Mocherla Ramakrishnaiah

Telugu poet, lawyer
The basics

Quick Facts

IntroTelugu poet, lawyer
isWriter Poet Lawyer
Work fieldLaw Literature
Gender
Male
Birth1904
Notable Works
Gangalahari 
The details

Biography

మోచర్ల రామకృష్ణకవి

మోచర్ల రామకృష్ణయ్య నెల్లూరు మండలానికి చెందిన కవి, రచయిత, నటుడు. ఇతడు వకీలు వృత్తిని స్వీకరించాడు.

విశేషాలు

ఇతడు 1904 మే 27వ తేదీన ప్రకాశం జిల్లా, తూరుపునాయుడుపాలెం గ్రామంలో రామలింగయ్య, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు 18వ శతాబ్దంలో తమ ఆశుకవిత్వంతో పేరుగాంచిన మోచర్ల వెంకన్న, దత్తన్న సోదరకవులలో దత్తన్న వంశానికి చెందినవాడు. ఇతడు బాల్యం నుండే పద్య విద్యలో పాండిత్యాన్ని సంపాదించాడు. వచన రచనలోను, ఉపన్యాస కళలోను ఇతనికి ప్రవేశముంది. ఇతడు 30కి పైగా రచనలు చేశాడు. ఇతడు రచయితగానే కాక, న్యాయవాదిగా కూడా రాణించాడు.

రచనలు

  1. మారుతి
  2. ప్రచండ భార్గవము
  3. ఆత్మబోధ
  4. రమణానందలహరి
  5. గిరిజాకళ్యాణము
  6. అమర గౌరవము
  7. త్యాగమహిమ
  8. శ్రీభగవద్గీతా ప్రాశస్త్యము
  9. ప్రేమలీల (సాంఘిక నాటకం - మామిడిపూడి రామకృష్ణయ్యతో కలిసి)
  10. గురుదేవ చరిత్రము
  11. అమృత కలశము
  12. లక్ష్మీకటాక్షము
  13. ఉన్నత దీక్షితము
  14. గంగాలహరి (1937)

బిరుదములు

  • కవిశేఖర
  • ప్రసన్నమధురకవి
  • సాహిత్యరత్న

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 25 Apr 2024. The contents are available under the CC BY-SA 4.0 license.