Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Telugu poet | |
Places | India | |
is | Writer Poet | |
Work field | Literature | |
Gender |
|
Biography
ఓలేటి పార్వతీశం (1882 - 1955) ఒక కవి. ఈయన పిఠాపురం వాస్తవ్యులు, వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు. ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో వీరు తెలుగు జంటకవులుగా బాలాంత్రపు వేంకటరావుతో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.
జీవిత విశేషాలు
అతను 1882లో జన్మించాడు. అతను బాలాంత్రపు వేంకటరావు తో సంయుక్తంగా అనేక పుస్తకాలను గద్య, పద్యాలలో రాశాడు. వారు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల పతాకంపై ప్రచురించబడిన బెంగాలీ, హిందీ, మరాఠీ నవలల అనువాదాల ద్వారా తెలుగు నవల అభివృద్ధికి సహకారం అందించారు. వీరు కాకినాడలో నివసించారు. పిఠాపురం రాజాస్థాన పోషణలో ఉండేవారు.
రచనలు
వేంకట పార్వతీశ కవులుగా "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".
వ్యక్తిగత జీవితం
ఆయనకి ఇరువురు కుమారులు మొదటి వారు ఓలేటి అచ్యుత రామచంద్ర మూర్తి , రెండవ వారు ఓలేటి శశాంక (ఓలేటి సుబ్బారావు) గేయకవిగా, భావకవిగా ప్రసిద్ధి చెందాడు. శశాంక కుమారుడు ఓలేటి పార్వతీశం. కవిరాజహంస బిరుదాంకితులైన ఓలేటి పార్వతీశం 1955లో మరణించారు.
బాలాంత్రపు_వేంకటరావు తో కలిసి జంటగా రచించినవి
- ఇందిర (నవల)
- అరణ్యక (నవల)
- ఉన్మాదిని (నవల)
- సీతారామము (నవల)
- సీతాదేవి వనవాసము (నవల)
- నిరద (నవల)
- నీలాంబరి (నవల)
- ప్రణయకోపము (నవల)
- ప్రతిజ్ఞా పాలనము (నవల)
- ప్రభావతి (నవల)
- ప్రమదావనము (నవల)
- శ్యామల (నవల)
- శకుంతల (నవల)
- చందమామ (నవల)
- రాజసింహ (నవల)
- వసుమతీ వసంతము (నవల)
- వీరపూజ (నవల)
- రాజభక్తి (నవల)
- వంగవిజేత (నవల)
- లక్షరూపాయలు (నవల)
- మనోరమ (నవల)
- మాతృ మందిరము (నవల)
- మాయావి (నవల)
- హారావళి (నవల)
- రజని (నవల)
- సాధన (నవల)
- కృష్ణకాంతుని మరణశాసనము (నవల)
- పరిమళ (నవల)
- సంతాపకుడు (నవల)
- చిత్రకథా సుధాలహరి (నవల)
- కావ్యకుసుమావళి (పద్యకావ్యము)
- బృందావనము (పద్యకావ్యము)
- ఏకాంతసేవ (పద్యకావ్యము)
ఓలేటి పార్వతీశం (మనుమడు)
అతని మనుమడు ఓలేటి పార్వతీశం కూడా కవి, రచయిత. అతను ఆకాశవాణి కడప కేంద్రంలో 1978లో చేరి దూరదర్శన్‌కు బదలీమీద 1981 లో వెళ్ళాడు. అక్కడే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 1988 లో UPSC ద్వారా ఎంపికయ్యాడు. అతను సాహిత్య కార్యక్రమాల రూపకల్పనలో ఆయన మేటి.