Malladi Gopalakrishna

Telugu Theatre Actor, Practitioner
The basics

Quick Facts

IntroTelugu Theatre Actor, Practitioner
PlacesIndia
isActor
Gender
Male
Birth22 September 1948, Vijayawada, Vijayawada (urban) mandal, Krishna district, India
Age75 years
Star signVirgo
The details

Biography

మల్లాది గోపాలకృష్ణ రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.

జననం

గోపాలకృష్ణ 1948, సెప్టెంబరు 22 న సుబ్బారావు, జయలక్ష్మీ దంపతులకు విజయవాడలో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

చిన్నతనంలో ఏడిద కామేశ్వరరావు (రేడియో అన్నయ్య) ప్రోత్సాహంతో ఆకాశవాణి బాలానందం కార్యక్రమాలలో పాల్గొనడంతో గోపాలకృష్ణకి నాటకాలపై అభిరుచి ఏర్పడింది. రేడియో అన్నయ్య రచించిన నాటకాల్లో ముఖ్యపాత్రల్లో నటించడం ద్వారా వాచికాభినయంలో మెరుగులు దిద్దుకున్నాడు. క్రమక్రమంగా రంగస్థలంపై చిన్నచిన్న పాత్రలలో నటించడం ద్వారా గోపాలకృష్ణ నాటక జీవితం ప్రారంభమైంది.

గుంటూరులో గురజాల కృష్ణమూర్తి, మంచికంటి కామేశ్వరరావు, కృష్ణారావు, సోమశేఖర్, రాజాజీ, గబ్బిట మొదలైనవారితో కలసి మూడు సంవత్సరాలునాటకాల్లో పాల్గొని, తన నటనా సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. ఆ తరువాత విజయవాడలో జి.ఎస్.ఆర్. మూర్తి శిష్యరికంలో, దర్శకత్వంలో జగపతిరాజు, అన్నపూర్ణ, అడవి శంకరరావు, సంజీవి ముదిలి, సీతాలత, జి.ఎస్.ఆర్.కె. శాస్త్రి, సి.హెచ్. కబీర్ దాస్, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, విజయరాం, జంధ్యాల, సి. మోహనరావు, నండూరి సుబ్బారావు, కోకా సంజీవరావు, వాసుదేవమూర్తి, మురళీమోహన్, శివరామిరెడ్డి మొదలైన వారితో కలిసి అనేక నాటకాలలో నటించాడు.

ఎ.ఆర్.కృష్ణ ఆధ్వర్యంలో సాగిన ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్సిట్యూట్ అండ్ రిపర్టరీలో నటశిక్షణలో చేరి విద్యార్థిగా చేరి నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. అటుతర్వాత అదే సంస్థలో ఆహార్యాభినయంలో అధ్యాపకునిగా చేరాడు. అనేక శిక్షణ శిబిరాల్లో ఆహార్యాభినయం, వాచికాభినయం అంశాలలో ఔత్సాహిక నటులకు శిక్షణలిచ్చాడు.

ఆహార్యం మీద దృష్టి సారించిన గోపాలకృష్ణ శాస్త్రీయ పద్ధతులలో మెళకువలు నేర్చుకొని, రూపశిల్పాన్ని వృత్తిగా స్వీకరించాడు. తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో ఆహార్యంపై శిక్షణలు ఇచ్చాడు. 2003లో శ్రీనాథుడు చారిత్రక నాటక ప్రదర్శనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలులో పర్యటించాడు. తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలోని విద్యార్థులకు ఆహార్యంలో శిక్షణ ఇస్తున్నాడు.

నటించినవి

  1. కన్యాశుల్కం
  2. పునర్జన్మ
  3. ఆశ్రయం
  4. సిద్ధార్థ
  5. కళ్ళు
  6. లాభం
  7. కొడుకుపుట్టాల
  8. వెంకన్నకాపురం
  9. సహాధ్యాయుడు
  10. మిత్రుడూ
  11. అభిజ్ఞాన శాకుంతలం
  12. శ్రీకృష్ణరాయభారం
  13. ఆశ

దర్శకత్వం

  1. పాండవ విజయం

బహుమతులు

  • నంది బహుమతులు:
  1. ఉత్తమ ఆహార్యం - ఒక ఒరలో నాలుగు నిజాలు - మొదటి నంది పరిషత్తు
  • ఇతర బహుమతులు:
  1. ఉత్తమ ఆహార్యం - చెంగల్వపూదండ (నాటిక) - అల్లూరి సీతారామరాజు కళా వేదిక, కాకినాడ, 2013.

పురస్కారాలు

  • నాటకరంగం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం-2019 (తెలుగు విశ్వవిద్యాలయం, 2022 సెప్టెంబరు 15)
  • భజరప్ప రంగస్థల పురస్కారం - సిరిమువ్వ కల్చరల్ హైదరాబాదు (రవీంద్రభారతి, 2022 సెప్టెంబరు 1)

మూలాలు

ఇతర లంకెలు

The contents of this page are sourced from Wikipedia article on 06 Jun 2024. The contents are available under the CC BY-SA 4.0 license.