Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Telugu Writer |
is | Writer |
Biography
పింగళి చైతన్య తెలుగు కథ, సినిమా రచయిత్రి. ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2016 లభించింది. ఫిదా, నేల టికెట్టు సినిమాలకు పాటలు కూడా రాసింది.
జీవిత విశేషాలు
చైతన్య పుట్టింది విజయవాడ అయినా పెరిగింది కోదాడ దగ్గర నందిగామలో. ఆమె భారతదేశ జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్యసమరయోధుడు పింగళి వెంకయ్య మునిమనవరాలు. ఆమె తండ్రి పాత్రికేయులు పింగళి దశరధరామ్. ఆయన "ఎన్‌కౌంటర్" పత్రిక ద్వారా తెలుగునాట సంచలనం సృష్టించిన వ్యక్తి.
రచనా ప్రస్థానం
చైతన్య రచించిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ అనే కథల సంపుటి అవార్డుకు ఎంపికయింది. ఆమె ప్రయోగాత్మక కథా రచనలో విమర్శకుల ప్రసంశలను అందుకొన్నారు. పురస్కార గ్రహీతకు మెమొంటో, 50 వేలు నగదు అందజేస్తారు. దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారం ప్రకటించారు. అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ నేతృత్వంలో ఇంఫాల్‌లో జరిగిన సమావేశంలో ఈ అవార్డుల ఎంపిక జరిగింది.
తండ్రి పింగళి దశరథరామ్ సోషలిస్టు. చైతన్య చిన్నప్పుడే ఆయన హత్యకు గురయ్యారు. ఇప్పటివరకు చైతన్య రెండు పుస్తకాలు రాసింది. ఒకటి చిట్టాగాంగ్ విప్లవ వనితలు, రెండోది మనససులో వెన్నెల. ఈమె విజయవిహారం పత్రికలో కొంతకాలం పనిచేసింది.
సినిమా రంగం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఫిదాకి కో-రైటర్‌గా చేసింది. అంతేకాకుండా ఫిదా సినిమాలో 'ఊసుపోదు ఊరుకోదు', 'ఫిదా ఫిదా', నేల టికెట్ సినిమాలో 'బిజిలి', 'విన్నానులే', లవ్ స్టోరీ (2020) సినిమాలో 'ఏయ్ పిల్ల', మసూద (2022) సినిమాలో 'దాచి దాచి' వంటి పాటలు రాసింది.
రచనలు
- చిట్టగాంగ్ విప్లవ వనితలు.
- మనసులో వెన్నెల
మూలాలు
ఇతర లింకులు
- Chaitanya Pingali Speech
- Chaitanya Pingali Gets Sahitya Akademi Yuva Puraskar - Watch Exclusive
- చిట్టగాంగ్ వీరవనితల చైతన్య వారసత్వం Archived 2016-06-22 at the Wayback Machine