ్, లీలా శాంసన్, టి.ఎం.కృష్ణ, ఉమయల్పురం కె.శివరామన్ వంటి కళాకారులతో కలిసి అనేక ప్రదర్శనలు చేసింది. వందేమాతరం, నేత్రు లుద్రు నలై, శృంగారం, శ్రీరంగం, శివశక్తి, ఓం నమో నారాయణ వంటి అనేక నృత్యనాటికలకు రూపకల్పన చేసింది. ఈమె దూరదర్శన్‌లో తిరుప్పావై పాశురాలకు భరతనాట్యాన్ని ప్రదర్శించింది. ఈమె అనేక సెమినార్లలో పాలుపంచుకుంది. నృత్యంపై అనేక సి.డి.లను విడుదల చేసింది.
పురస్కారాలు
ఈమె అనేక పురస్కారాలను, గౌరవాలను పొందింది. వాటిలో ముఖ్యమైన కొన్ని:
- 1998లో తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రం వారిచే కళైమామణి
- 1998లో శ్రీకృష్ణ గానసభ వారిచే "నృత్యచూడామణి"
- 2000లో భారత్ కళాకార్ వారిచే "యువకళాభారతి"
- సుర్ సింగార్ సన్సద్, ముంబై వారిచే "శృంగారమణి"
- శ్రీ భరతాలయ, చెన్నై వారిచే "కె.వి.మహదేవన్ అవార్డ్"
- 2012లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు