Lahari Gudivada

Indian actress
The basics

Quick Facts

IntroIndian actress
PlacesIndia
isActor
Work fieldFilm, TV, Stage & Radio
Gender
Female
Birth1988
Age37 years
The details

Biography

లహరి గుడివాడ ప్రముఖ రంగస్థల నటీమణి. 2014లో రంగస్థలంపై అడుగు పెట్టిన లహరి, ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

జననం - విద్యాభ్యాసం

లహరి 1988, ఏప్రిల్ 1న గుంటూరులో జన్మించింది. తండ్రి వ్యాపారి, తల్లి జూనియర్ కళాశాల అధ్యాపకురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన లహరి, ప్రస్తుతం పర్యాటకశాస్త్రంలో పి.జి. చదువుతుంది.

నటనపై ఆసక్తి

హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలను నడుపుతున్న సమయంలో నటనపై ఈటీవి పరిపూర్ణ మహిళ కార్యక్రమంలో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. స్మైల్ రాణి స్మైల్, డ్యాన్స్-2001, ఛాలెంజ్-2002 పోటీల్లో విజేతగా నిలిచింది.

రంగస్థల ప్రస్థానం

లహరి 2014లో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొన్నది. అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

నటించినవి

పెళ్లిచేసి చూడు, వైనాట్, పోవోయి అనుకోని అతిథి, రెండు నిశబ్ధాల మధ్య, బ్రతకనివ్వండి, ఆశ్రిత, అభయ, పల్లవి అనుపల్లవి, ఆఖరి ఉత్తరం, బైపాస్, సరికొత్త మనుషులు, అరసున్న, నిషిద్దాక్షరి, తగునా ఇది భామా, ఇరుసంధ్యలు, గోవు మాలచ్చిమి, బతుకుచిత్రం, గుర్తు తెలియని శవం, నల్లజర్ల రోడ్డు, మొల్ల (పద్యనాటకం), భక్తకన్నప్ప, పాదుకా పట్టాభిషేకం, శ్రీకృష్ణదేవరాయలు, సౌదామిని, జ్యోతీరావ్ పూలే, పల్నాటి యుద్ధం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, తొక్క తీస్తా, కొత్తనీరు, బతుకుచిత్రం, నా గూడు, సిగ్గు, మా ప్రేమకు న్యాయం కావాలి, కెరటాలు, ఆలీతో సరదాగా వంటి నాటక, నాటికలలో నటించింది.

బహుమతులు

  1. ఉత్తమనటి - రెండు నిశబ్దాల మద్యం (నాటిక), 2015 (చిలకలూరిపేట కళా పరిషత్ 5వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (మార్చి 29-31, 2015), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)
  2. ఉత్తమనటి - పోవోయి అనుకోని అతిథి (నాటిక), 2016 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)
  3. ఉత్తమనటి - బ్రతకనివ్వండి (నాటకం) (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017, పల్లెకోన)
  4. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్, లింగారావుపాలెం)
  5. ఉత్తమనటి - అంతా మన సంచికే (నాటిక), 2017 (ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ), 16వ నాటకోత్సవం
  6. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (కళాసాగర్, బుచ్చిరెడ్డిపాలెం)
  7. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (టి.జి.వి. రస కళాపరిషత్, కర్నూలు)
  8. ఉత్తమనటి - అభయ (నాటిక), 2017 (సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌, 47వ వార్షిక జాతీయస్థాయి నాటిక పోటీలు తిరుపతి)
  9. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), మే 30,31, 2017 జూన్ 1 (శ్రీకాకుళం జిల్లా కవిటి, బొరివంక)
  10. ఉత్తమనటి - అభయ (నాటిక), జూన్ 8,9,10, 2017 (హర్ష క్రియేషన్స్, విజయవాడ)
  11. ఉత్తమ ద్వితీయ నటి - ఆశ్రిత (నాటిక), 2016 (కొండవీటి కళాపరిషత్, లింగారావుపాలెం)
  12. ఉత్తమనటి - అక్క అలుగుడు... చెల్లి సణుగుడు (నాటిక), 2017 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)
  13. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), నవంబరు 11-13, (నటరత్న నాటక పరిషత్ -2017, విజయనగరం)
  14. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), డిసెంబరు 27-30, 2017, (డా. నందమూరి తారకరామారావు కళాపరిషత్, తెనాలి, కీ.శే. పోలేపెద్ది నరసింహమూర్తి & తుమ్మల వెంకట్రామయ్య స్మారక రాష్ట్రస్థాయి 10వ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు)
  15. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - అభినయ నాటక పరిషత్, 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (జనవరి 12,13,14 - 2018), (పొనుగుపాడు, గుంటూరు జిల్లా)
  16. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 12-16, 2018), (చోడవరం, విశాఖపట్టణం జిల్లా)
  17. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నరసరావుపేట రంగస్థలి, రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 23-25, 2018), (నరసరావుపేట, గుంటూరు జిల్లా)
  18. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - గరికిపాటి ఆర్ట్ థియేటర్, 6వ జాతీయస్థాయి నాటిక పోటీలు (మార్చి 23-25, 2018), (ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా)
  19. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - శ్రీ సుమిత్ర కళాసమితి జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (మార్చి 27-30, 2018), (శ్రీకాకుళం)
  20. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - వీరవాసరం కళాపరిషత్ నాటక పోటీలు (మార్చి 27-30, 2018), (వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా)
  21. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - చిలకలూరిపేట కళా పరిషత్ 8వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 1-3, 2018), (చిలకలూరి పేట, గుంటూరు జిల్లా)
  22. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కొండవీటి కళాపరిషత్ 21వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 14-16, 2018), లింగారావుపాలెం)
  23. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - కళారంజని నాటక అకాడమీ సప్తమ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 16-18, 2018), (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
  24. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - లావు వెంకటేశ్వర్లు & కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ 4వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 19-21, 2018), (వరగాని, గుంటూరు జిల్లా)
  25. ఉత్తమనటి - కొత్తనీరు (నాటిక) - యూత్ క్లబ్ నాటక పరిషత్ తెలుగు నాటిక పోటీలు (ఏప్రిల్ 22-24, 2018), (కొంతేరు)
  26. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - శ్రీకారం & రోటరీ కళాపరిషత్ 10వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 24-26, 2018), (మార్టూరు, ప్రకాశం జిల్లా)
  27. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కళాసాగర్ జాతీయస్థాయి నాటిక పోటీలు (ఏప్రిల్ 27-29, 2018), (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా)
  28. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - కళాంజలి నాటిక పోటీలు (ఏప్రిల్ 29 - 2018 మే 2), (చీరాల, ప్రకాశం జిల్లా)
  29. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక) (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2018, పల్లెకోన, ఖమ్మం)
  30. ఉత్తమనటన - బతుకు చిత్రం (నాటిక) - నాగులపాలెం 20వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలు, (నాగులపాలెం, ప్రకాశం జిల్లా)
  31. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - పొన్నూరు కళా పరిషత్ 19వ తెలుగు రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (మే 11 - 13, 2018), (పొన్నూరు, గుంటూరు జిల్లా)
  32. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - దర్శనాపూరి నాటక కళా పరిషత్ 9వ నాటిక పోటీలు (మే 11 - 14, 2018), (దర్శి, ప్రకాశం జిల్లా)
  33. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - చైతన్యభారతి నాటక పరిషత్ అఖిల భారత స్థాయి సాంఘిక నాటిక పోటీలు (మే 14 - 16, 2018), (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
  34. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నల్లమల్లి మూలరెడ్డి కళా పరిషత్ 28వ జాతీయస్థాయి నాటిక పోటీలు, (జూన్ 7-10, 2018), రామవరం, తూర్పు గోదావరి జిల్లా
  35. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), (సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌, 47వ వార్షిక జాతీయస్థాయి నాటిక పోటీలు, 2018 జూన్ 17 తిరుపతి)
  36. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - డా.అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి నాటికల పోటీ (సెప్టెంబరు 10 - 12, 2018), (విజయవాడ, కృష్ణా జిల్లా)

సత్కారాలు

  1. ఉషోదయా కళానికేతన్, గుంటూరు వారి సత్కారం

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 29 Mar 2020. The contents are available under the CC BY-SA 4.0 license.